పరువం పొంగే వేళలో పరదాలవెందుకో
చిత్రం: ఆత్మగౌరవం (1966)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సి.నారాయణరెడ్డి
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి :
పరువం పొంగే వేళలో
పరదాలవెందుకో
చెంగున లేచి చేతులు చాచి
చెలియ నన్నందుకో
ఓ, చెలియ నన్నందుకో
చిగురులు వేసే వయసుతో
చెలగాటమెందుకో
చెంగున లేచి చేతులు చాచి
చెలిని నీవందుకో
చెలిని నీవందుకో
చరణం 1:
అందమైన హృదయం నీది,
హృదయమున్న అందం నీది
అందమైన హృదయం నీది,
హృదయమున్న అందం నీది
మధువులొలుకు ఉహలతోనే
ఒదిగి చూచు ప్రాయం నీది
ఒదిగి చూచు ప్రాయం నీది
చిగురులు వేసే వయసుతో
చెలగాటమెందుకో
చెంగున లేచి చేతులు చాచి
చెలిని నీవందుకో
చరణం 2:
వేచి ఉన్న వెలుగే నీవు
దాచుకున్న కలయే నీవు
వేచి ఉన్న వెలుగే నీవు
దాచుకున్న కలయే నీవు
పగలురేయైన నా మదిలోనే
పరిమళించు వలపే నీవు
పరిమళించు వలపే నీవు
పరువం పొంగే వేళలో
పరదాలవెందుకో
చెంగున లేచి చేతులు చాచి
చెలియ నన్నందుకో
చరణం 3:
మంచువోలె కనిపించేవు
మధురభాద రగిలించేవూ
పొంచి పొంచి నాలో చేరి
పూల వాన కురిపించేవూ
పూల వాన కురిపించేవూ
పరువం పొంగే వేళలో
పరదాలవెందుకో
చెంగున లేచి చేతులు చాచి
చెలియ నన్నందుకో
చెలిని నీవందుకో
- పాటల ధనుస్సు
