RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

29, అక్టోబర్ 2026, గురువారం

భయం భయంగా వుందమ్మా | Bhayam Bhayamga Vundamma | Song Lyrics | Peddalu Marali (1974)

భయం భయంగా వుందమ్మా 


చిత్రం: పెద్దలు  మారాలి (1974)

సంగీతం: బి. గోపాలం

సాహిత్యం: ఆరుద్ర

గానం: పి.సుశీల


పల్లవి:


భయం భయంగా వుందమ్మా

పట్టణమంతా ఎంతో ఎంతో

భయంభయంగా వుందమ్మా

నువ్వే జ్ఞాపక మొస్తావూ

మన ఇల్లే గుర్తుకు వస్తుంది

ఇల్లూ నువ్వు జ్ఞాపక మొచ్చి

ఏడువువచ్చి కన్నీరొస్తే

తుడిచేవాళ్ళే లేరమ్మా


చరణం: 1


తెలిసినవాళ్ళే లేరు

నాతో కలిసినవాళ్ళే లేరు

ఆకలివేస్తే అన్నం పెట్టి

చీకటిపడితే దుప్పటికప్పి

జో కొట్టేవాళ్ళే లేరమ్మా


చరణం: 2


నీ ఒడిలో బజ్జుంటే

ఏ బాధా లేదమ్మా

నీ పాటే వింటుంటే  

ఏ దిగులూ లేదమ్మా

ఎందుకు నువ్వు కొట్టావమ్మా

ఇప్పుడు మాకు ఎలాగమ్మా


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఊహలు గుస గుసలాడే | Oohalu Gusagusalade | Song Lyrics | Bandipotu (1963)

ఊహలు గుస గుసలాడే  చిత్రం: బందిపోటు (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి : : ఊహలు గుస గుసలాడే  నా హృదయము ఊగిస...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు