మనసు పాడింది సన్నాయి పాట
చిత్రం : పుణ్యవతి (1967)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
మనసు పాడింది సన్నాయి పాట
మనసు పాడింది సన్నాయి పాట
కనులు ముకుళించగ...
తనువు పులకించగా
గగనమే పూల తలంబ్రాలు కురిపించగా.. ఆ ఆ ....
మనసు పాడింది సన్నాయి పాట
చరణం : 1
జగమే కల్యాణ వేదికగా..
సొగసే మందార మాలికగా
జగమే కల్యాణ వేదికగా..
సొగసే మందార మాలికగా
తొలిసిగ్గు చిగురించగా..ఆ ఆ ఆ ఆ
తొలిసిగ్గు చిగురించగా...
నా అలివేణి తలవాల్చిరాగ
మనసు పాడింది సన్నాయి పాట...
చరణం : 2
చిలికే పన్నీటి వెన్నెలలోనా..
పిలిచే విరజాజి పానుపుపైనా
చిలికే పన్నీటి వెన్నెలలోనా..
పిలిచే విరజాజి పానుపుపైనా
వలపులు పెనవేసుకోగా..ఆ..
వలపులు పెనవేసుకోగా ...
నా వనరాజు ననుచేర రాగా
మనసు పాడింది సన్నాయి పాట...
చరణం : 3
మదిలో దాచిన మమతలతేనెలు..
పెదవులపైనే కదలాడగా
మదిలో దాచిన మమతలతేనెలు..
పెదవులపైనే కదలాడగా
పెదవులకందనీ మధురిమలేవో..ఓ..ఓ... ఆ..
పెదవులకందనీ మధురిమలేవో ..
హృదయాలు చవిచూడగా
మనసు పాడింది సన్నాయి పాట
కనులు ముకుళించగ... తనువు పులకించగా
గగనమే పూల తలంబ్రాలు కురిపించగా.. ఆ...ఆ ....
మనసు పాడింది సన్నాయి పాట
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి