పెదవులపైన సంగీతం
చిత్రం: పుణ్యవతి (1967)
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల
పల్లవి:
ఆ..ఆ......ఆ..హా..హ.
ఊ..ఊ..ఊహూ.హూ.హూ..
హ..హ..హ..హ..హ..(నవ్వు)
పెదవులపైన సంగీతం
హృదయములోన పరితాపం
సెగలై రగిలే నా బ్రతుకే
చివరికి పాడెను ఈ గీతం
పెదవులపైన సంగీతం
హృదయములోన పరితాపం
సెగలై రగిలే నా బ్రతుకే
చివరికి పాడెను ఈ గీతం
చరణం 1:
మధువు చూసి ఆగినాను
మనసు తీర తాగినాను
అహ్హ... అహ్హ...అహ్హ...
మధువు చూసి ఆగినాను
మనసు తీర తాగినాను
కమ్మని ఆ మధువే కాదు
కన్నీళ్ళూ తాగినాను
ఇన్నాళ్ళూ తాగినాను
హు..హు..హు.. హు..హు..హు..
పెదవులపైన సంగీతం
హృదయములోన పరితాపం
సెగలై రగిలే నా బ్రతుకే
చివరికి పాడెను ఈ గీతం
చరణం 2:
జీవించే తలపే లేదు
చావంటే వెరపేలేదు
చీకటినే కోరిన నాకు
వేకువ ఇక లేనే లేదు
వెలుగులతో పనిలేదు
హు..హు..హు.. హు..హు..హు..
పెదవులపైన సంగీతం
హృదయములోన పరితాపం
సెగలై రగిలే నా బ్రతుకే
చివరికి పాడెను ఈ గీతం
చివరికి పాడెను ఈ గీతం
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి