RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

21, జూన్ 2022, మంగళవారం

అయ్య బాబోయ్‌ అదిరిపోయింది | Ayya baboi | Song Lyrics | Babu (1975)

అయ్య బాబోయ్‌ అదిరిపోయింది



చిత్రం :  బాబు (1975)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :

అయ్య బాబోయ్‌...

అయ్య బాబోయ్‌ అదిరిపోయింది...  

అయ్య బాబోయ్‌ అదిరిపోయింది

ఆడపిల్లతో ఇలాగేనా ఆటలాడేది చెలగాటమాడేది? 


అమ్మబాబోయ్‌..అదురుపుట్టింది..  

అమ్మబాబోయ్‌ అదురుపుట్టింది

హద్దుమీరితే ఆడదాన్ని ఏమి చేసేది..  

ఇంతకన్న ఏమిచేసేది? 



చరణం 1 :


కొలతలన్నీ తెలిసినవాడా...  

కొత కోసి కుట్టేవాడా..  బాబోయ్‌...

కొలతలన్నీ తెలిసినవాడా...  

కొత కోసి కుట్టేవాడా..

కుర్రదాని కోర్కెలన్నీ కొలిచి చూస్తావా.. 

గుండె కోస్తావా? 



షోకులమ్మె షాపులోన ఫోజులిచ్చే పిల్లదానా

గాజు బొమ్మకు చీర కడితే..

 గాజు బొమ్మకు చీర కడితే.. 

మోజు పుడుతుందా? ముద్దు వస్తుందా?   



అయ్య బాబోయ్‌ అదిరిపోయింది... 

అమ్మబాబోయ్‌  అదురుపుట్టింది 



చరణం 2 :  


నడుము చూడు ఇరవై అయిదే...  

ఛాతీ కొలత ముప్పై అయిదు

రెండు కలిపి లెక్క వేసి మనసు లొతెంతో 

తెలుసుకుంటావా?

చూపుతోనే లెక్కగట్టి వయసు 

ఎంతో చెప్పగలను..



మనసు లోతు చెప్పజాలనీ..

మనసు లోతు చెప్పజాలనీ...  

మనిషినేనమ్మా.. మరిచిపోవమ్మా    


    

అయ్య బాబోయ్‌ అదిరిపోయింది.. 

అమ్మబాబోయ్‌ అదురుపుట్టింది

హద్దుమీరితే ఆడదాన్ని ఏమి చేసేది? 

ఇంతకన్న ఏమిచేసేది?


పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు