మాయదారి లోకం తీరు
చిత్రం: పెద్దలు మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి
పల్లవి:
మాయదారి లోకం తీరు
ఓ రయ్యో చూడు
అల్లి బుల్లి కల్ల కపటం
ఓ లమ్మో చూడు
ఉన్న వాళ్ళకు అన్ని జాస్తి
లేని వాళ్ళకు సర్వం నాస్తి
చరణం: 1
నీతులు చెబుతారు
మాటలు తఖరారు
చక్కని వేషాలు
చాటున మోసాలు
గొప్పవాళ్ళ గోత్రాలు
చెప్పరాని చిత్రాలు
చరణం: 2
మంచికి విలువే లేదు - సై సై
వంచన కంతే లేదు
మనిషికి వెల కడతారు - సై
మనసేమో బలి చేస్తారు
రాను రాను ఈ లోకం
పోను పోను యమలోకం
చరణం: 3
చల్లని లోకంలో
పిల్లలు పెరగాలి
పెద్దలు మారాలి
బుద్ధులు మారాలి
కన్న వారి అడుగుల్లో
చిన్న వాళ్ళు నడవాలి
కన్న వారి అడుగుల్లో
చిన్న వాళ్ళు నడవాలి
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి