RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
S janaki లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
S janaki లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, మే 2026, గురువారం

నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే | Nallavade Ammammo (Sad) | Song Lyrics | Dasara Bullodu (1971)

నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే


చిత్రం: దసరా బుల్లోడు (1971)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

గానం: సుశీల, జానకి


పల్లవి : 


నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే

నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే

చిన్నవాడే ఓయమ్మ 

రాధకే చిక్కినాడే

లేదమ్మా లేదు 

రుక్మిణికే దక్కినాడె


నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే

చిన్నవాడే ఓయమ్మ 

రాధకే చిక్కినాడే

లేదమ్మా లేదు 

రుక్మిణికే దక్కినాడె

నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే


చరణం  1 :


వెన్నెవంటి మనసున్న 

చిన్నవాడే

చిన్న నాటినుండి నువ్వు 

కోరుకొన్నవాడే

వెన్నెవంటి మనసున్న 

చిన్నవాడే

చిన్న నాటినుండి నువ్వు 

కోరుకొన్నవాడే


ప్రేమకే బానిసైపోతాడే

కాదమ్మ భక్తికే దాసుడై వుంటాడే

ప్రేమకే బానిసైపోతాడే

కాదమ్మ భక్తికే దాసుడై వుంటాడే


నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే

చిన్నవాడే ఓయమ్మ 

రాధకే చిక్కినాడే

లేదమ్మా లేదు 

రుక్మిణికే దక్కినాడె

నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే


చరణం  2 :


నువ్వు వాని వరస వున్నదానివీ

నువ్వు వలపుదోచుకొన్నదానివీ

నువ్వు వాని వరస వున్నదానివీ

నువ్వు వలపుదోచుకొన్నదానివీ


మనసిచ్చి మాట 

పుచ్చుకొంటివీ

నీ మనసిచ్చి మాట 

పుచ్చుకొంటివీ

మంచితనముతో నువ్వు 

గెలుచుకొంటివీ


నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే


చరణం  3 : 


రాధా కృష్ణులు కథలేనమ్మా

వారు ఎన్నడూ ఆలుమగలు 

కాలేదమ్మా

రాధా కృష్ణులు కథలేనమ్మా

వారు ఎన్నడూ ఆలుమగలు 

కాలేదమ్మా

రాధా కృష్ణుల ప్రేమే పవిత్రమూ

లోకానికే అది ఆదర్శమూ

రాధా కృష్ణుల ప్రేమే పవిత్రమూ

లోకానికే అది ఆదర్శమూ


గోపాల బాలుడూ...

నీ ప్రేమలోలుడూ

గోపాల కృష్ణుడూ...

నీ పాలి దేవుడు

గోపాల బాలుడూ...

నీ ప్రేమలోలుడూ

గోపాల కృష్ణుడూ...

నీ పాలి దేవుడు


వాడు నీ వాడే... 

కాదు నీ వాడే

వాడు నీ వాడే... 

కాదు కాదు కానేకాడు


నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే...


- పాటల ధనుస్సు 


17, ఏప్రిల్ 2025, గురువారం

నేడే తెలిసింది ఈనాడే తెలిసింది | Nede Telisindi | Song Lyrics | Aradhana (1976)

నేడే తెలిసింది ఈనాడే తెలిసింది



చిత్రం: ఆరాధన (1976)

సంగీతం: ఎస్. హనుమంతరావు

గీతరచయిత: సి నారాయణ రెడ్డి 

నేపధ్య గానం: మహమ్మద్ రఫీ, జానకి


పల్లవి:


నేడే ..తెలిసింది.. ఈనాడే తెలిసింది


నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది

కమ్మని కలకే రూపం వస్తే...ఏ...

కమ్మని కలకే రూపం వస్తే .. 

అది నీలాగే ఉంటుందనీ

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది


నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది

తీయని పాటకు ప్రాణం వస్తే ...ఏ...

తీయని పాటకు ప్రాణం వస్తే .. 

అది నీలాగే ఉంటుందనీ

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది


చరణం 1:


ఇంత మంచి రూపానికి .. 

అంత మంచి మనసుంటుందని

ఇంత మంచి రూపానికి .. 

అంత మంచి మనసుంటుందని

ఆ మనసున అంతరాలకు 

తావన్నది లేనే లేదని

ఆ మనసున అంతరాలకు 

తావన్నది లేనే లేదని

అది వలచే దొకసారే ననీ ...

ఆ వలపే విడిపో లేనిదనీ

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది...


చరణం 2:


ఆఁ......ఆ...ఆ...ఆ....ఆ..ఆ...

ఆఁ......ఆ...ఆ...ఆ....ఆ..ఆ...


మారుమూల పల్లెలోన ..

మధుర గానముదయించేనని

మారుమూల పల్లెలోన ..

మధుర గానముదయించేనని

శిలలకైన ఆ గానం... 

పులకింతలు కలిగించేననీ

శిలలకైన ఆ గానం ...

పులకింతలు కలిగించేననీ

అది జతగా నను చేరాలని ..

నా బ్రతుకే శృతి చేయాలని


నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది

కమ్మని కలకే రూపం వస్తే .. 

అది నీలాగే ఉంటుందనీ

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది ...

తీయని పాటకు ప్రాణం వస్తే .. 

అది నీలాగే ఉంటుందనీ


నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది...

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది..


- పాటల ధనుస్సు 


12, జూన్ 2022, ఆదివారం

పిలిచారు మావారు | Pilicharu maavaru | Song Lyrics | Pandanti Jeevitham (1981)

పిలిచారు మావారు



చిత్రం : పండంటి జీవితం (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  జానకి 


పల్లవి : 


పిలిచారు మావారు ఇన్నాళ్ళకి

పలికారు వీడ్కోలు కన్నీళ్ళకి

పిలిచారు మావారు ఇన్నాళ్ళకి

పలికారు వీడ్కోలు కన్నీళ్ళకి 


తూరుపు పడమర లేక..

సూర్యుడే లేడని..

భార్యని భర్తని కలపని..

జీవుడే ఉండడని.. 


ఆ ఆ ఆ ఆ ఆ

పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి

పలికారు వీడ్కోలు..కన్నీళ్ళకి

పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి 


చరణం 1 :


ఇలకు జారని పిలుపు..ఊ..

కడలి చేరని వాగు..ఊ

ఇలకు జారనిపిలుపు..

కడలి చేరని వాగు

భర్త ఒడిని గుడి కట్టని 

భార్య బ్రతుకు లేదని..ఈ

తెలిసింది నా జీవన 

సంధ్యా సమయంలో

అందుకనే..  అందుకనే.. వస్తున్నా 

ఉదయించిన హృదయంతో

ఉదయించిన హృదయంతో.... ఓ... ఓ


పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి

పలికారు వీడ్కోలు..కన్నీళ్ళకి

పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి  


చరణం 2 :


పసుపు కుంకుమ చిందే... 

పడతి జన్మ ధన్యం..

పసుపు కుంకుమ చిందే... 

పడతి జన్మ ధన్యం

పతి మమతే ఏనాటికి... 

పతికి నిత్య సౌభాగ్యం

తెలిసింది అరుంధతి... 

మెరిసిన ఈ సమయంలో

అందుకనే..  అందుకనే..  వస్తున్నా 

పండిన నా ప్రణయం తో

పండిన నా ప్రణయం తో....ఓ... 


పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి


పాటల ధనుస్సు

30, మే 2022, సోమవారం

వెన్నెలైనా చీకటైనా | Vennelaina Cheekataina | Song Lyrics | Pachani Kapuram (1985)

 వెన్నెలైనా చీకటైనా



చిత్రం:  పచ్చని కాపురం (1985)

సంగీతం:  చక్రవర్తి

గీతరచయిత:  సినారె

నేపధ్య గానం:  ఏసుదాస్, జానకి



పల్లవి:


    ఆ..ఆ..ఆ..


    వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా

    నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము

    ఏ జన్మదో ఈ బంధము.. ఏ జన్మదో ఈ బంధము

    నింగి నేల సాక్ష్యాలు.. నింగి నేల సాక్ష్యాలు

    ప్రేమకు మనమే తీరాలు


    వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా

    నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము


చరణం 1:


    జ్ఞాపకమేదో.. నీడల్లె తారాడే.. 

స్వప్నాలేవో.. నీ కళ్ళ దోగాడే

    కౌగిలింతలోన గాలి ఆడకూడదు.. 

చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు

    నీ సర్వమూ.. నాదైనదీ..

    నేను దేహమల్లె.. నీవు ప్రాణమల్లె 

ఏకమైన రాసలీలలోనా..


    వెన్నెలైనా.. చీకటైనా.. 

చేరువైనా.. దూరమైనా


చరణం 2:


    అంతంలేనీ.. నీ రాగ బంధంలో.. 

అంచున నిలిచీ.. నీ వైపే చూస్తున్నా

    పున్నమింత కట్టుకున్న పూలడోలలు.. 

ఎన్నడింక చెప్పవమ్మ బాలసారలు

    ఆ ముద్దులే.. మూడైనవీ..

    బాలచంద్రుడొస్తే.. నూలుపోగులిస్తా.. 

ఇంటి దీపమయ్యేదింకా ప్రేమా


    వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా

    నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము

    ఏ జన్మదో ఈ బంధము.. ఏ జన్మదో ఈ బంధము

    నింగి నేల సాక్ష్యాలు.. నింగి నేల సాక్ష్యాలు

    ప్రేమకు మనమే తీరాలు..


- పాటల ధనుస్సు

27, మార్చి 2022, ఆదివారం

ప్రేమతో చిలక మడుపు సేవలా | Prematho Chilaka Madupu | Song Lyrics | Bamma Mata Bangaru Bata (1990)

ప్రేమతో చిలక మడుపు సేవలా



Lyrics - Veturi, 

Movie - Baamma Maata Bangaaru Baata, (1990)

Singer - Janaki, 

Singer - SP Balasubrahmanyam

Music : SP Balu



ప్రేమతో చిలక మడుపు సేవలా

ప్రేమతో చిలక మడుపు సేవలా

సిగ్గుతో చిలిపి వలపు పూజలా


ప్రేమతో చిలక మడుపు సేవలా

సిగ్గుతో చిలిపి వలపు పూజలా

ప్రేమతో చిలక మడుపు సేవలా

సిగ్గుతో చిలిపి వలపు పూజలా

మొగ్గ విచ్చుకున్నవేళ కలువ భామ

ముద్దుల్లని లెక్కపెట్టే చందమామ

ప్రేమతో చిలక మడుపు సేవలా

సిగ్గుతో చిలిపి వలపు పూజలా


గుట్టులేని గుండేలో గుచ్చి గుచ్చి చూడకు

మల్లెపూల దండలో ధారమిక దాచకు

కొంటెగా చూడకు కోతి సిగ్గు మాత్రము

కంటితో తుంచని కన్నెజాజి పుష్పము

రేగుతున్న యెవ్వన్నం వేగుచుక్క కోరిన

కాగుతున్న పాలలో మీగడిక దాగున

ప్రేమతో చిలక మడుపు సేవలా

సిగ్గుతో చిలిపి వలపు పూజలా

మొగ్గ విచ్చుకున్నవేళ కలువ భామ

ముద్దుల్లని లెక్కపెట్టే చందమామ

ప్రేమతో చిలక మడుపు సేవలా

సిగ్గుతో చిలిపి వలపు పూజలా


పాటల ధనుస్సు


23, ఫిబ్రవరి 2022, బుధవారం

నీకేలా ఇంత నిరాశా | Neekela Intha Nirasa | Song Lyrics | Aradhana (1976)

నీకేలా ఇంత నిరాశా



చిత్రం: ఆరాధన (1976)

సంగీతం: ఎస్. హనుమంతరావు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: జానకి



పల్లవి:


నీకేలా.. ఇంత నిరాశా...

నీకేలా.. ఇంత నిరాశా


నీకేలా.. ఇంత నిరాశా

నీకేలా.. ఇంత నిరాశా

నీ కన్నులలో కన్నీరేల

అంతా దేవుని లీల

అంతా దేవుని లీల

నీకేలా.. ఇంత నిరాశా..

నీకేలా.. ఇంత నిరాశా


చరణం 1:


ఆశ నిరాశలు దాగుడుమూతల

ఆటేలే ఈ లోకం.. ఆటేలే ఈ లోకం


కష్ట సుఖాల కలయికలోనే

ఉన్నదిలే మాధుర్యం.. జీవిత మాధుర్యం


చీకటి కొంత.. వెలుతురు కొంత

ఇంతే జీవితమంతా.. ఇంతే జీవితమంతా

నీకేలా.. ఇంత నిరాశా... నీకేలా.. ఇంత నిరాశా


చరణం 2:


నీ మదిలోని వేదనలన్నీ

నిలువవులే.. కలకాలం

నిలువవులే.. కలకాలం


వాడిన మోడు పూయక మానదు

వచ్చును.. వసంతకాలం

వచ్చును.. వసంత కాలం


నీతో నడచి నీడగ నడిచే

తోడుగ నేనున్నాను.. నీ తోడుగ నేనున్నాను

నీకేలా.. ఇంత నిరాశా.. నీకేలా.. ఇంత నిరాశా


- పాటల ధనుస్సు 

17, ఫిబ్రవరి 2022, గురువారం

నా పరువం నీకోసం | Na Paruvam Neekosam | Song Lyrics | Yugandhar (1979)

నా పరువం నీకోసం



చిత్రం : యుగంధర్  (1979)

 రచన : డా॥సి.నారాయణరెడ్డి

 సంగీతం : ఇళయరాజా

 గానం : ఎస్.జానకి


పల్లవి :

 నా పరువం నీకోసం...    

 పానుపువేసి ఉన్నదీ వాకిలి తీసి ఉన్నదీ

 కోరిక పండగా నిండుగా...

నా పరువం నీకోసం...    

 

 చరణం : 1

 రాకరాక వచ్చానోయి మీ ఇంటికి ఈ పొదరింటికీ

 లేకలేక నచ్చావోయి నా కంటికి నా చిగురొంటికీ

 ఈ సమయం నా హృదయం...    

 నిన్ను చూసి నాగులాగ ఊగుతున్నదీ చెలరేగుతున్నదీ

 నా పరువం నీకోసం...    

 చరణం : 2

 ఒక్కమాటు ఇక్కడే నువ్వుండిపోరా రుచులందుకోరా

 తియ్యగా నేనిప్పించేది తీసుకోరా ఆపై చూసుకోరా

 ఈ రోజూ ఇక రాదూ...    

 ఈ కన్నెవయసు అందుకేలే కాగుతున్నది సెగ కాచుకున్నది

 నా పరువం నీకోసం...    


- పాటల ధనుస్సు 

27, జనవరి 2022, గురువారం

ఆడది కోరుకునే వరాలు | Aadadi Korukune Varalu | Song Lyrics | Radhamma Pelli (1974)

 ఆడది కోరుకునే వరాలు రెండే రెండు

చిత్రం  :  రాధమ్మ పెళ్ళి (1974)
సంగీతం  :  రమేశ్ నాయుడు
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం  : జానకి


పల్లవి :

ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం..  చక్కని సంతానం
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం.. చక్కని సంతానం

చరణం 1 :

కాపురమే ఒక మందిరమై.. పతియే తన దైవమై
కాపురమే ఒక మందిరమై.. పతియే తన దైవమై
అతని సేవలో తన బ్రతుకే హారతి యైపోతే
అంతకుమించిన సౌభాగ్యం ఆడదానికేముంది..  

ఆడదానికింకేముంది
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం..  చక్కని సంతానం

చరణం 2 :

ఇల్లాలే ఒక తల్లియై..  చల్లని మమతల పాలవెల్లియై
తన పాప లాలనలో.. తాను కరిగిపోతే
ఇల్లాలే ఒక తల్లియై.. చల్లని మమతల పాలవెల్లియై
తన పాప లాలనలో.. తాను కరిగిపోతే
అంతకు మించిన ఆనందం ఆ తల్లికేముంది.. 

ఆ తల్లికింకేముంది   
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం..  చక్కని సంతానం
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం.. చక్కని సంతానం


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు