చెయ్యి పడ్డది చెంప పైన
చిత్రం : గురు శిష్యులు (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
చెయ్యి పడ్డది చెంప పైన...
దెబ్బ పడ్డది గుండెలోన
మనసు పడ్డది నీపైనా...
తానతందానా..
అది సెడ్డ మంచిది.. మరీ సెడ్డది...
తాననతందానా
చెయ్యి పడ్డది చెంప పైన...
దెబ్బ పడ్డది గుండెలోన
మనసు పడ్డది నీపైనా...
తానతందానా..
అది సెడ్డ మంచిది.. మరీ సెడ్డది...
తాననతందానా
చరణం 1 :
పాలుగారే చెంప పైనా
కెంపురంగులూ అందమైనా
పాలుగారే చెంప పైనా
కెంపురంగులూ అందమైనా
ముద్దు పెట్టే తావులోనా
దెబ్బపడ్డది న్యాయమేనా
ముద్దు పెట్టే తావులోనా
దెబ్బపడ్డది న్యాయమేనా
తప్పు చేసే చేతికేమిటి
నువ్వు వేసే దండనా
తప్పు చేసే చేతికేమిటి
నువ్వు వేసే దండనా
ఊపిరాడని కౌగిలింతతో
సంకెళేస్తే చాలునా
హేహే... లలలలలా...
చెయ్యి పడ్డది చెంప పైన...
దెబ్బ పడ్డది గుండెలోన
మనసు పడ్డది నీపైనా...
తానతందానా..
అది సెడ్డ మంచిది.. మరీ సెడ్డది...
తాననతందానా
చరణం 2 :
ప్రేమ తాపం బయటపడ్డది
పిచ్చి కోపం రూపానా
తాపమారి చల్లబడితే
ప్రేమ మిగులును నీపైనా
ప్రేమ తాపం బయటపడ్డది
పిచ్చి కోపం రూపానా
తాపమారి చల్లబడితే
ప్రేమ మిగులును నీపైనా
తాపమారినా ప్రేమలోనా
తనివితీరునా ఎవరికైనా
చెయ్యి పడ్డది చెంప పైన...
దెబ్బ పడ్డది గుండెలోన
మనసు పడ్డది నీపైనా...
తానతందానా..
అది సెడ్డ మంచిది.. మరీ సెడ్డది...
తాననతందానా
చరణం 3 :
అద్దమల్లే నిలుపుకున్నా
నిన్ను ముద్దుగా నాలోనా
అద్దమల్లే నిలుపుకున్నా
నిన్ను ముద్దుగా నాలోనా
అందమంతా చూసుకున్నా
రోజురోజూ నీలోనా
అందమంతా చూసుకున్నా
రోజురోజూ నీలోనా
నిన్ను నేను చూడగానే
నేను లేను నాలోనా
నిన్ను నేను చూడగానే
నేను లేను నాలోనా
నన్ను నేనే పెంచుకున్న
నీకు తెలియక నీలోనా
అహహా... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చెయ్యి పడ్డది చెంప పైన...
దెబ్బ పడ్డది గుండెలోన
మనసు పడ్డది నీపైనా...
తానతందానా..
అది సెడ్డ మంచిది.. మరీ సెడ్డది...
తాననతందానా
తానతందానా.... తాననతందానా
హోయ్.. తానతందానా....
తాననతందానా
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి