RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

15, అక్టోబర్ 2026, గురువారం

పెళ్ళికి ఫలితం ఏమిటి | Pelliki Phalitham Emiti | Song Lyrics | Inspector Bharya (1970)

పెళ్ళికి ఫలితం ఏమిటి ? 


చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి

గానం: ఎస్.పి.బాలు, పి. సుశీల


పల్లవి :


పెళ్ళికి ఫలితం ఏమిటి ?

చల్లగ సాగే కాపురం

ఆఁ ... కాపురానికి ఫలిత మేమిటి?

రెండు తనువులొక కౌగిలిలో

కలిపేదే అనుబంధం

రెండు మనసులొక ఊపిరిలో

నిలిపేదే అనురాగం...


చరణం 1:


ఇరువురి నడుమ 

ఏ మర్మమూలేని....

జీవనమే బృందావనం

నులివెచ్చగ సందిట చేరే

చెలియకు నేడెందుకో కోపం ?

చెలి కడుపున ఏ మొలకుందో

తెలియదు శ్రీవారికి పాపం

ఇన్నాళ్ళుగ నే వేచింది

ఈ వరాలమాట కోసం...


చరణం 2:


చిన్ని బాబు మోమును చూడు

అన్నీ నీ పోలికలే

ఆ చిలిపి నవ్యులు చూడు

అంతా నీ వాలకమే

ముద్దుపాప మురిపాలన్నీ

ఇద్దరికీ చెగిసగమే ...


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

పెళ్ళికి ఫలితం ఏమిటి | Pelliki Phalitham Emiti | Song Lyrics | Inspector Bharya (1970)

పెళ్ళికి ఫలితం ఏమిటి ?  చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఎస్.పి.బాలు, పి. సుశీల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు