పిల్లన గ్రోవి నేనై చల్లని గాలి నువ్వై
చిత్రం: చేతిలో చెయ్యేసి (2010)
సంగీతం: బంటి
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: హరిహరన్, అల్కా
పల్లవి:
పిల్లన గ్రోవి నేనై ..చల్లని గాలి నువ్వై
అల్లుకుపోయే రాగం .. ఆనంద రాగం
పిల్లన గ్రోవి నేనై ..చల్లని గాలి నువ్వై
అల్లుకుపోయే రాగం .. ఆనంద రాగం
రాగానికే రూపం ఒచ్చి ..
రూపమిలా ఎదురుగ నిలిచి
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం ..
అదే ప్రేమ రాగం
చరణం 1:
మొదటి సారి నిను చూడగానే ..
ఆశ్చర్యరాగం
మదిని తెరిచి మాటాడగానే ..
ఆహ్వానరాగం
చొరవ చేసి నను చేరగానే ..
ఆందోళరాగం
చెలిమి చేయి కలిపేయగానే ..
అవలీలరాగం
నవ్వులోన నవనీత రాగం ..
సిగ్గులోన గిలిగింతరాగం
ఒంపులోన ఒలికింత రాగం ..
ఓపలేని విపరీత రాగం
అణువుఆణువున పలికెను మనలో ..
అనురాగ రాగం .. అదే ప్రాణ రాగం
రాగానికే రూపం ఒచ్చి ..
రూపమిలా ఎదురుగ నిలిచి
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం ..
అదే ప్రేమ రాగం
చరణం 2:
ఇరువురం దూర దూరముంటే ..
ఇబ్బందిరాగం
బంధమై స్పందించుతుంటే ..
నిర్బంధరాగం
పెదవి మీటి పెనవేసుకుంటే ..
నిశ్శబ్దరాగం
మధుర నిధిని దోచేసుకుంటే ..
నిక్షేప రాగం
తనువులోన తారంగ రాగం ..
క్షణముకొక్క కేరింతరాగం
కలలోన కల్లోల రాగం ..
కలిసిపోతే కళ్యాణరాగం
ఇద్దరమొకటై ముద్దుగ ఉంటే
అద్వైత రాగం ..
అదే మోక్షరాగం
పిల్లన గ్రోవి నేనై ..చల్లని గాలి నువ్వై
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం ..
అదే ప్రేమ రాగం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి