RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, అక్టోబర్ 2026, బుధవారం

నా ఒళ్ళంతా బంగారం | Naa Vallantha Bangaram | Song Lyrics | Inspector Bharya (1970)

నా ఒళ్ళంతా బంగారం 


చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: అప్పలాచార్య

గానం: ఎల్.ఆర్.ఈశ్వరి


పల్లవి :


నా ఒళ్ళంతా బంగారం

నీ కళ్ళు చెదిరేసింగారం

అందిస్తా నిపుడు అందుకో

ఎక్కడిదక్కడ దాచుకో

గప్ చిప్ చిప్ ...


చరణం 1:


తొలి వలపుల చలితో

గౌనుమీద గౌనేసుకున్నా

నీ చూపుల వేడికి

తాళ లేక తీరేస్తున్నా


పరులకంట పడకుండా

పరువాలు దాచివుంచా

ఈ నిషా నుందిరంలో

దిల్ ఖుషీ చేసియిస్తా....

హరే రామ రామరామ 

హరేకృష్ణ


చరణం 2:


మనిషి మనిషిలో 

మైకమున్నది.

మసక చీకటి 

మధ్యనున్నది

అ రెంటికి నడుమ 

చెలిమియున్నది

ఆ చెలిమికి తోడీ 

చెలియ వున్నది

నకిలి సరుకుకాదు

మోసం ఏమీ లేదు

గీటురాతిపై గీసి చూసుకో

సాటిలేదని నమ్మి తీసుకో

హరేరామ రామరామ-

హరేకృష్ణ

కృష్ణ కృష్ణ


- పాటల ధనుస్సు


13, అక్టోబర్ 2026, మంగళవారం

ఓహో మై డార్లింగ్ | Oho My Darling | Song Lyrics | Inspector Bharya (1970)

ఓహో మై డార్లింగ్ 


చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: దాశరధి

గానం: ఎస్ పి బాలు, పి. సుశీల


పల్లవి:


ఓహో మై డార్లింగ్

కోపం చాలించు 

కొంచం ప్రేమించు 


చరణం: 1


నీకు పుణ్యం వుంటుంది

నాకు పెళ్ళి అవుతుంది

మరదలవని వచ్చానే

మనసు చేతికిచ్చానే

విసరిపారవేస్తావో

ప్రేమగానె చూస్తావో

దూరం దూరం తోసేస్తుంటే

దగ్గర దగ్గర కొచ్చెస్తుంటా- 

ఏమంటావ్ ?

వద్దంటా...


చరణం: 2


ఎంత అలసిపోయావో

ఎంత తడిసిపోయావో

ఇంక కలిసిపోరాదా

ఎంతైనా బావను కాదా

ఎప్పటి కైనా తప్పని బంధం

ఇప్పటి కైనా ఒప్పితే అందం.

ఏమంటావ్ ?

పో పొమ్మంటా ...


చరణం: 3


నన్ను కాదు పొమ్మంటే

నీకు ఎవడు వస్తాడో

ఎంత బాధ పెడతాడో

ఎంత నలిగిపోతావో

కాదనవద్దూ కయ్యంరద్దూ

నాతో పెళ్ళి అయితే ముద్దు 

ఏమంటావ్ ?

రారమ్మంటా

వస్తున్నా ...


- పాటల ధనుస్సు


12, అక్టోబర్ 2026, సోమవారం

ఇంగ్లీషులోన మేరేజీ | Englishulona Marriage | Song Lyrics | Aradhana (1962)

ఇంగ్లీషులోన మేరేజీ 


చిత్రం: ఆరాధన (1962)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: ఆరుద్ర

నేపధ్య గానం: ఘంటసాల, ఎస్ జానకి


పల్లవి:


ఇంగ్లీషులోన మేరేజీ 

హిందీలొ అర్థమూ షాదీ

ఇంగ్లీషులోన మేరేజీ 

హిందీలొ అర్థమూ షాదీ

ఏ భాషలో ఏమన్ననూ 

మన తెలుగులోన పెళ్ళి

ఆహా . . .ఆ .. ఆ

ఓహో . . .హొ .. హో ..


చరణం 1:


ప్రేమించుకున్న పెళ్ళిలోనే 

హాయి ఉందోయీ

పెద్దాళ్ళు దానికి సమ్మతిస్తే 

ఖాయమౌతుందోయ్

జరిగాక మనకు పెళ్ళి 

పోదాములే న్యూఢిల్లీ

జరిగాక మనకు పెళ్ళి 

పోదాములే న్యూఢిల్లీ

ఆ మాటకే నా గుండెలు 

గెంతేను తృళ్ళి తృళ్ళి


ఇంగ్లీషులోన మేరేజీ 

హిందీలొ అర్థమూ షాదీ ఆహ...

ఏ భాషలో ఏమన్ననూ 

మన తెలుగులోన పెళ్ళి


చరణం 2:


న్యూఢిల్లినుండి సింగపూరు 

వెళ్ళిపోదాము

న్యూయార్కులోన డాన్సుచేస్తూ 

ఉండిపోదాము

కోసావు కోతలు తగ్గు 

వేసేను నాకు సిగ్గు

కోసావు కోతలు తగ్గు 

వేసేను నాకు సిగ్గు

రంగేళికి సింగారికి 

రారాదు పాడు సిగ్గు


ఇంగ్లీషులోన మేరేజీ ఆహా.. 

హిందీలొ అర్థమూ షాదీ ఓహో...

ఏ భాషలో ఏమన్ననూ 

మన తెలుగులోన పెళ్ళి


చరణం 3:


పొంగేను సోడాగ్యాసు లాగా 

నేడు నీ మనసు

మా నాన్న ముఖము చూడగానే 

నువ్వు సైలెన్సు

తెస్తానులే లైసెన్సు 

కడదాము ప్రేమ హౌసు

తెస్తానులే లైసెన్సు 

కడదాము ప్రేమ హౌసు

నీమాటలే నిజమైనచో 

మన లైఫు నైసు నైసు


ఇంగ్లీషులోన మేరేజీ 

హిందీలొ అర్థమూ షాదీ

ఏ భాషలో ఏమన్ననూ 

మన తెలుగులోన పెళ్ళి

ఆహా . . .

ఓహో . . .


- పాటల ధనుస్సు


ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా | Ohoho Mavayya Idemayya | Song Lyrics | Aradhana (1962)

ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా 


చిత్రం :  ఆరాధన (1962)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం : ఘంటసాల, పి.సుశీల


పల్లవి :


ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. 

బలెబలె బాగా ఉందయ్యా

ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. 

బలెబలె బాగా ఉందయ్యా

ఇంటిని విడిచి షికారు కొడితే 

ఎంతో హాయి కలదయ్యా


ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ.. 

బలెబలె బతికిన కాలేజి

ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ.. 

బలెబలె బతికిన కాలేజి

మాటలు రాని మృగాలు కొన్ని 

మనిషి కి పాఠం చెబుతాయి


చరణం 1:


పులులూ చిరుతలు సింహాలన్నీ 

వెలుపల తిరిగిన ప్రమాదమే.. 

ఓ మావయ్యా మావయ్యా

కొందరు ఘరాన మనుషులకన్నా 

క్రూరము కావీ జంతువులు..

ఓ అమ్మాయీ.. అమ్మాయీ


శౌర్యం పెరిగిన మనిషిని మృగాన్ని 

కటకటాలలో పెడతారు

ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. 

బలెబలె బాగా ఉందయ్యా


ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. 

బలెబలె బాగా ఉందయ్యా


చరణం 2 :


గుర్రపు అంశం గాడిద వంశం 

చారల చారల జీబ్రావి

చుక్కల జిరాఫి ఒంటెకు బంధువు.. 

మనిషికి బంధువు చింపాంజిపంజి

మనిషి చేష్టలు కోతులకుంటే .. 

కోతి చేష్టలు కొందరివి..


వా...ఓహొహొ అమ్మాయీ 

ఇది కాలేజీ..బలెబలె బతికిన కాలేజి


చరణం 3 :


తీరున తిరిగే నోరును తెరిచే 

ఏనుగు లాంటిది ఏమిటది..

ఓ మావయ్యా.. మావయ్యా

ఏనుగు వంటిది నీటిగుర్రము.. 

దానికి తమ్ముడు ఖడ్గమృగం

అధికులు పేదల కాల్చుకు తింటే.. 

ఇవి ఆకూ అలమే తింటాయి


ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. 

బలెబలె బాగా ఉందయ్యా


చరణం 4 :


రాజులు ఎక్కే అంబారీపై 

అందరు ఎక్కుట తప్పు కదా

రోజులు మారాయ్ž రాజులు పోయి 

ప్రజలే ప్రభువులు ఈనాడు..

అహ.. ప్రజలే ప్రభువులు ఈనాడు

మనుషుల పైన సవారికన్నా.. 

ఏనుగు సవారి నయం కదా

ఆ నిజం నిజం .. 

అహ మజా మజా


ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. 

బలెబలె బాగా ఉందయ్యా

ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ... 

బలెబలె బతికిన కాలేజి


- పాటల ధనుస్సు


11, అక్టోబర్ 2026, ఆదివారం

నీ చెలిమి నేడే కోరితినీ | Nee Chelimi Nede Korithini | Song Lyrics | Aradhana (1962)

నీ చెలిమి నేడే కోరితినీ 


చిత్రం :  ఆరాధన (1962)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  నార్ల చిరంజీవి

నేపధ్య గానం :  పి.సుశీల


పల్లవి :


నీ చెలిమి నేడే కోరితినీ.. 

ఈ క్షణమే ఆశ వీడితినీ

నీ చెలిమి...

పూవు వలె ప్రేమ దాచితినీ 

పూజకు నే నోచనై తిని


నీ చెలిమి నేడె కోరితిని.. 

ఈ క్షణమే ఆశ వీడితిని.. 

నీ చెలిమి


చరణం 1 :


మనసు తెలిసిన మన్నింతువని 

తీయని వూహల తేలితి నేనే

మనసు తెలిసిన మన్నింతువని 

తీయని వూహల తేలితి నేనె

పరుల సొమ్మై పోయినావని.. 

నలిగె నా మనసె


నీ చెలిమి నేడె కోరితిని.. 

ఈ క్షణమే ఆశ వీడితిని.. 

నీ చెలిమి


చరణం 2 :


చెదరి పోయిన హృదయములోన.. 

పదిల పరచిన మమతలు నీకే

చెదరి పోయిన హృదయములోన.. 

పదిల పరచిన మమతలు నీకే

భారమైన దూరమైన.. 

బ్రతుకు నీ కొరకే


నీ చెలిమి నేడె కోరితిని.. 

ఈ క్షణమే ఆశ వీడితిని.. 

నీ చెలిమి


- పాటల ధనుస్సు


నా హృదయంలో నిదురించే చెలి | Naa Hrudayamlo | Song Lyrics | Aradhana (1962)

నా హృదయంలో నిదురించే చెలి 


చిత్రం :  ఆరాధన (1962)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  శ్రీశ్రీ

నేపధ్య గానం :  ఘంటసాల 


పల్లవి :


నా హృదయంలో నిదురించే చెలి

కలలలోనే కవ్వించే సఖి

మయూరివై వయ్యారివై నేడే

నటనమాడి నీవే నన్ను దోచినావే


నా హృదయంలో నిదురించే చెలి


చరణం 1 :


నీ కన్నులలోన దాగెనులే 

వెన్నెల సోన

కన్నులలోన దాగెనులే 

వెన్నెల సోన

చకోరమై నిను వరించి 

అనుసరించినానే..  

కలవరించినానే


నా హృదయంలో నిదురించే చెలీ


చరణం 2 :


నా గానములో నీవే ప్రాణముగ 

పులకరించినావే ..

ప్రాణముగా పులకరించినావే.. 

పల్లవిగా పలుకరించ రావే..

పల్లవిగా పలుకరించ రావే


నీ వెచ్చని నీడ.. 

వెలసెను నా వలపుల మేడ

వెచ్చని నీడ.. 

వెలసెను నా వలపుల మేడ

నివాళితో చేయి సాచి 

ఎదురు చూచినానే.. 

నిదురకాచినానే 


నా హృదయంలో నిదురించే చెలి

కలలలోనే కవ్వించే సఖి

మయూరివై వయ్యారివై నేడే

నటనమాడి నీవే నన్ను దోచినావే


నా హృదయంలో నిదురించే చెలి


- పాటల ధనుస్సు


వెన్నెల లోనీ వికాసమే | Vennelaloni Vikasame | Song Lyrics | Aradhana (1962)

వెన్నెల లోనీ వికాసమే 


చిత్రం :  ఆరాధన (1962)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  పి.సుశీల

 

పల్లవి :


వెన్నెల లోనీ వికాసమే 

వెలిగించెద నీ కనులా

వెన్నెల లోనీ వికాసమే 

వెలిగించెద నీ కనులా

వేదన మరచి ప్రశాంతి గా 

నిదురించుము ఈ రేయి..

నిదురించుము ఈ రేయి..


వెన్నెల లోనీ వికాసమే 

వెలిగించెద నీ కనులా


చరణం 1 :


వాడని పూవుల తావితో..

కదలాడే సుందర 

వసంతమీ కాలము

కదలాడే సుందర 

వసంతమీ కాలము..


చెలి జోలగ పాడే 

వినోద రాగాలలో...

చెలి జోలగ పాడే 

వినోద రాగాలలో...

తేలెడి కల సుఖాలలో... 

నిదురించుము ఈ రేయీ..

నిదురించుము ఈ రేయీ


వెన్నెల లోనీ వికాసమే 

వెలిగించెద నీ కనులా


చరణం 2 :


భానుని వీడని చాయగా... 

నీ భావము లోనే చరింతునోయీ సఖ

నీ భావములోనే చరింతునోయీ సఖ


నీ సేవలలోనే తరింతునోయీ సదా...

నీ సేవలలోనే తరింతునోయీ సదా..

నీ ఎదలోనే వసింతులే... 

నిదురించుము ఈ రేయీ

నిదురించుము ఈ రేయీ


వెన్నెలలోనీ వికాసమే 

వెలిగించెద నీ కనులా

వేదన మరచి ప్రశాంతిగా 

నిదురించుము ఈ రేయి..

నిదురించుము ఈ రేయి... 

నిదురించుము ఈ రేయి


- పాటల ధనుస్సు


ఆడదాని ఓరచూపుతో | Adadani Orachuputho | Song Lyrics | Aradhana (1962)

ఆడదాని ఓరచూపుతో 


చిత్రం :  ఆరాధన (1962)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

రచన : ఆరుద్ర 

నేపధ్య గానం :  ఎస్ జానకి


పల్లవి :


ఆడదాని ఓరచూపుతో జగాన 

ఓడిపోని ధీరుడెవ్వరోయ్

ఆడదాని ఓరచూపుతో జగాన 

ఓడిపోని ధీరుడెవ్వరోయ్

నిజానికి జిగేలని వయారి 

నిన్నుచూడ కరిగిపోదువోయ్


ఆడదాని ఓరచూపుతో జగాన 

ఓడిపోని ధీరుడెవ్వరోయ్


చరణం 1 :


మిఠారి నవ్వులే మిఠాయి తీపులు.. 

కటారి రూపులోన కైపులున్నవి

రంగేళి ఆటకు రడీగా ఉన్నది

రంగేళి ఆటకు రడీగా ఉన్నది...  

కంగారు ఎందుకోయీ 


ఆడదాని ఓరచూపుతో జగాన 

ఓడిపోని ధీరుడెవ్వరోయ్


చరణం 2 :


ఖరీదు లేనివి ఖరారు అయినవి...  

గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి

ఖరీదు లేనివి ఖరారు అయినవి... 

గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి

మజాల సొగసులే ప్రజెంట్ చేసెద..

మజాల సొగసులే ప్రజెంట్ చేసెద...  

సుఖాల తేలవొయీ


ఆడదాని ఓరచూపుతో జగాన 

ఓడిపోని ధీరుడెవ్వరోయ్

నిజానికి జిగేలని వయారి 

నిన్నుచూడ కరిగిపోదువోయ్


ఆడదాని ఓరచూపుతో జగాన 

ఓడిపోని ధీరుడెవ్వరోయ్


- పాటల ధనుస్సు


8, అక్టోబర్ 2026, గురువారం

కట్టుకో కట్టుకో గళ్ళచీర | Kattuko Kattuko Galla Cheera | Song Lyrics | Kadaladu Vadaladu (1969)

కట్టుకో కట్టుకో గళ్ళచీర 


చిత్రం: కదలడు వదలడు (1969)

సంగీతం: టి.వి. రాజు 

గీతరచయిత :  సి. నారాయణ రెడ్డి 

నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల


పల్లవి:


కట్టుకో కట్టుకో.. గళ్ళచీర

పెట్టుకో పెట్టుకో.. పెళ్ళిబొట్టు

చుక్కలాంటి... చిన్నదాన.. 

జున్ను ముక్కలాగ ఉన్నదాన

చుక్కలాంటి... చిన్నదాన.. 

జున్ను ముక్కలాగ ఉన్నదాన


చుట్టుకో చుట్టుకో.. పట్టుపావడ

పట్టుకో పట్టుకో.. పూలదండ

కోడే కారు.. చిన్నవాడ.. 

నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ

కోడే కారు.. చిన్నవాడ.. 

నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ


చరణం 1:


నీ కులుకులు చూస్తుంటే.. 

ఆకలి కానే కాదు

నీ కన్నుల నీడ ఉంటే.. 

లోకంతో పని లేదు

నీ కులుకులు చూస్తుంటే.. 

ఆకలి కానే కాదు

నీ కన్నుల నీడ ఉంటే.. 

లోకంతో పని లేదు


చేతులు చేతులు కలిపి.. 

పోదామా పోదామా

చెక్కిలి చెక్కిలి కలిపి.. 

ఉందామా ఉందామా

నా చిలిపి తుమ్మెద రాజా


చుట్టుకో చుట్టుకో.. పట్టుపావడ

పట్టుకో పట్టుకో.. పూలదండ

కోడే కారు.. చిన్నవాడ.. 

నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ

కోడే కారు.. చిన్నవాడ.. 

నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ


చరణం 2:


ముత్యాల పందింట్లో.. 

మూడుముళ్ళు వేస్తావా

మురిపాల మబ్బుల్లో.. 

ముద్దుగ చెల్లిస్తావా

ముత్యాల పందింట్లో.. 

మూడుముళ్ళు వేస్తావా

మురిపాల మబ్బుల్లో.. 

ముద్దుగ చెల్లిస్తావా


చుక్కల పల్లకి తెస్తా.. 

భలేగా భలేగా

చక్కిలి గింతలు చేస్తా.. 

ఇలాగా ఇలాగా

ఓ చక్కర నవ్వుల రాణీ


కట్టుకో కట్టుకో.. గళ్ళచీర

పెట్టుకో పెట్టుకో.. పెళ్ళిబొట్టు

చుక్కలాంటి... చిన్నదాన.. 

జున్ను ముక్కలాగ ఉన్నదాన

చుక్కలాంటి... చిన్నదాన.. 

జున్ను ముక్కలాగ ఉన్నదాన


చుట్టుకో చుట్టుకో.. పట్టుపావడ

పట్టుకో పట్టుకో.. పూలదండ

కోడే కారు.. చిన్నవాడ.. 

నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ

కోడే కారు.. చిన్నవాడ.. 

నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ


- పాటల ధనుస్సు


ముద్దులొలికే ముద్దబంతి | Muddulolike Muddabanti | Song Lyrics | Kadaladu Vadaladu (1969)

ముద్దులొలికే ముద్దబంతి 


చిత్రం: కదలడు వదలడు (1969)

సంగీతం: టి.వి. రాజు

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల


పల్లవి:


ఓ..ఓ..ఓ..

ముద్దులొలికే ముద్దబంతి

ముసి ముసినవ్వుల చేమంతి

ముసి ముసినవ్వుల చేమంతి

ఇస్తావా... అందిస్తావా

అందిస్తావా...నీ నవ్వులు

అవి ఎన్నడు వాడని పువ్వులు


చరణం 1:


కళ్ళలోన నీ రూపే...

కళ కళలాడుతు ఉంటే

కళ్ళలోన నీ రూపే...

కళ కళలాడుతు ఉంటే

కలలోన నీ చూపే... 

గిలిగింతలు పెడుతుంటే

కలలోన నీ చూపే... 

గిలిగింతలు పెడుతుంటే

నా మనసే నీదైతే...

నా బ్రతుకే నీదైతే

ఇవ్వాలని అడగాలా...

ఇంకా నాతో సరసాలా...

ఇంకా నాతో సరసాలా...


ఓ..ఓ...ఓ..

వలపులోలికే అత్త కొడుకా...

చిలకకు తగ్గ గోరింక

ఈ చిలకకు తగ్గా గోరింక...

వస్తావా కవ్విస్తావా

నువ్వు వస్తావా ...నా బాటలో...

వసి వాడని పరువపు తోటలో...


చరణం 2:


గూటిలోన దాగుంటే...

గుసగుస పెడుతున్నాను

గూటిలోన దాగుంటే...

గుసగుస పెడుతున్నాను

తోటలోనా నీవుంటే...

తోడుగ నేనుంటాను

తోటలోనా నీవుంటే...

తోడుగ నేనుంటాను


నాలోనే నీవుంటే...

నీలోనే నేనుంటే

ఇంకేమి కావాలి...

ఇలపై స్వర్గం రావాలి

ఇలపై స్వర్గం రావాలి...


ఓ..ఓ..ఓ...

ముద్దులోలికే ముద్దబంతి

ముసి ముసినవ్వుల చేమంతి

ముసి ముసినవ్వుల చేమంతి


ఓ..ఓ..ఓ..

వలపులోలికే అత్తకొడుకా...

చిలకకు తగ్గ గోరింక

ఈ చిలకకు తగ్గా గోరింక


- పాటల ధనుస్సు


పాటల ధనుస్సు పాపులర్ పాట

నా ఒళ్ళంతా బంగారం | Naa Vallantha Bangaram | Song Lyrics | Inspector Bharya (1970)

నా ఒళ్ళంతా బంగారం  చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: అప్పలాచార్య గానం: ఎల్.ఆర్.ఈశ్వరి పల్లవి : నా ఒళ్ళంతా బ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు