పిలిచిన పలుకవు ఓ జవరాలా
చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
పిలిచిన పలుకవు ఓ జవరాలా
పిలిచిన పలుకవు ఓ జవరాలా
చిలిపిగ నను చేర రావా... రావా..
పిలిచిన పలుకవు ఓ జవరాలా
కలువల రాయడు చూసే వేళ
కలువల రాయడు చూసే వేళ
చెలియను కవ్వింతు వేలా.. యేలా
కలువల రాయడు చూసే వేళా..
చరణం 1:
చల్లగ విరిసే నీ చిరునవ్వులు
చల్లగ విరిసే నీ చిరునవ్వులు ..
మల్లెలు కురిసెను నాలోన
తొలిచూపులలో చిలికిన వలపులు
తొలిచూపులలో చిలికిన వలపులు..
తొందర చేసెను నీలోన..
పిలిచిన పలుకవు ఓ జవరాలా
చిలిపిగ నను చేర రావా... రావా..
పిలిచిన పలుకవు ఓ జవరాలా
చరణం 2:
జగములనేలే సొగసే నీదని...
జగములనేలే సొగసే నీదని..
గగనములో దాగే నెలరేడు
మనసును దోచే మరుడవు నీవని
మనసును దోచే మరుడవు నీవని..
కనుగొంటినిలే ఈనాడు...
పిలిచిన పలుకవు ఓ జవరాలా
చిలిపిగ నను చేర రావా... రావా..
కలువల రాయడు చూసే వేళ
చెలియను కవ్వింతు వేలా.. యేలా
పిలిచిన పలుకవు ఓ జవరాలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి