RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, జూన్ 2022, ఆదివారం

ఎదుటే ఒక అందం | Edute oka andam | Song Lyrics | Pandanti Jeevitham (1981)

ఎదుటే ఒక అందం



చిత్రం : పండంటి జీవితం (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు



పల్లవి : 


ఎదుటే ఒక అందం... ఎదిగే అనుబంధం

ఎదుటే ఒక అందం... ఎదిగే అనుబంధం


ఏలా  ఈ పంతం... బాలా నా సొంతం

వలపు... వసంతం..

విరిసే ఈ వేళలో... పిలిచే రాగాలలో

ఎదుటే ఒక అందం... ఎదిగే అనుబంధం




చరణం 1 :



అలకలు రేపిన...  పులకలు చూడు

వలపుల తీయని... పిలుపులు చూడు

అలకలు రేపిన... పులకలు చూడు

వలపుల తీయని... పిలుపులు చూడు 


దాగని నవ్వులు దాచకులే ... 

సాగిన ఈ రథమాగదులే

నీ బెట్టులెందుకు... చెల్లవులే

చిరునవ్వో..అరనవ్వో..నవ్వాలిలే..

చిరునవ్వో..అరనవ్వో..నవ్వాలిలే


ఎదుటే ఒక అందం... ఎదిగే అనుబంధం

ఏలా ఈ పంతం... బాలా నా సొంతం

వలపు... వసంతం..

విరిసే ఈ వేళలో... పిలిచే రాగాలలో


ఎదుటే ఒక అందం... ఎదిగే అనుబంధం 




చరణం 2 :


హంసకు నడకలు నేర్పినదానా... 

నెమలికి నటనలు తెలిపినదానా

హంసకు నడకలు నేర్పినదానా... 

నెమలికి నటనలు తెలిపినదానా  


ఒంటరితనమిక సాగదులే...  

తుంటరి చూపులు సోకునులే

నీ పైట రెపరెపమన్నదిలే...  

ఆపైన ఏమైనా అడగకులే

ఆపైన ఏమైనా అడగకులే


ఎదుటే ఒక అందం... ఎదిగే అనుబంధం

ఏలా  ఈ పంతం... బాలా నా సొంతం

వలపు...  వసంతం

విరిసే ఈ వేళలో... పిలిచే రాగాలలో

లలలా..లలలాలా..లలలా..లలలాలా


 పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు