RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
birthday songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
birthday songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జులై 2026, ఆదివారం

నవ్వులే పువ్వులై | నవతేజ్ బర్త్ డే పాట | Navtej Birthday Song Lyrics | RKSS Creations

 నవ్వులే పువ్వులై 

పరచాలి అడుగు అడుగున


నవతేజ్ బర్త్ డే పాట

రచన : రామకృష్ణ దువ్వు

 

సాకి:


జగతికి వెలుగునిచ్చే దినకరడు

సహస్ర కిరణాలు ప్రసరించే

భువిని చేరెను ఒక కిరణం…

రూపు దాల్చెనది ఒక నవ తేజం...

అదే మన నవ తేజ్…

 

పల్లవి:


నవ్వులే పువ్వులై పరచాలి 

అడుగు అడుగున

ఆ నడకలే ప్రగతిలో సాగాలి 

గెలుపు బాటన

గడచిన ప్రతియేడూ ఒక 

మధుర జ్ఞాపకం

నడిపించును నూరేళ్లు 

నిను సుఖమయం

 

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

 

చరణం 1:


అమ్మా నాన్నల 

ముద్దుల బాలుడు

అక్కకు ప్రాణ స్నేహితుడు

పెద్దలందరకు విధేయుడు

ముద్దుల మురిపాల గోపాలుడు

చదువులలోను ఆటలలోను

చురుకైన వాడు అది ..

నవ్ తేజ్…

 

నవ్వులే పువ్వులై పరచాలి 

అడుగు అడుగున

ఆ నడకలే ప్రగతిలో సాగాలి 

గెలుపు బాటన

గడచిన ప్రతియేడూ ఒక 

మధుర జ్ఞాపకం

నడిపించును నూరేళ్లు 

నిను సుఖమయం

 

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

 

చరణం 2:


కుంచె పట్టినాడంటే 

బొమ్మలే కదలాడు

కలము పట్టినాడంటే 

కవితలే పారును

మిత్రులందరితో 

కేరింతలాడు

మాటమీరని 

రాముడంటి వాడు

భక్తి తోడ మారుతి 

గుండెలోన వుండు

భయమంటే ఎరుగని వాడు .. 

నవ తేజ్..

 

నవ్వులే పువ్వులై పరచాలి 

అడుగు అడుగున

ఆ నడకలే ప్రగతిలో సాగాలి 

గెలుపు బాటన

గడచిన ప్రతియేడూ ఒక 

మధుర జ్ఞాపకం

నడిపించును నూరేళ్లు 

నిను సుఖమయం

 

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

 

- రామకృష్ణ దువ్వు

 

7, జులై 2026, మంగళవారం

కన్నతల్లి కళ్ళల్లో ఆనందపు వెలుగులు | వీరూ పుట్టినరోజు పాట | Birthday Song Veeru Lyrics | RKSS Creations

కన్నతల్లి కళ్ళల్లో ఆనందపు వెలుగులు


వీరూ పుట్టినరోజు పాట

రచన : రామకృష్ణ దువ్వు 

Production : RKSS Creations...

 

సాకి:

 

ప్రతిరోజూ ఉదయించును 

ఆ సూర్యుడు

ఈరోజే జన్మించెను 

మా శివ విరాజుడు

పున్నమి నాడే అగుపించును 

పూర్ణ చంద్రుడు

ప్రతిరోజూ వెన్నెల కురిపించు 

ఈ నెలబాలుడు

 

పల్లవి:

 

కన్నతల్లి కళ్ళల్లో 

ఆనందపు వెలుగులు

కన్నతండ్రి గుండెల్లో 

ఆశల సౌధాలు

ఆనందాలను ఆరబోసి

ఆకాశం దిగి వచ్చింది

మా యింట మొదలైంది వేడుక

నీ పుట్టిన రోజు వేడుక

పుట్టిన రోజు వేడుక

 

హేపీ బర్త్ డే వీరూ

హేపీ బర్త్ డే వీరూ

 

చరణం 1:

 

నిరంతరం వెలుగును 

ఇచ్చే దినకరుడు

నీకు స్ఫూర్తి ప్రదాత కావాలి

పాలకడలిలో 

పుట్టిన చంద్రుడు

నీమోమున నిలచి 

అందమౌను

నిన్న మొన్నటి 

పసి అడుగులు

విజయాల బాటలపై 

సాగుతున్నాయి

 

చరణం 2:

 

అందరి మురిపాల 

ముద్దు బాలుడు

అక్కమాట జవదాటని 

మేటి తమ్ముడు

చదువులందు వెలుగొందే 

తొలి విద్యార్థి

ఆటలైన పాటలైన 

ముందుండే పోరడు

దశవసంతాల 

జన్మదిన దీవెనలు

నూరేళ్ళ జీవితం 

సాగాలి హాయిగా

 

- రామకృష్ణ దువ్వు

RKSS Creations...




3, జులై 2025, గురువారం

చిరునవ్వు పుట్టిందీరోజు | Chirunavvu Puttindi | Aadya Birthday song | RKSS Creations

 చిరునవ్వు పుట్టిందీరోజు ఇలలో



రచన : రామకృష్ణ దువ్వు

 

పల్లవి:

 

చిరునవ్వు పుట్టిందీరోజు ఇలలో

మరుమల్లె విరిసెను మా హృదిలో

ఈ చిట్టి దేవత నడయాడగా

మా ఇల్లు అయినది కోవెలగా

 

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ హేపీ హేపీ బర్త్ డే

ఆద్యా …ఆద్యా … ఆద్యా…

 

చరణం 1:

 

ఆకశాన ముగ్గులతో చుక్కలమరె చక్కగా

చుక్కల రధమెక్కి నెలఱేడు ఇలకేగెనే

ఆద్య మోమున నిలచెను ఆ రాకాశశి

నడచినంతట వెన్నెల విరబూయ

చిరుచిరు నడకల బంగరు బొమ్మ

నీ పుట్టినరోజు ఒక పండుగరోజు

 

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ హేపీ హేపీ బర్త్ డే

ఆద్యా …ఆద్యా … ఆద్యా…

 

చరణం 2:

 

కన్నవారి కలల పైడి రూపానివి

నిన్నుకన్న కనుల కాంతి దీపానివి

చిరు నవ్వుల తోరణం నీవమ్మా

వెలుగులు పంచే దీపం మాయమ్మా

శుక్లపక్ష చంద్రుడల్లె ఎదగాలి నీవు

ఏటేటా జన్మ దినము జరపాలి మేము

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ హేపీ హేపీ బర్త్ డే

ఆద్యా …ఆద్యా … ఆద్యా…

 

చరణం 3:

 

సన్నజాజి పువ్వులు విరిసినట్టు

చందమామ కాంతులు కురిసినట్టు

చిన్నారి పాప నవ్వులు పూసేనిట్టు

మా కంటి వెలుగు నీవేనమ్మా

మా గుండెలోన కొలువైనావమ్మా

పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా

 

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ హేపీ హేపీ బర్త్ డే

ఆద్యా …ఆద్యా … ఆద్యా…

 

చిరునవ్వు పుట్టిందీరోజు ఇలలో

మరుమల్లె విరిసెను మా హృదిలో

ఈ చిట్టి దేవత నడయాడగా

మా ఇల్లు అయినది కోవెలగా

 

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ హేపీ హేపీ బర్త్ డే

ఆద్యా …ఆద్యా … ఆద్యా…

 

- రామకృష్ణ దువ్వు

24, నవంబర్ 2024, ఆదివారం

మందారమంటి మోముపై | Mandaramanti Momupai | Aadya Birthday song Lyrics | RKSS Creations

మందారమంటి మోముపై



రచన           : రామకృష్ణ దువ్వు, 

స్వరకల్పన : ఎస్ వేణుమాధవ్, 

గానం           : శ్రీమతి మూల శ్రీలత, 

రికార్డింగ్      : శ్రీ మాత డిజిటల్ రికార్డింగ్, 

                      విశాఖపట్నం



పల్లవి:


మందారమంటి మోముపై

బంగారమదిమిన బుగ్గలతో

తుమ్మెదలాడే కన్నులతో

అమృతమొలికే చూపులతో

సిరులను చిందే నవ్వులతో

దివినుండి వచ్చిన వేలుపు ..

మా ఇలవేలుపు …


హేపీ బర్త్ డే టూయు … ఆధ్యా …

హేపీ హేపీ బర్త్ డే … ఆధ్యా …

హేపీ బర్త్ డే టూయు … ఆధ్యా …

హేపీ హేపీ బర్త్ డే … ఆధ్యా …

హేపీ బర్త్ డే టూయు … ఆధ్యా …


చరణం 1:


వరముల నీయగ వరలక్ష్మి

స్వరముల వీణతో వాగీశ్వరి

శుభముల నొసగే శివశంకరి

మువ్వురి దీవెన కలగలసి

దువ్వు రాణి గా అవతరంచి

నవ్వులు చిందించే మోమున

పువ్వుల బాటల అరుదెంచె


చరణం 2:


కోటి తారలు ఇలను చూడగ

మేటి తార ఒకటి అవని చేరె

కోటి జన్మల పుణ్య ఫలమున

మాయింట వెలసెను ఆధ్య గ

ప్రేమలు పంచి సిరుల పెంచి

దివినుండి దేవతల దీవెనలతో

జయములు కలుగగ కలకాలం


- RKSS Creations...




పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు