పిలిచారు మావారు
చిత్రం : పండంటి జీవితం (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : జానకి
పల్లవి :
పిలిచారు మావారు ఇన్నాళ్ళకి
పలికారు వీడ్కోలు కన్నీళ్ళకి
పిలిచారు మావారు ఇన్నాళ్ళకి
పలికారు వీడ్కోలు కన్నీళ్ళకి
తూరుపు పడమర లేక..సూర్యుడే లేడని..
భార్యని భర్తని కలపని..జీవుడే ఉండడని..
ఆ ఆ ఆ ఆ ఆ
పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి
పలికారు వీడ్కోలు..కన్నీళ్ళకి
పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి
చరణం 1 :
ఇలకు జారని పిలుపు..ఊ..కడలి చేరని వాగు..ఊ
ఇలకు జారనిపిలుపు..కడలి చేరని వాగు
భర్త ఒడిని గుడి కట్టని భార్య బ్రతుకు లేదని..ఈ
తెలిసింది నా జీవన సంధ్యా సమయంలో
అందుకనే.. అందుకనే.. వస్తున్నా
ఉదయించిన హృదయంతో
ఉదయించిన హృదయంతో.... ఓ... ఓ
పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి
పలికారు వీడ్కోలు..కన్నీళ్ళకి
పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి
చరణం 2 :
పసుపు కుంకుమ చిందే... పడతి జన్మ ధన్యం..
పసుపు కుంకుమ చిందే... పడతి జన్మ ధన్యం
పతి మమతే ఏనాటికి... పతికి నిత్య సౌభాగ్యం
తెలిసింది అరుంధతి... మెరిసిన ఈ సమయంలో
అందుకనే.. అందుకనే.. వస్తున్నా
పండిన నా ప్రణయం తో
పండిన నా ప్రణయం తో....ఓ...
పిలిచారు మావారు..ఇన్నాళ్ళకి
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి