RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

కుకు కుకు కోకిలమ్మ పెళ్ళికి | kuku Kuku Kokilamma pelliki | Song Lyrics | Adavi Ramudu (1977)

కుకు కుకు కోకిలమ్మ పెళ్ళికి



రచన  : వేటూరి సుందరరామమూర్తి 

సంగీతం  : కె వి మహదేవన్,

గానం  : SP బాలు, పి సుశీల 

చిత్రం  : అడవి రాముడు (1977)


పల్లవి:


కుకు కుకు కుకు కుకు 

కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ

చిగురాకులు తోరణాలు 

చిరుగాలి సన్నాయి


డుడుం డుడుం డుడుం డుడుం 

వసంతుడే పెళ్ళికొడుకు 

వనమంతా సందడీ

పూలన్నీ తలంబ్రాలు 

పున్నమీ తొలిరేయి


చరణం 1:


తుళ్ళి తుళ్ళి నిన్న మొన్న 

తూనిగల్లే ఎగిరిన 

పిల్లదాని కొచ్చిందీ కళా 

పెళ్ళి కళా

తలపులన్నీ వలపులైన 

చూపులు విరి తోపులైన 

పెళ్ళికొడుకు నవ్వితే కళా 

తళ తళా

పూలగాలితో రేగిన 

పుప్పొడి పారాణిగా

చిలక పాట నెమలి ఆట 

కలిసి మేజువాణిగా


పూలగాలితో రేగిన 

పుప్పొడి పారాణిగా

చిలక పాట నెమలి ఆట 

కలిసి మేజువాణిగా

అందమైన పెళ్ళికి 

అందరు పేరంటాలే

అడవిలోని వాగులన్నీ 

ఆనందపు కెరటాలే


కుకు కుకు కుకు కుకు 

కోకిలమ్మ పెళ్ళికి 

కోనంతా పందిరీ

చిగురాకులు తోరణాలు 

చిరుగాలి సన్నాయి


చరణం 2:


కన్ను కన్ను కలుపుకున్న 

కన్నె మనసు తెలుసుకున్న 

కనుల నీలి నీడలే కథా 

ప్రేమ కథా

బుగ్గలలో నిగ్గుదీసి 

సిగ్గులలో చిలకరించి 

మొగ్గ వలపు విచ్చితే కథా 

పెళ్ళి కథా


ఇరుమనసులకొక తనువై 

ఇరు తనువులకొక మనువై.

మనసులోని వలపులన్నీ 

మల్లెల విరి పానుపులై


ఇరుమనసులకొక తనువై 

ఇరు తనువులకొక మనువై.

మనసులోని వలపులన్నీ 

మల్లెల విరి పానుపులై.

కలిసి వున్న నూరేళ్ళు 

కలలుగన్న వెయ్యేళ్ళు

మూడు ముళ్ళు పడిన నాడు 

ఎదలు పూల పొదరిళ్ళు


కుకు కుకు కుకు కుకు 

కోకిలమ్మ పెళ్ళికి 

కోనంతా పందిరీ

చిగురాకులు తోరణాలు 

చిరుగాలి సన్నాయి


డుడుం డుడుం డుడుం డుడుం 

వసంతుడే పెళ్ళికొడుకు 

వనమంతా సందడీ

పూలన్నీ తలంబ్రాలు 

పున్నమీ తొలిరేయి


కుకు కుకు కుకు కుకు

డుడుం డుడుం డుడుం డుడుం

కుకు కుకు కుకు కుకు

డుడుం డుడుం డుడుం డుడుం


పాటల ధనుస్సు 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు