RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

2, నవంబర్ 2026, సోమవారం

ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను | Aa Navvula Kosame | Song Lyrics | Jameendar (1966)

ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను 


చిత్రం: జమిందారు (1966)

సంగీతం: టి. చలపతిరావు

గీతరచయిత: సి.నారాయణరెడ్డి

నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల


పల్లవి:


ఆ నవ్వుల కోసమే..

నేను కలలు కన్నాను..

ఆ నడకల కోసమే...

నేను కాచుకున్నాను...


ఆ నవ్వుల కోసమే..

నేను కలలు కన్నాను..

ఆ నడకల కోసమే...

నేను కాచుకున్నాను..


చరణం 1:


ఈ నవ్వులు ఎవ్వరివి ...

నీవే చిలికించినవీ

ఈ నడకలు ఎవ్వరివి.. 

నీవే నడిపించినవి..

నీ జీవన రాగాలే 

నాలో వినిపించినవీ..

నీ జీవన రాగాలే 

నాలో వినిపించినవీ...హో...

నాలో వినిపించినవి..


ఆ నవ్వుల కోసమే..

నేను కలలు కన్నాను..

ఆ నడకల కోసమే...

నేను కాచుకున్నాను..


చరణం 2:


అల్లుకున్న ఆశలన్నీ..

పల్లవించె ఈనాడే...

మరులుగొన్న బాసలన్నీ...

పరిమళించె ఈ వేళా...

చేరలేని నీలాకాశం ..

శిరసు వంచే మనకోసం...

చేరలేని నీలాకాశం...

శిరసు వంచె మనకోసం....హో...

శిరసు వంచె మన కోసం


ఆ నవ్వుల కోసమే..

నేను కలలు కన్నాను..

ఆ నడకల కోసమే...

నేను కాచుకున్నాను..


చరణం 3:


ముందు నీవు నిలుచుంటే 

నందనాలు కావాలా..

మనసులోన నీవుంటే...

మందిరాలు నాకేలా...

కడలిలోని తరగలవోలే 

కలిసిపోదమీ వేళా...

కడలిలోని తరగలవోలే 

కలిసిపోదమీ వేళా...హో...

కలిసిపోదమీ వేళా...


ఆ నవ్వుల కోసమే..

నేను కలలు కన్నాను..

ఆ నడకల కోసమే...

నేను కాచుకున్నాను..

ఉం..ఉం...ఉం..ఉం..ఉమ్మ్....


- పాటల ధనుస్సు


నీతోటే ఉంటాను శేషగిరిబావా | Neethone Vuntanu | Song Lyrics | Jameendar (1966)

నీతోటే ఉంటాను శేషగిరిబావా 


చిత్రం: జమిందారు (1966)

సంగీతం: టి. చలపతిరావు

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: పి.సుశీల 


పల్లవి:


నీతోటే ఉంటాను 

శేషగిరిబావా...

నీ మాట వింటాను 

మాటకారి బావా...

నీతోటే ఉంటాను 

శేషగిరిబావా...

నీ మాట వింటాను 

మాటకారి బావా...


చరణం 1:


ఒక్కదాన్నైపోయీ 

బిక్కుమని నేనుంటే....

వెన్నెలే నువు లేకా 

వెచ్చనైపోతుంటే...

ఒక్కదాన్నైపోయీ 

బిక్కుమని నేనుంటే....

వెన్నెలే నువు లేకా 

వెచ్చనైపోతుంటే...


కంటికే నిదురుందా...ఆ..

కాలమే కదిలిందా...

కంటికే నిదురుందా...ఆ..

కాలమే కదిలిందా...

సొగసరి బావా గడసరి బావా 

సొగసరి బావా గడసరి బావా 


నీతోటే ఉంటాను 

శేషగిరిబావా...

నీ మాట వింటాను 

మాటకారి బావా..


చరణం 2:


నీవు నడచిన జాడా...

నాకు వెన్నెల వాడా...

నీవు నిలచిన నీడా...

నాకు రవ్వల మేడా...

నీవు నడచిన జాడా...

నాకు వెన్నెల వాడా...

నీవు నిలచిన నీడా...

నాకు రవ్వల మేడా...


నీవు లేకుంటేను 

నేను లేనే లేను...

సొగసరి బావా గడసరి బావా 

సొగసరి బావా గడసరి బావా 


నీతోటే ఉంటాను 

శేషగిరిబావా...

నీ మాట వింటాను 

మాటకారి బావా..


చరణం 3:


కంటిపాపలలోనా 

కాపురం ఉంటాను...

గుండెలోనా నేను 

గూడు కట్టుకుంటాను...

కంటిపాపలలోనా 

కాపురం ఉంటాను...

గుండెలోనా నేను 

గూడు కట్టుకుంటాను...


నన్ను దోచినవాడా...

నిన్ను దోచగలేనా...

సొగసరి బావా...

గడసరి బావా....


నీతోటే ఉంటాను 

శేషగిరిబావా...

నీ మాట వింటాను 

మాటకారి బావా..


- పాటల ధనుస్సు


1, నవంబర్ 2026, ఆదివారం

పలకరించితేనే ఉలికి ఉలికి | Palakarinchitene Uliki | Song Lyrics | Jameendar (1966)

పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు 


చిత్రం: జమిందారు (1966)

సంగీతం: టి. చలపతిరావు

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


పలకరించితేనే 

ఉలికి ఉలికి పడతావు...

నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో.. ఓ...

మనసు పెనవేస్తే ఏమౌతావో..ఓ..ఓ..


ఉలికిపాటుతోనే...

పులకరించిపోతావు

నేను ఔనంటే ఏంచేస్తావో..ఓ...

కాదు పొమ్మంటే ఏమౌతావో..ఓ..ఓ...


చరణం 1:


మొలక నడుము హొయలు 

చూసి మురిసిపోదును..

జిలుగుపైట నీడలోన 

పరవశింతును ..

మొలక నడుము హొయలు 

చూసి మురిసిపోదును ..

జిలుగుపైట నీడలోన 

పరవశింతును...


సొగసులొలుకు నడుము

హొయలు చూడనీయను

సొగసులొలుకు నడుము

హొయలు చూడనీయను

కడకొంగున నిను బిగించి 

నడచిపోదునూ


ఉలికిపాటుతోనే...

పులకరించిపోతావు

నేను ఔనంటే ఏంచేస్తావో..ఓ...

కాదు పొమ్మంటే ఏమౌతావో..ఓ..ఓ...


చరణం 2:


పువ్వునై కురులలో 

పొంచియుందును...

నవ్వునై పెదవిపై 

పవ్వళింతును ..

పువ్వునై కురులలో 

పొంచియుందును..

నవ్వునై పెదవిపై 

పవ్వళింతును...


పూలతోడ నిన్ను కూడ 

ముడుచుకొందును

పూలతోడ నిన్ను కూడ 

ముడుచుకొందును

పెదవిపైన ఒదిగిన నిను 

కదలనియ్యను..ఊ..


పలకరించితేనే 

ఉలికి ఉలికి పడతావు...

నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో..ఓ...

మనసు పెనవేస్తే ఏమౌతావో..ఓ..ఓ..


చరణం 3:


కలలనైన నిన్ను నేను 

కలుసుకొందును

దొంగనై దోరవలపు 

దోచుకొందును ...

కలలనైన నిన్ను నేను 

కలుసుకొందును...

దొంగనై దోరవలపు 

దోచుకొందును...


చిలిపి చిలిపి మాటలింక 

చెల్లవందును ..ఊ..

చిలిపి చిలిపి మాటలింక 

చెల్లవందును ...

తొలివలపుల తియ్యదనం 

తెలుపమందును


పలకరించితేనే 

ఉలికి ఉలికి పడతావు...

నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో..ఓ...

మనసు పెనవేస్తే ఏమౌతావో..ఓ..ఓ..


ఉలికిపాటుతోనే...

పులకరించిపోతావు

నేను ఔనంటే ఏంచేస్తావో..ఓ...

కాదు పొమ్మంటే ఏమౌతావో..ఓ..ఓ...


- పాటల ధనుస్సు


వగలరాణివి నీవే సొగసు కాడను నేనే | Vagalaranivi Neeve | Song Lyrics | Bandipotu (1963)

వగలరాణివి నీవే సొగసు కాడను నేనే 


చిత్రం: బందిపోటు (1963)

సంగీతం: ఘంటసాల

సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి

గానం: ఘంటసాల


పల్లవి : 


ఓహోహో...ఓ... ఓ...

ఓహోహో... ఓ... ఓ...

ఓహోహోహో... ఓ... ఓ...


వగలరాణివి నీవే 

సొగసు కాడను నేనే

ఈడు కుదిరెను 

జోడు కుదిరెను 

మేడ దిగి రావే


వగల రాణివి నీవె 

సొగసు కాడను నేనె

ఈడు కుదిరెను 

జోడు కుదిరెను 

మేడ దిగి రావే

వగల రాణివి నీవే


చరణం 1 :


పిండి వెన్నెల నీ కోసం 

పిల్ల తెమ్మెర నా కోసం

పిండి వెన్నెల నీ కోసం 

పిల్ల తెమ్మెర నా కోసం

రెండు కలసిన 

నిండు పున్నమి 

రేయి మన కోసం


వగల రాణివి నీవే .. 

ఓహోహో ఓ...

ఒహోహో ఓ..

ఒహోహో ఓ..ఓ..


ఓహోహొ ఓఓఓ

ఓహోహొ ఓఓఓ


చరణం 2 :


దోర వయసు చినదాన 

కోర చూపుల నెరజాణ

దోర వయసు చినదాన 

కోర చూపుల నెరజాణ

బెదరుటెందుకు 

కదలు ముందుకు 

ప్రియుడనేగాన


వగల రాణివి నీవే

ఓహోహో ఓ...

ఓహోహో ఓ...

ఓహోహో ఓఓఓ...


చరణం 3 :


కోపమంత పైపైనే 

చూపులన్నీ నాపైనే

కోపమంత పైపైనే 

చూపులన్నీ నాపైనే

వరుని కౌగిట 

ఒరిగినంతట 

కరిగి పోదువులె


వగలరాణివి నీవే.. 

సొగసు కాడను నేనే

ఈడు కుదిరెను 

జోడు కుదిరెను.. 

తోడుగా రావే...


వగల రాణివి నీవే .. 

ఓహోహో ఓ...

ఓహోహో ఓ...

ఓహోహో ఓఓఓ...


- పాటల ధనుస్సు


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను | Aa Navvula Kosame | Song Lyrics | Jameendar (1966)

ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను  చిత్రం: జమిందారు (1966) సంగీతం: టి. చలపతిరావు గీతరచయిత: సి.నారాయణరెడ్డి నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల పల్ల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు