RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

7, జులై 2026, మంగళవారం

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది | Ye Kulamu needante | Song Lyrics | Saptapadi (1981)

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది 


చిత్రం :  సప్తపది (1981)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, జానకి 


పల్లవి :


ఏ కులము నీదంటే 

గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు... 

మా కులమే లెమ్మంది


ఏ కులము నీదంటే 

గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు... 

మా కులమే లెమ్మంది 


చరణం 1 :


ఏడు వర్ణాలు కలిసి 

ఇంద్రధనస్సవుతాది

అన్నీ వర్ణాలకు ఒకటే 

ఇహము పరముంటాది


ఏడు వర్ణాలు కలిసి 

ఇంద్రధనస్సవుతాది

అన్నీ వర్ణాలకు ఒకటే 

ఇహము పరముంటాది


ఏ కులము నీదంటే... 

గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు... 

మా కులమే లెమ్మంది 


చరణం 2 :


ఆది నుంచి ఆకాశం మూగది... 

అనాదిగా తల్లి ధరణి మూగది

ఆది నుంచి ఆకాశం మూగది... 

అనాదిగా తల్లి ధరణి మూగది


నడుమ వచ్చి 

ఉరుముతాయి మబ్బులు

నడుమ వచ్చి 

ఉరుముతాయి మబ్బులు

ఈ నడమంత్రపు మనుషులకే 

మాటలు... ఇన్ని మాటలు


ఏ కులము నీదంటే 

గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు... 

మా కులమే లెమ్మంది


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు