శ్రీమతి అని పిలిచేదాకా చిన్నదానా
చిత్రం : పసుపు పారాణి (1980)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
శ్రీమతి అని పిలిచేదాకా చిన్నదానా..
సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదాన
శ్రీమతి అని పిలిచేదాకా చిన్నదానా..
సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదాన
ఆ పాలబుగ్గలో ఈ పూల మొగ్గలో
ముత్యాల ముగ్గులే మెరిసేనులే
శ్రీవారని పిలిచేదాన చినవాడా..
ముద్దులన్ని మూట పెట్టు పిలవాడా
ముద్దులన్ని మూట పెట్టు పిలవాడా
ఆ సన్న నవ్వులో ఏ సన్నజాజులో
చలి సంధ్య మోజులై విరిసేనులే
శ్రీమతి అని పిలిచేదాకా చిన్నదానా..
సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదాన
ముద్దులన్ని మూట పెట్టు పిలవాడా
చరణం 1 :
చిలుకంటి చినదాని కులుకెంత చూడనిదే
కునుకేది కంటికి.. కుదురేది చూపుకి
వరదంటి చిన్నవాడి వయసంత చూడనిదే
వలపేది జంటకి.. వరసేది ముద్దుకి
అందాక నా చూపు చుక్క పెట్టుకో..
ఆ పైన పులకింతల సారె పెట్టుకో
శ్రీమతి అని పిలిచేదాకా చిన్నదానా..
సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదాన
సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదాన
శ్రీవారని పిలిచేదాన చినవాడా..
ముద్దులన్ని మూట పెట్టు పిలవాడా
ముద్దులన్ని మూట పెట్టు పిలవాడా
చరణం 2 :
పురి విప్పి నా సొగసు పున్నమై పోతుంటే
తోడేది ఈడుకి .. ఈ తొలకరి వేళకి
వేడెక్కి నా వయసు వేసవై పోతుంటే
నీరేది ఎండకి.. ఒంటరి గుండెకి
అందాక వెన్నెల్లో గొడుగు వేసుకో..
ఆ గొడుగులో జరిగే గొడవ చూసుకో...
శ్రీవారని పిలిచేదాన చినవాడా..
ముద్దులన్ని మూట పెట్టు పిలవాడా
ముద్దులన్ని మూట పెట్టు పిలవాడా
శ్రీమతి అని పిలిచేదాకా చిన్నదానా..
సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదాన
సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదాన
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి