RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, సెప్టెంబర్ 2024, ఆదివారం

జై జై గణేశా జై కొడతా గణేశా | Jai Jai Ganesha Jekodatha Ganesha | Song Lyrics | Jai Chiranjeeva (2005)

జై జై గణేశా జై కొడతా గణేశా



చిత్రం : జై చిరంజీవ (2005)

సంగీతం : మణిశర్మ

గీతరచయిత : చంద్రబోస్

నేపధ్య గానం : బాలు 


పల్లవి : 

గణేశ్ మహరాజ్ కి.. జై...

గణేశ్ మహరాజ్ కి.. జై... 


ఓం... జై గణపతి...  జై జై జై.. గణపతి

ఓం... జై గణపతి...  జై జై జై.. గణపతి

ఓం... జై గణపతి...  జై జై జై.. గణపతి

ఓం... జై గణపతి...  జై జై జై.. గణపతి

జై జై గణేశా... జై కొడతా.. గణేశా

జయములివ్వు బొజ్జగణేశా...  గణేశా

హాయ్ హాయ్ గణేశా... అడిగేస్తా గణేశా

అభయమివ్వు బుజ్జిగణేశా...  గణేశా


లోకం నలుమూలలా లేదయ్యా కులాసా

దేశం పలువైపులా ఏదో రభస

మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా

పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా


చిట్టి ఎలుకను ఎక్కి... 

గట్టి కుడుములు మెక్కి

చిక్కు విడిపించగ 

నడిపించగ చెయ్యి తమాషా

గణేశా.. గమ్ గణపతి... గణేశా...  

గమ్ గణపతి


గణేశా..  గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

జై జై గణేశా... జై కొడతా.. గణేశా

జయములివ్వు బొజ్జగణేశా...  గణేశా

హాయ్ హాయ్ గణేశా... అడిగేస్తా గణేశా

అభయమివ్వు బుజ్జిగణేశా...  గణేశా


లంబోదరా శివా సుతాయా.. 

లంబోదర నీదే దయ

లంబోదరా శివా సుతాయా.. 

లంబోదర నీదే దయ..  

లంబోదర నీదే దయ  


చరణం   1 : 


నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి.. 

వాహనమై ఉండలేదా

ఎలకేమో తమరికి నెమలేమో తంబికి... 

రథమల్లే మారలేదా


పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా... 

కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా

ఎందుకు మాకీ హింసామార్గం... 

ఎదిగేటందుకు అది ఆటంకం

నేర్పరా మాకు సోదరభావం... 

మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా


గణేశా.. గమ్ గణపతి... గణేశా...  

గమ్ గణపతి

గణేశా..  గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

జై జై గణేశా... జై కొడతా.. గణేశా

జయములివ్వు బొజ్జగణేశా...  

గణేశా

హాయ్ హాయ్ గణేశా... 

అడిగేస్తా గణేశా

అభయమివ్వు బుజ్జిగణేశా...  

గణేశా


చరణం   2 : 


చందాలను అడిగిన దాదాలను 

దండిగా తొండంతో తొక్కవయ్యా

లంచాలను మరిగిన నాయకులను 

నేరుగా దంతంతో దంచవయ్యా


ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ.. 

మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా

మాలో చెడునే ముంచాలయ్యా.. 

లోలో అహమే వంచాలయ్యా

నీలో తెలివే పంచాలయ్యా... 

ఇంతకుమించి కోరేందుకు లేదు దురాశ


గణేశా.. గమ్ గణపతి... గణేశా...  

గమ్ గణపతి

గణేశా..  గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

జై జై గణేశా... జై కొడతా.. గణేశా

జయములివ్వు బొజ్జగణేశా...  గణేశా


హాయ్ హాయ్ గణేశా... అడిగేస్తా గణేశా

అభయమివ్వు బుజ్జిగణేశా...  గణేశా

లోకం నలుమూలలా లేదయ్యా కులాసా

దేశం పలువైపులా ఏదో రభస


మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా

పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా

చిట్టి ఎలుకను ఎక్కి... 

గట్టి కుడుములు మెక్కి

చిక్కు విడిపించగ నడిపించగ 

చెయ్యి తమాషా

గణేశా.. గమ్ గణపతి... గణేశా...  

గమ్ గణపతి

గణేశా..  గమ్ గమ్ గమ్ గమ్ గణపతి


గణపతి బప్పా మోరియా...

ఆధా లడ్డు ఖా లియా

గణపతి బప్పా మోరియా...

ఆధా లడ్డు ఖా లియా

గణపతి బప్పా మోరియా...

ఆధా లడ్డు ఖా లియా

గణపతి బప్పా మోరియా...

ఆధా లడ్డు ఖా లియా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు