RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

8, సెప్టెంబర్ 2024, ఆదివారం

ఓ చామంతి ఏమిటే ఈ వింత | O Chamanthi Emite Ee vintha | Song Lyrics | Atmeeyulu (1969)

ఓ... చామంతి ఏమిటే ఈ వింత



చిత్రం: ఆత్మీయులు (1969)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: సినారె

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల



పల్లవి:


ఓ... చామంతి ఏమిటే ఈ వింత

ఈ చినవానికి కలిగేనేల గిలిగింత 

లేని పులకింత

ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది

ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది 

వలపు పెరిగింది


చరణం 1:


ఇన్నాళ్ళూ ఈ వలపే ఏమాయే

నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే

ఇన్నాళ్ళూ ఈ వలపే ఏమాయే

నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే


ఇన్నాళ్ళూ నీ హొయలు చూసాను

నా ఎదలోనే పదిలంగా దాచాను వేచాను ...


ఓ... చామంతి ఏమిటే ఈ వింత

ఈ చినవానికి కలిగేనేల గిలిగింత 

లేని పులకింత ...


చరణం 2:


దూరాల గగనాల నీమేడ

ఓ దొరసాని నను కోరి దిగినావా ...

దూరాల గగనాల నీమేడ

ఓ దొరసాని నను కోరి దిగినావా....


నీ మనసే పానుపుగా తలచేను

నీ ప్రాణంలో ప్రాణంగా 

నిలిచేను వలచేను....


ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది

ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది 

వలపు పెరిగింది...

ఓ... చామంతి ఏమిటే ఈ వింత

ఈ చినవానికి కలిగేనేల గిలిగింత 

లేని పులకింత


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు