RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

2, నవంబర్ 2026, సోమవారం

నీతోటే ఉంటాను శేషగిరిబావా | Neethone Vuntanu | Song Lyrics | Jameendar (1966)

నీతోటే ఉంటాను శేషగిరిబావా 


చిత్రం: జమిందారు (1966)

సంగీతం: టి. చలపతిరావు

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: పి.సుశీల 


పల్లవి:


నీతోటే ఉంటాను 

శేషగిరిబావా...

నీ మాట వింటాను 

మాటకారి బావా...

నీతోటే ఉంటాను 

శేషగిరిబావా...

నీ మాట వింటాను 

మాటకారి బావా...


చరణం 1:


ఒక్కదాన్నైపోయీ 

బిక్కుమని నేనుంటే....

వెన్నెలే నువు లేకా 

వెచ్చనైపోతుంటే...

ఒక్కదాన్నైపోయీ 

బిక్కుమని నేనుంటే....

వెన్నెలే నువు లేకా 

వెచ్చనైపోతుంటే...


కంటికే నిదురుందా...ఆ..

కాలమే కదిలిందా...

కంటికే నిదురుందా...ఆ..

కాలమే కదిలిందా...

సొగసరి బావా గడసరి బావా 

సొగసరి బావా గడసరి బావా 


నీతోటే ఉంటాను 

శేషగిరిబావా...

నీ మాట వింటాను 

మాటకారి బావా..


చరణం 2:


నీవు నడచిన జాడా...

నాకు వెన్నెల వాడా...

నీవు నిలచిన నీడా...

నాకు రవ్వల మేడా...

నీవు నడచిన జాడా...

నాకు వెన్నెల వాడా...

నీవు నిలచిన నీడా...

నాకు రవ్వల మేడా...


నీవు లేకుంటేను 

నేను లేనే లేను...

సొగసరి బావా గడసరి బావా 

సొగసరి బావా గడసరి బావా 


నీతోటే ఉంటాను 

శేషగిరిబావా...

నీ మాట వింటాను 

మాటకారి బావా..


చరణం 3:


కంటిపాపలలోనా 

కాపురం ఉంటాను...

గుండెలోనా నేను 

గూడు కట్టుకుంటాను...

కంటిపాపలలోనా 

కాపురం ఉంటాను...

గుండెలోనా నేను 

గూడు కట్టుకుంటాను...


నన్ను దోచినవాడా...

నిన్ను దోచగలేనా...

సొగసరి బావా...

గడసరి బావా....


నీతోటే ఉంటాను 

శేషగిరిబావా...

నీ మాట వింటాను 

మాటకారి బావా..


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను | Aa Navvula Kosame | Song Lyrics | Jameendar (1966)

ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను  చిత్రం: జమిందారు (1966) సంగీతం: టి. చలపతిరావు గీతరచయిత: సి.నారాయణరెడ్డి నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల పల్ల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు