RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, అక్టోబర్ 2026, సోమవారం

ఔరా అమ్మక చెల్లా | Oura Ammakachella | Song Lyrics | Apadbhandavudu (1992)

ఔరా అమ్మక చెల్లా 


చిత్రం :  ఆపద్భాంధవుడు (1992)

సంగీతం :  కీరవాణి

గీతరచయిత :  సిరివెన్నెల

నేపధ్య గానం :  ఎస్ పి బాలు, చిత్ర


పల్లవి :


ఔరా అమ్మక చెల్లా! 

ఆలకించి నమ్మడమెల్లా

అంత వింత గాథల్లో 

ఆనందలాలా


బాపురే బ్రహ్మకు చెల్లా.. 

వైనమంత వల్లించవెల్లా

రేపల్లె వాడల్లో ఆనంద లీలా


ఐనవాడే అందరికీ..  

ఐనా అందడు ఎవ్వరికి

ఐనవాడే అందరికీ..  

ఐనా అందడు ఎవ్వరికి


బాలుడా?..  గోపాలుడా? ...  

లోకాల పాలుడా?

తెలిసేది ఎలా ఎలా 

చాంగుభళా!

తెలిసేది ఎలా ఎలా 

చాంగుభళా!


ఔరా అమ్మకచెల్లా! 

ఆలకించి నమ్మటమెల్లా

అంత వింత గాథల్లో 

ఆనందలాలా


చరణం 1 :


ఊ..ఊ..నల్లరాతి కండలతో.. 

హోయ్.. కరుకైనవాడే

ఊ..ఊ.. వెన్నముద్ద గుండెలతో.. 

హోయ్.. కరుణించు తోడే

నల్లరాతి కండలతో 

కరుకైనవాడే ఆ నందలాల

వెన్నముద్ద గుండెలతో 

కరుణించు తోడే ఆనందలీల


ఆయుధాలు పట్టను అంటూ.. 

బావ బండి తోలిపెట్టే ఆ నందలాల

జాణ జానపదాలతో జ్ఞాన గీతి 

పలుకునటే ఆనందలీల


బాలుడా?...  గోపాలుడా?...  

లోకాల పాలుడా?...

తెలిసేది ఎలా ఎలా 

చాంగుభళా!


ఔరా అమ్మక చెల్లా! 

ఆలకించి నమ్మడమెల్లా

అంత వింతగాథల్లో 

ఆనందలాలా..


బాపురే బ్రహ్మకు చెల్లా.. 

వైనమంత వల్లించవెల్లా

రేపల్లె వాడల్లో ఆనంద లీలా ...


చరణం 2 :


ఆలమంద కాపరిలా 

కనిపించలేదా ఆ నందలాల

ఆలమందు కాళుడిలా 

అనుపించు కాదా ఆనందలీల

వేలితో కొండను ఎత్తే.. 

కొండంత వేలుపటే 

ఆ నందలాల

తులసీ దళానికే తేలిపోయి 

తూగునటే ఆనందలీల


బాలుడా?... గోపాలుడా?... 

లోకాల పాలుడా?...

తెలిసేది ఎలా ఎలా 

చాంగుభళా


ఔరా అమ్మక చెల్లా! 

ఆలకించి నమ్మడమెల్లా

అంత వింతగాథల్లో 

ఆనందలాలా


బాపురే బ్రహ్మకు చెల్లా 

వైనమంత వల్లించవెల్లా

రేపల్లె వాడల్లో ఆనంద లీలా


ఆనందలాలా... ఆనంద లీలా

ఆనందలాలా... ఆనంద లీలా

ఆనందలాలా... ఆనంద లీలా


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

పరమేశ్వరుని హితము | Parameswaruni Hitamu | Song Lyrics | Apadbhandavudu (1992)

పరమేశ్వరుని హితము  చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, పాట సాహిత్యం: పరమేశ్వరుని ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు