RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

11, సెప్టెంబర్ 2024, బుధవారం

మిలమిల మెరిసే మనసే | Mila Mila Merise Manase | Song Lyrics | Pidugu Ramudu (1966)

మిలమిల మెరిసే మనసే



చిత్రం : పిడుగు రాముడు (1966)

సంగీతం : టి.వి. రాజు

గీతరచయిత : సినారె

నేపథ్య గానం : సుశీల 


పల్లవి : 


మిలమిలమిలమిల మెరిసే మనసే 

ఎగసి దూకిందిలే...

ఓ... మిలమిలమిలమిల మెరిసే మనసే 

ఎగసి దూకిందిలే...


చరణం 1 :


కానరాని ఆకాశదీపం 

కనుల ముందే వెలిగిందిలే

ఏ... ఏ... కానరాని ఆకాశదీపం 

కనుల ముందే వెలిగిందిలే

మూగవోయిన రాగమాల 

మురిసి విరిసి పలికిందిలే 


ఓ... మిలమిలమిలమిల మెరిసే మనసే 

ఎగసి దూకిందిలే...

ఓ... మిలమిలమిలమిల మెరిసే మనసే 

ఎగసి దూకిందిలే...


చరణం 2 :


కరిగిపోయే అందాల కలలే 

తిరిగి నాలో అగుపించెనే

ఏ.. కరిగిపోయే అందాల కలలే 

తిరిగి నాలో అగుపించెనే

వాడిపోయే ఆశలన్నీ 

నేడే నాలో చిగురించెనే


ఓ... మిలమిలమిలమిల మెరిసే మనసే 

ఎగసి దూకిందిలే...

ఓ... మిలమిలమిలమిల మెరిసే మనసే 

ఎగసి దూకిందిలే...


చరణం 3 :


గుండెలోనా కొలువైన స్వామి 

పండునవ్వులు చిలికించెనే

ఏ... గుండెలోనా కొలువైన స్వామి 

పండునవ్వులు చిలికించెనే

చేసుకున్నా పూజలన్నీ 

పూచి కాచి ఫలియించెనే  


ఓ... మిలమిలమిలమిల మెరిసే మనసే 

ఎగసి దూకిందిలే...

ఓ... మిలమిలమిలమిల మెరిసే మనసే 

ఎగసి దూకిందిలే...


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు