RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, జులై 2026, బుధవారం

కన్ను మూసినా వెలుగే | వైజాగ్ యూత్ సాంగ్ | Kannu Moosina Veluge | Song Lyrics | RK Duvvu | RKSS Creations

 కన్ను మూసినా వెలుగే


వైజాగ్ యూత్ సాంగ్ 

రచన : రామకృష్ణ దువ్వు

 

పల్లవి:

 

కన్ను మూసినా వెలుగే…

గుండె వెన్నెలై కరిగే!

అడుగు అడుగునా రేగే…

సోయగాల సడి కవ్వింతలే!

అంతులేని ఈ ఆనందాన్ని…

అంతా నీ సొంతమే చేసుకోరా…!


చరణం 1:

 

జగదాంబ జంక్షన్ లో 

జావళీలే పాడరా!

సిరిపురం సెంటర్ లో 

చిందలేసి ఆడరా!

అప్పన్న కొండపై ఆశీస్సులంది …

ఋషికొండలో ఖుషీ ఖుషీలు!

హుషారులోన కేరింతలు  కలిపి…

రాజీలేని రోజు గడపరా…!

 

చరణం 2:

 

రైలుబండి స్టేషన్ లో 

రాక్ అండ్ రోలే చెయ్యరా!

రేడియో స్టేషన్ లో 

పాప్ సాంగ్ పాడరా !

ఆర్కే బీచ్ లో ఆరంగేట్రం…

ఉడా పార్క్ లో మెగా ప్రోగ్రాం!

అవకాశాలనే అందుకొని…

ఆకాశానికి నిచ్చెన వెయ్యరా…!

 

- రామకృష్ణ దువ్వు

 

చక్కని దానా నునుపు చెక్కిలి దానా | Chakkanidana Nunupu Chekkilidana | Song Lyrics | Nomu (1974)

చక్కని దానా నునుపు చెక్కిలి దానా 


చిత్రం : నోము (1974)

సంగీతం : సత్యం

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఎస్ పి బాలు, పి.సుశీల  


పల్లవి :


ఏ..హే..హే..ఏహేహే..

ఆహహ అహాహా..

మ్మ్హు మ్మ్హు అహా హా...


హాయ్

చక్కని దానా 

నునుపు చెక్కిలి దానా

ఇంతలో బిడియమా..

చెంతనే విరహమా

చక్కని దానా 

నునుపు చెక్కిలి దానా


లాల్లలలాలలలలాలలలలా

ఏ హే హే ఏ హేహే హే...


చరణం 1:


ఈ బిడియమే ఏ పడతికైనా 

పరమ సహజం

ఈ విరహమే నీ సరసనుంటే 

మధుర మధురం

తీగలా అల్లుకో తేనెలే అందుకో


చక్కని దానా 

నునుపు చెక్కిలి దానా

ఇంతలో బిడియమా..

చెంతనే విరహమా

చక్కని దానా..ఆ అ.. 

నునుపు చెక్కిలి దానా..ఆఅ


చరణం 2:


నీలోన కదలే 

రాగాసుధలే పంచుకోనా

నీలో కలిసి లోలో 

విరిసి నేనుండిపోనా

వుండిపో వుండిపో 

గుండెలో నిండిపో...


చక్కని దానా 

నునుపు చెక్కిలి దానా

ఇంతలో బిడియమా..

చెంతనే విరహమా..ఆహా..

చక్కని దానా..ఆ అ.. 

నునుపు చెక్కిలి దానా..ఆఅ


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్ను మూసినా వెలుగే | వైజాగ్ యూత్ సాంగ్ | Kannu Moosina Veluge | Song Lyrics | RK Duvvu | RKSS Creations

  కన్ను మూసినా వెలుగే … వైజాగ్ యూత్ సాంగ్  రచన : రామకృష్ణ దువ్వు   పల్లవి:   కన్ను మూసినా వెలుగే… గుండె వెన్నెలై కరిగే! అడుగు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు