RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా | Dandalayya Undralayya | Song Lyrics | Coolie No 1 (1991)

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా



చిత్రం: కూలీ No.1(1991)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు


పల్లవి:


జై జై జై జై గణేశ జై జై జై జై

జై జై జై జై వినాయక జై జై జై జై

జై జై జై జై గణేశ జై జై జై జై

జై జై జై జై వినాయక జై జై జై జై



దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా 

దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా 

చూపించయ్యా త్రోవ

పిండి వంటలారగించి 

తొండమెత్తి దీవించయ్యా

తండ్రి వలే ఆదరించి 

తోడు నీడ అందించయ్యా ఓ..


దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా 

దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా 

చూపించయ్యా త్రోవ...


చరణం 1:


చిన్నారి ఈ చిట్టెలుకెలా 

భరించెరా లంబోదరా

పాపం కొండంత నీ పెనుభారం

ముచ్చెమటలు కక్కిందిరా 

ముజ్జగములు తిప్పిందిరా

ఓ.. హో హో జన్మ ధన్యం


చిన్నారి ఈ చిట్టెలుకెలా 

భరించెరా లంబోదరా

పాపం కొండంత నీ పెనుభారం

ముచ్చెమటలు కక్కిందిరా 

ముజ్జగములు తిప్పిందిరా

ఓ.. హో హో జన్మ ధన్యం


అంబారిగా ఉండగల ఇంతటి వరం.. 

అయ్యోర అయ్య

అంబాసుతా ఎందరికి లబించురా.. 

అయ్యోర అయ్య

ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా


దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా 

దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా 

చూపించయ్యా త్రోవ


చరణం 2:


శివుని శిరసు సింహాసనం పొందిన 

చంద్రుని గోరోజనం

నిన్నే చేసింది వేళాకోళం

ఎక్కిన మదం దిగిందిగా 

తగిన ఫలం దక్కిందిగా

ఏమైపోయింది గర్వం


అరె శివుని శిరసు సింహాసనం 

పొందిన చంద్రుని గోరోజనం

నిన్నే చేసింది వేళాకోళం

ఎక్కిన మదం దిగిందిగా 

తగిన ఫలం దక్కిందిగా

ఏమైపోయింది గర్వం


త్రిమూర్తులే నిను గని తలొంచరా.. 

అయ్యోర అయ్య

నిరంతరం మహిమను కీర్తించరా.. 

అయ్యోర అయ్యా

నువ్వెంత అనే అహం 

నువ్వే దండించరా


దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా 

దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా 

చూపించయ్యా త్రోవ

అరె రె రె.. పిండి వంటలారగించి 

తొండమెత్తి దీవించయ్యా

తండ్రి వలే ఆదరించి తోడు నీడ 

అందించయ్యా ఓ..


హే దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా 

దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా 

చూపించయ్యా త్రోవ


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన | Guttapalli Chelalona | Telugu Folk Song Lyrics | RKSS Creations

గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన జానపద గేయం  రచన : రామకృష్ణ దువ్వు  పల్లవి :  గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన పాలకంకి సొగసులున్న నవరంగీ గుత్త...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు