పలికెను ఏదో రాగం
చిత్రం : సంఘం చెక్కిన శిల్పాలు (1979)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు
పల్లవి :
పలికెను ఏదో రాగం...
పలికెను ఏదో రాగం... అలివేణి కళ్యాణి
అలివేణి.. ఓ.. కళ్యాణి
నా లలిత శృంగార మందారవనిలోనా
పలికెను ఏదో రాగం...
పలికెను ఏదో రాగం...
చరణం 1 :
నీ నయనాలే కాటుకకు నీలిమ నేర్పెనని..
ఈ.. ఈ..
నీ నయనాలే కాటుకకు నీలిమ నేర్పెనని
నీ నును పెదవి కెంపులకు
అరుణిమ సమకూర్చెనని
మలయపవనం తెలుపగా విని..
ప్రభవించే నాలో ప్రణయ భావ ధుని
పలికెను ఏదో రాగం...
పలికెను ఏదో రాగం...
చరణం 2 :
నీ నగుమోమే కుంకుమకు నిగ్గులు తీర్చేనని..
ఈ.. ఈ..
నీ నగుమోమే కుంకుమకు నిగ్గులు తీర్చేనని
నీ పాదాలే పారాణికి నవ రూపం దిద్దేనని
వలచే నా హృది తెలుపగా విని
కల్యాణ భావన కలిగెను విరిబోణి
పలికెను ఏదో రాగం...
పలికెను ఏదో రాగం... అలివేణి కళ్యాణి
అలివేణి.. ఓ.. కళ్యాణి
నా లలిత శృంగార మందార వనిలోనా
పలికెను ఏదో రాగం...
పలికెను ఏదో రాగం...
పాటల ధనుస్సు