రా రా కౌగిలి చేరా
చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల
సాకి :
నడకలో కొదమసింగపు
అడుగులున్న మొనగాడా...
మేనిలో పసిడి వన్నెల
మెరుపులున్న చినవాడా...
మెరుపులున్న చినవాడా...రా...రా...
పల్లవి:
రా రా కౌగిలి చేరా రా రా దొర...
ఈ రంగేళి ప్రాయంబు నీదేనురా
రా రా కౌగిలి చేరా రా రా దొర...
ఈ రంగేళి ప్రాయంబు నీదేనురా.....
చరణం 1:
చలిగాలి వీచేను నీకోసమే...
ఈ చెలి సైగ చేసేను నీ కోసమే...
చలిగాలి వీచేను నీకోసమే...
ఈ చెలి సైగ చేసేను నీ కోసమే....
మనసందుకో నా మరులందుకో...
మనసందుకో నా మరులందుకో...
ఓ..మగరాయడా నీకు బిగువెందుకో....
రా రా కౌగిలి చేరా రా రా దొర...
ఈ రంగేళి ప్రాయంబు నీదేనురా
చరణం 2:
పొదరిండ్లు నిను నన్ను రమ్మనవీ...
నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవీ....
పొదరిండ్లు నిను నన్ను రమ్మనవీ...
నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవీ....
మాటాడవా...సైయాటాడవా....
మాటాడవా...సైయాటాడవా...
నీ కొస చూపుతో నన్ను వేటాడవా....
రా రా కౌగిలి చేరా రా రా దొర...
ఈ రంగేళి ప్రాయంబు నీదేనురా...
రా రా కౌగిలి చేరా రా రా దొర...
ఈ రంగేళి ప్రాయంబు నీదేనురా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి