మంచివాడు మా బాబాయి
చిత్రం : కథానాయకుడు (1969)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : పి సుశీల, బెంగళూరు లత
పల్లవి :
మంచివాడు మా బాబాయి
మామాటే వింటాడోయి
కోపం మాని తాపం మాని
మాతో వుంటాడోయి
మంచివాడు మా బాబాయి
మామాటే వింటాడోయి
కోపం మాని తాపం మాని
మాతో వుంటాడోయి
చరణం 1 :
రామలక్ష్మణులు మీరయ్యా
మీలో కలతలు ఏలయ్యా
నీతికి నిలబడు నీ తమ్మునిపై
నిందలెందుకయ్యా
మంచివాడు మా బాబాయి
మామాటే వింటాడోయి
కోపం మాని తాపం మాని
మాతో వుంటాడోయి
చరణం 2 :
అమ్మానాన్న వాలే చూసే
అన్నా వదినా వున్నారు
అన్నయ్యేదో అనగానే
అలుక ఎందుకయ్యా
అలుక ఎందుకయ్యా
మంచివాడు మా బాబాయి
మామాటే వింటాడోయి
కోపం మాని తాపం మాని
మాతో వుంటాడోయి
చరణం 3 :
మంచి మనసుతో బాబాయి
మనకు కానుకలు తెచ్చాడు
మూగ నోములు విడవాలి
ముగ్గురు కలసి నవ్వాలి
మంచివాడు మా బాబాయి
మామాటే వింటాడోయి
కోపం మాని తాపం మాని
మాతో వుంటాడోయి
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి