RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

22, జులై 2026, బుధవారం

ఇదో ప్రేమగోపురం | Ido Prema Gopuram | Song Lyrics | Bandham (1986)

 ఇదో ప్రేమగోపురం ఇదే నీకు ఆలయం

 

చిత్రం: బంధం (1986)

సంగీతం: కె. చక్రవర్తి

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి. బాలు, పి. సుశీల

 

పల్లవి:


ఇదో ప్రేమగోపురం 

ఇదే నీకు ఆలయం

చిలిపి నవ్వులతోనే

వలపు దీపాలెన్నో పెట్టాలంట 

తోడునీడా నేనై

 

ఇదో ప్రేమగోపురం 

ఇదే నీకు ఆలయం

 

చరణం: 1


పువ్వుతేనై నువ్వు నేనై 

ముద్దాలాడాలంటా

గాలివానై నీలో నేనై 

నీళ్ళాడాలంటా

చెదరని కుంకుమ బొట్టు

చెలిమికి వేకువ పొద్దు

మమతలే మనుగడై కలిపిన 

వలపుల కౌగిలిలో

నీ నీడలో ఆశలా 

మేడలే నిలుపనా

 

ఇదో ప్రేమగోపురం 

ఇదే నీకు ఆలయం

 

చరణం: 2


మేఘాలల్లే తాకంగానే 

మెరుపవ్వాలంటా

ఆకాశంలో నక్షత్రాలే 

నగలవ్వాలంటా

తరగని కాటుక కన్ను

పాపగ చేసెను నన్ను

సిరులనే అడగని

మరులులో పెరిగిన 

ప్రేమలలో

నీ పూజకే పూవునై 

పూయనా రాలనా

 

ఇదో ప్రేమగోపురం 

ఇదే నీకు ఆలయం

చిలిపి నవ్వులతోనే

వలపు దీపాలెన్నో పెట్టాలంట 

తోడునీడా నేనై

 

ఇదో ప్రేమగోపురం 

ఇదే నీకు ఆలయం

లలాలాలలాలలా

లాలాలలాలలా

లలాలాలలాలలా 

లలాలాలలాలలా


పాటల ధనుస్సు 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఇదో ప్రేమగోపురం | Ido Prema Gopuram | Song Lyrics | Bandham (1986)

  ఇదో ప్రేమగోపురం ఇదే నీకు ఆలయం   చిత్రం : బంధం ( 1986) సంగీతం : కె . చక్రవర్తి సాహిత్యం : వేటూరి సుందరరామ మూర్తి గానం : యస్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు