RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, సెప్టెంబర్ 2024, మంగళవారం

అమ్మ భవాని లోకాల నేలే | Amma Bhavani Lokalanele | Song Lyrics | Shivaramaraju (2002)

అమ్మ భవాని లోకాల నేలే 



చిత్రం : శివరామరాజు (2002 )

సంగీతం : ఎస్ ఏ రాజ్ కుమార్,

రచన : చిర్రావూరి విజయ్ కుమార్ 

గానం : బాలు,


పల్లవి :


ఓం  శక్తి మహా శక్తి… ఓం శక్తి మహా శక్తి

అమ్మా భవాని లోకాలనేలే… 

ఓంకార రూపమమ్మ

తల్లీ నీ మహిమల్ని చూపవమ్మ…

అమ్మా భవాని లోకాలనేలే… 

ఓంకార రూపమమ్మ

తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా…


ఓ ఓఓ… సృష్టికే దీపమా… 

శక్తికే మూలమా

సింహ రథమే నీదమ్మా… 

అమ్మ దుర్గమ్మా

భక్తులను దీవించుమా…

అమ్మా భవాని లోకాలనేలే… 

ఓంకార రూపమమ్మా

తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా…


అమ్మా పసుపు కుంకుమ

చందనము పాలభిషేకం…

ఎర్రని గాజులతో పువ్వులతో

నిను కొలిచాము…


చరణం 1 :


అమ్మా చందనమే పూసిన… 

ఒళ్ళు చూడు

అమ్మా చందనమే పూసిన… 

ఒళ్ళు చూడు

అమ్మ పున్నమి పుట్టిల్లు… 

ఆ కళ్ళు చూడు

అమ్మ ముక్కోటి మెరుపుల… 

మోము చూడు

అమ్మమ్మ ముగ్గురమ్మల… 

మూలపుటమ్మ

నీ అడుగులే కాలాలు…


అమ్మ నిప్పుల్ని తొక్కిన… 

నడక చూడు

అమ్మ దిక్కుల్ని దాటిన… 

కీర్తి చూడు

వెయ్యి సూరీళ్ళై మెరిసిన… 

శక్తిని చూడు

మనుషుల్లో దేవుడీ… 

భక్తుని చూడు

నీ పాద సేవయే… 

మాకు పుణ్యం

అమ్మ నీ చూపు సోకితే… 

జన్మ ధన్యం


అమ్మా భవాని లోకాలనేలే… 

ఓంకార రూపమమ్మా

తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా…


చరణం 2:


ధిన్నకు ధిన్నకుతా… 

ధిన్నకు ధిన్నకుతా

గల గల గల గల… గల గల గల గల

ధిన్నకు ధిన్నకుతా…


గజ్జెలనే కట్టి… ఢమరుకమె పట్టి

నాట్యమే చేయుట… అమ్మకు ఇష్టమట

ఆ… ఊరే ఊగేల ఇయ్యాలి హారతి

ఊరే ఊగేల… ఇయ్యాలి హారతి

కాయలు కొట్టి… ఫలములు పెట్టి

పాదాలు తాకితే…

అడిగిన వరములు… ఇచ్చును తల్లి


చీరలు తెచ్చాం… రైకలు తెచ్చాం

చల్లంగా అందుకో…

జయ జయ శక్తి… శివ శివ శక్తి

జయ జయ శక్తి… శివ శివ శక్తి


చరణం 3:


కంచిలొ కామాక్షమ్మ… 

మధురలొ మీనాక్షమ్మ నువ్వే అమ్మ

కాశీలో అన్నపూర్ణవే మాతా…

శ్రీశైలంలో భ్రమరాంబ… 

బెజవాడ కనకదుర్గవు నువ్వే అమ్మా

కలకత్తా కాళిమాతవే మాతా…


నరకున్ని హతమార్చి… శ్రీ కృష్ణున్ని కాచి

సత్యభామై శక్తే చూపినావే…

నరలోక భారాన్ని… భూదేవై మోసి

సాటిలేని సహనం చాటినావే…


భద్రకాళీ నిన్ను… శాంత పరిచేందుకు

రుద్రనేత్రుండు శివుడైన… సరి తూగునా

బ్రహ్మకు మేధస్సు… విష్ణుకు తేజస్సు

నీ పదధూళిని… తాకగ వచ్చేనట

బ్రహ్మకు మేధస్సు… విష్ణుకు తేజస్సు

నీ పదధూళిని… తాకగ వచ్చేనట

నీ పదధూళిని… తాకగ వచ్చేనట

నీ పదధూళిని… తాకగ వచ్చేనట


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నె పిల్లవని కన్నులున్నవని | Kannepillavani Kannulunnavani | Song Lyrics | Akali Rajyam (1980)

కన్నె పిల్లవని కన్నులున్నవని చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు, జానకి  పల్ల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు