అటు చల్లని వెలుగుల జాబిలి
చిత్రం : వాడే వీడు (1973)
సంగీతం : సత్యం
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
ఏ...ఏహే...ఓహొ..ఒహొ...హో...
అటు చల్లని వెలుగుల జాబిలి...
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి..
కోమలీ...ఓ జాబిలి
అటు చల్లని వెలుగుల జాబిలి...
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి..
కోమలీ...ఓ జాబిలి
చరణం 1 :
వేగించే వంటరి వేళలో...
వణికించే ఈ చలి గాలిలో..
వేగించే వంటరి వేళలో...
వణికించే ఈ చలి గాలిలో
నా తనువే తడబడుతున్నది...
చెలి సాయం కావాలన్నది
అటు చల్లని వెలుగుల జాబిలి...
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి..
కోమలీ...ఓ జాబిలి
చరణం 2 :
ఒక ఆడది ఒంటిగ దొరికితే...
మగధీరులకుండే తెగులిదే
ఒక ఆడది ఒంటిగ దొరికితే...
మగధీరులకుండే తెగులిదే
నీ గడసరి వగలిక చాలులే...మ్మ్..హు..
లొంగే ఘటమిది కాదులే...
అటు చల్లని వెలుగుల జాబిలి...
ఇటు వెచ్చని చూపుల కోమలి
నీ మదిలో కలిగెను అలజడి..
జాబిలీ...ఈ కోమలీ...
చరణం 3 :
నీ మదిలో సంగతి తెలుసులే...
అది దాచాలన్నా దాగదులే
నీ మదిలో సంగతి తెలుసులే...
అది దాచాలన్నా దాగదులే
నువ్వు కోసేవన్ని కోతలే...
నీ పాచికలేవి పారవులే
అటు చల్లని వెలుగుల జాబిలి...
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి..
కోమలీ...ఓ జాబిలి...
ఊం...ఊం...ఊం...హే...హే...
ఓహో..ఓహో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి