RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
chiranjeevi songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
chiranjeevi songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, అక్టోబర్ 2026, సోమవారం

పరమేశ్వరుని హితము | Parameswaruni Hitamu | Song Lyrics | Apadbhandavudu (1992)

పరమేశ్వరుని హితము 


చిత్రం: ఆపద్బాంధవుడు (1992)

సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల

గానం: ఎస్ పి బాలు, కె ఎస్ చిత్ర 


పాట సాహిత్యం:


పరమేశ్వరుని హితము 

పాటించి దాక్షాయనీ

తండ్రి తలపెట్టిన 

క్రతువు చూడ వచ్చి

అచ్చట కొలువై ఉన్న 

పూజ్యుల సమక్యమందున

తండ్రిచే పరావబవించబడి 

పరి పరి వీదముల పరితపించుచూ


శివనింద చెవిన పడి 

పాపమంటిన జన్మ

పతి పాద సేవకిక 

పనికిరాదమ్మా

శితికంటు జతనంటు 

భోగంబు బగ్గాయి

సతి గుండె చితి గుండమాయే

దూర్జటిని దూషించు 

దక్షసుతగా బ్రతుకు 

తుచ్చ జీవస్తవం ఆయే

అగ్ని బట్టారకా అంటరాననకా

అగ్ని బట్టారకా అంటరాననకా

యోగార్చి రగిలించవయా

అనువనువు సుచి శిఖలలో 

కడతేర్చవయ్యా


- పాటల ధనుస్సు


ఒడియప్పా ఒడియప్పా | Odiyappa Odiyappa | Song Lyrics | Apadbhandavudu (1992)

ఒడియప్పా ఒడియప్పా 


చిత్రం : ఆపద్భాంధవుడు (1992)

సంగీతం :  కీరవాణి

గీతరచయిత : సిరివెన్నెల

నేపధ్య గానం :  ఎస్ పి బాలు,


పల్లవి :


ఒడియప్పా…. ఒడియప్పా… 

ఒడియప్పా…. ఒడియప్పా…

ఒడియప్పా ఒడియప్పా 

ఒడి ఒడియప్పా


ఓనామాలొప్పా శివాయః 

తప్పా చెప్పేయ్యప్పా 

ఓపిగ్గా ఓ చెన్నప్పా

ఆవులు మేపే అల్లరి గోపాలప్పా 

పల్లవి చెప్పా పై చరణం 

నువ్వే చెప్పేయిరప్పా

ఒడియప్పా…. ఒడియప్పా… 

ఒడియప్పా…. ఒడియప్పా…

ఒడియప్పా ఒడియప్పా 

ఒడి ఒడియప్పా


చరణం 1 :


ఒడియప్పా…. ఒడియప్పా…

ఒడియప్పా…. ఒడియప్పా…

ఒడియప్పా ఒడియప్పా 

ఒడి ఒడియప్పా

ఒకరికి ఒకరప్పా ఒంటిగ లేమప్పా 

నువ్వే నేనప్పా నేనే నువ్వప్పా

నీకు నాకు ఉన్నాడప్పా 

ఆ పైవున్నప్పా ఆ పైవున్నప్పా 

ఆ పైవున్నప్పా ఆ పైవున్నప్పా

ఒడియప్పా ఒడియప్పా 

ఒడియప్పా ఒడియప్పా 

ఒడి ఒడియప్పా


చరణం 2 :


ఓనామాలొప్పా శివాయః 

తప్పా చెప్పేయ్యప్పా 

ఓపిగ్గా ఓ చెన్నప్పా

ఆవులు మేపే అల్లరి 

గోపాలప్పా పల్లవి చెప్పా పై 

చరణం కూడా నేనే చెప్పా

ఒడియప్పా…. ఒడియప్పా…

ఒడియప్పా ఒడియప్పా 

ఒడి ఒడియప్పా ఒడి ఒడియప్పా


- పాటల ధనుస్సు


2, అక్టోబర్ 2026, శుక్రవారం

చుక్కలారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కలారా చూపుల్లారా 

చిత్రం :  ఆపద్భాంధవుడు (1992)

సంగీతం :  కీరవాణి

గీతరచయిత :  సిరివెన్నెల

నేపధ్య గానం :  చిత్ర


పల్లవి :


చుక్కలారా చూపుల్లారా 

ఎక్కడమ్మా జాబిలీ

మబ్బుల్లారా మంచుల్లారా 

తప్పుకోండీ దారికీ

వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ?

విన్నవించరా వెండి మింటికీ?

జో జో.. లాలీ...  జో జో... లాలీ


చరణం 1 :


మలి సంధ్య వేళాయే.. 

చలి గాలి వేణువాయే 

నిదురమ్మా ఎటు పోతివే

మునిమాపు వేళాయే.. 

కనుపాప నిన్ను కోరె 

కునుకమ్మా ఇటు చేరవే


చరణం 2 :


నిదురమ్మా ఎటు పోతివే? 

కునుకమ్మా ఇటు చేరవే..

నిదురమ్మా ఎటు పోతివే? 

కునుకమ్మా ఇటు చేరవే..

గోధూళి వేళాయే.. 

గూళ్ళని కనులాయే

గోధూళి వేళాయే.. 

గూళ్ళని కనులాయే

గువ్వల రెక్కల పైనా 

రివ్వు రివ్వున రావే


జోల పాడవా బేల కళ్ళకి.. 

వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ

జో జో లాలీ.. జో జో లాలీ... 

జో జో లాలీ.. జో జో లాలీ


- పాటల ధనుస్సు


29, సెప్టెంబర్ 2026, మంగళవారం

పువ్వూ నవ్వే గువ్వానవ్వే | Puvvu Navve Guvva Navve | Song Lyrics | Apadbhandavudu (1992)

పువ్వూ నవ్వే గువ్వానవ్వే 


చిత్రం : ఆపద్భాంధవుడు (1992)

సంగీతం : ఎం.ఎం. కీరవాణి

గీతరచయిత : సి.నారాయణరెడ్డి

నేపధ్య గానం : ఎస్ పి బాలు, చిత్ర


పల్లవి :


పువ్వూ నవ్వే... గువ్వానవ్వే..

పువ్వూ నవ్వే...  గువ్వానవ్వే

మువ్వనవ్వే ... గవ్వా నవ్వే

రవ్వల బొమ్మ నవ్వదేమే... ఆ..


మానూ నవ్వే ... మబ్బూ నవ్వే

మాటా నవ్వే...  మనసూ నవ్వే

మాలచ్చిమీ...  నవ్వదేమే...

ఆరారారరా...అరారారారార...


చిలుకకు చీరే కడితే...  

హైలెస్సో...

మొలకకు చిగురే పుడితే...  

హైలెస్సో...

అది ఎవరెవరెవమ్మా.. 

ఇదిగిదిగోమ్మా..

అది ఎవరెవరెవమ్మా.. 

ఇదిగిదిగోమ్మా..

పువ్వు గువ్వా సువ్వీ అంటే

మానూ మబ్బూ రివ్వూ మంటే

రవ్వలబొమ్మా నవ్వాలమ్మా

రాచనిమ్మా నవ్వాలమ్మా

అరారరరరరరరా..


హైలెస్సో హైలెస్సో..

హైలెస్సో హైలెస్సో..


చరణం 1  :


కోయిలాలో.. కూయవేమే..

కొండగాలో.. వీచవేమే..

అరారరరరరరా...


కుహూ కుహూ తప్ప 

కోయిలమ్మకేం తెలుసు... ఆ..

ఓహోం.. ఓహోం తప్ప 

కొండగాలికేం తెలుసు... ఆ..

గజ్జకట్టుకోకున్నా 

ఘల్లుఘల్లుమంటుంది 

ఏం అడుగు..

నువ్వే అడుగు..


ఎవరిదా అడుగు.. నాకేం తెలుసు..

ఎవరిదా అడుగు.. నాకేం తెలుసు..

పోనీ..

గొంతు దాటిరాకున్నా 

గుండె ఊసు చెబుతుందీ..

ఏ పలుకు.. అమ్మా పలుకు..

నీ పలుకు.. ఊహు నీ పలుకు..

ఊహు నీ...ఈ.. ఈ..  పలుకు..


కామాక్షమ్మ కరుణించిందో...  

మీనాక్షమ్మ వరమిచ్చిందో

రవ్వలబొమ్మ నవ్విందమ్మా...  

రాచనిమ్మ నవ్విందమ్మా

ఆరరరరరరరరరా...


చరణం 2  :


హోయ్..హోయ్..హోయ్..

హోయ్.. ఆఆఆఅ...

నవ్వులేమో దివ్వెలాయే... 

నడకలేమో మువ్వలాయే...

ఆరారారారారారా...


ఆలమందలు కాసిన వాడేనా.. 

అ... ఆ..

పాలబిందెలు మోసినవాడేనా.. 

అ... ఆ..

ఏమి కవితలల్లాడమ్మా.. 

ఎన్ని కళలు నేర్చాడమ్మా..

ఏమి కవితలల్లాడమ్మా.. 

ఎన్ని కళలు నేర్చాడమ్మా..


కనులముందు నీవుంటే...  

కవిత పొంగి పారిందమ్మా..

మాటా నీదే...  పాటా నీదే...  

మనసూరించే ఆటా నీదే..

పున్నమిరెమ్మా పుట్టినరోజు...  

వెన్నెల చిందూ నాదే నాదే


ఆరారారారారాఅ...

ఆఆ..ఆఆఆఆఆ..అ.... ఆ..  

రారారారారారా.... అ.... ఆ..

ఓహోహో..ఓఓఓఓ...అ.ఆ


- పాటల ధనుస్సు


6, సెప్టెంబర్ 2026, ఆదివారం

శాంతీ ఓం శాంతీ | Shanti Om Shanti | Song Lyrics | Attaku Yamudu Ammayiki Mogudu (1989)

శాంతీ ఓం శాంతీ 


చిత్రం:  అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
సంగీతం:  చక్రవర్తి
సాహిత్యం:  వేటూరి
గానం: ఎస్. పి .బాలు, ఎస్ జానకి

పల్లవి:

శాంతీ ఓం శాంతీ...
అరె ఖైధి పోయే దారేదీ
స్పీడె తగ్గించు లేడీ 
వేడుక కాదయ్య 
చూడు నా వేడి ఇక
దూకే నా బ్రేకే చూడమ్మా...
ఓకే చూశాకే చూపిస్తా 
నా తడాకా
దూకే నా బ్రేకే చూడమ్మా...
ఓకే చూశాకే చూపిస్తా 
నా తడాకా

శాంతీ ఓం శాంతీ...
అరె ఖైధి


చరణం: 1

టక్కు టిక్కు టెక్కు 
నిక్కు తుపాఖీ
రుక్క పిక్క దక్కే 
వేలా జలాకీ
కౌగిళ్లల్లో ఖైదూ...
చెయ్యాలమ్మ నేడూ
శ్రుతే ముంచి మతే పోయీ 
జతే అయినందుకూ
ఈ కేసునే కొట్టెయనా 
పట్టెసుకోనా
దూకే నా బ్రేకే చూడమ్మా...
ఓకే చూశాకే చూపిస్తా 
నా తడాకా
దూకే నా బ్రేకే చూడమ్మా...
ఓకే చూశాకే చూపిస్తా 
నా తడాకా

శాంతీ ఓం శాంతీ...
అరె ఖైధి 

చరణం: 2

కన్ను ముక్కు సోకు 
చూసి వరించా
ఎక్కి తొక్కి నీకే 
దక్కి వలేసా
వయ్యారంతో ఫైలూ 
వొళ్ళోకొస్తే వెయ్యి
బజారంతా మజాచేసెయ్ 
నిషా అందాలతో
నీ ఊపులో ఊరేగనా 
చలరేగిపోనా

శాంతీ ఓం శాంతీ...
అరె ఖైధి పోయే దారేదీ
స్పీడె తగ్గించు లేడీ 
వేడుక కాదయ్య 
చూడు నా వేడి ఇక
దూకే నా బ్రేకే చూడమ్మా...
ఓకే చూశాకే చూపిస్తా 
నా తడాకా
దూకే నా బ్రేకే చూడమ్మా...
ఓకే చూశాకే చూపిస్తా 
నా తడాకా


- పాటల ధనుస్సు

టింగురమ్మ చక్కనమ్మ | Tinguramma Chakkanamma | Song Lyrics | Attaku Yamudu Ammayiki Mogudu (1989)

టింగురమ్మ చక్కనమ్మ 

చిత్రం:  అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)

సంగీతం:  చక్రవర్తి

సాహిత్యం:  వేటూరి

గానం: ఎస్.పి.బాలు, ఎస్ జానకి


పల్లవి:


టింగురమ్మ  చక్కనమ్మ 

చెక్కిలెంత మక్కువో

చెంగు చెంగు లేది చూపు 

కళ్ళకెంత మక్కువో

దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా 

జారు కొప్పుల్లో చామంతి పెట్టనా

దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా 

జారు కొప్పుల్లో చామంతి పెట్టనా


టింగురంగ చక్కనోడి 

కౌగిలెంత తొక్కిడో

టింగు టింగు రెప్పలాడు 

కళ్ళకెంత తాకిడొ

వాలు సంద్యల్లొ పూలే కొట్టనా 

వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా

వాలు సంద్యల్లొ పూలే కొట్టనా 

వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా


చరణం: 1


నీ ఒంపుకొక్క కొంప కట్టి 

కాపురాలు చేసెయ్యనా

నీ ఒళ్ళు పక్క ఒళ్ళు పెట్టి 

కన్నె సోకు కాజెయ్యనా

అరె కొత్త పిచ్చి పట్టుకున్న 

ఖోడె గాడికేమో కొంగే అలుసంటా

కోక సిగ్గు వీడకున్న ఈడు 

తల్లికేమో కొంతే తెలుసంటా

సరేనంటె సాయంకాలం 

చలె తీరిపోదా

అలాగంటె వేలాకోలం 

శృతేమించి పోదా


టింగురమ్మ చక్కనమ్మ 

చెక్కిలెంత మక్కువో

టింగురంగ చక్కనోడి 

కౌగిలెంత తొక్కిడో

దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా 

జారు కొప్పుల్లో చామంతి పెట్టనా

వాలు సంద్యల్లొ పూలే కొట్టనా 

వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా


చరణం: 2


నీ ముట్టడింక ఆపలేక 

ముద్దబంతులిచ్చెయ్యనా

నీ తట్టుడింక తట్టుకుంటు 

తందనాలకొచ్చెయ్యనా

తేమ గాలి అంటుకొని 

ప్రేమ పురాణం చెబుతా రమ్మంటా

తెల్ల చీర కట్టు తప్పు 

భామా కలాపం ఇపుడే లెమ్మంటా

చలాకీల సయ్యాటల్లో 

సలామంట నీకూ

గులాభీల పూదోటుందీ 

చలో అంట నేనూ


టింగురంగ చక్కనోడి 

కౌగిలెంత తొక్కిడో

టింగు టింగు రెప్పలాడు 

కళ్ళకెంత తాకిడొ

వాలు సంద్యల్లొ పూలే కొట్టనా 

వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా

వాలు సంద్యల్లొ పూలే కొట్టనా 

వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా


టింగురమ్మ చక్కనమ్మ 

చెక్కిలెంత మక్కువో

చెంగు చెంగు లేది చూపు 

కళ్ళకెంత మక్కువో

దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా 

జారు కొప్పుల్లో చామంతి పెట్టనా

దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా 

జారు కొప్పుల్లో చామంతి పెట్టనా


- పాటల ధనుస్సు


18, ఆగస్టు 2026, మంగళవారం

ఓ ప్రియా చండీప్రియా | O Priya Chandipriya | Song Lyrics | Chandipriya (1980)

ఓ ప్రియా... చండీప్రియా 


చిత్రం: చండీప్రియ (1980)

సంగీతం: ఆదినారాయణరావు

గీతరచయిత: సి.నారాయణరెడ్డి

నేపధ్య గానం: ఎస్ పి బాలు, పి.సుశీల


పల్లవి :


ఓ ప్రియా... ప్రియా

చండీప్రియా... ప్రియా

తొలి గిలిగింతలు కలిగించిందా

నా ప్రేమలేఖా.. 

నడిచే చంద్రరేఖ


ఓ ప్రియా... ప్రియా

చండీప్రియా... ప్రియా

తొలి గిలిగింతలు కలిగించింది 

నీ ప్రేమలేఖా.. 

నీదే ఈ చంద్రలేఖ


చరణం 1 :


మనసులో... ప్రతి మలుపులో.. 

నిను మలుచుకున్నానులే

కలలో... మధువనులలో.. 

నీ పిలుపు విన్నానులే

మనసులో... ప్రతి మలుపులో.. 

నిను మలుచుకున్నానులే

కలలో... మధువనులలో.. 

నీ పిలుపు విన్నానులే


ఆ.. చెలియ రూపాల 

చేరుకున్నావా... 

పలికే రాగలేఖ..

కలా?.... నిజం..

నిజం?... మ్మ్..


ఓ ప్రియా... ప్రియా

చండీప్రియా... ప్రియా

తొలి గిలిగింతలు కలిగించింది 

నీ ప్రేమలేఖా.. 

నీదే ఈ చంద్రలేఖ


చరణం 2 :


ఎవ్వతే నీ ఎవ్వాతే 

కలిగించుతావు వగలు

ఏమీటే కథ ఏమిటే .. 

కుర్పించుతావు సెగలు


ఆశను ..జీవితాశను.. 

నే చెదిరితే విషాదం

చండిని .. అపర చండిని 

నను కదిపితే ప్రమాదం


నీవు నా కైపు.. తాను నా వైపు...  

అయ్యో ఏమి రాత..

అటా?... ఇటూ...

ఏటు?... ఇటూ ..


ఓ ప్రియా... ప్రియా

చండీప్రియా... ప్రియా

తొలి గిలిగింతలు కలిగించిందా

నా ప్రేమలేఖా.. 

నడిచే చంద్రరేఖ


తొలి గిలిగింతలు కలిగించింది 

నీ ప్రేమలేఖా.. 

నీదే ఈ చంద్రలేఖ


- పాటల ధనుస్సు


18, జులై 2026, శనివారం

ఐతే అది నిజమైతే అదే నిజమైతే | Aithe Ade Nijamaithe | Song Lyrics | Shubhalekha (1982)

ఐతే..అది నిజమైతే అదే నిజమైతే 


చిత్రం :  శుభలేఖ (1982)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : ఎస్ పి బాలు, పి.సుశీల 


పల్లవి :


ఐతే..అది నిజమైతే..

అదే నిజమైతే

ల ల ల ల ల..

ఐతే.. అది నిజమైతే..

అదే నిజమైతే


ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే

అది పువ్వుల నవ్వుల 

పున్నమి వెన్నెల గూడైతే

ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే

అది పువ్వుల నవ్వుల 

పున్నమి వెన్నెల గూడైతే


ఐతే.. అది నిజమైతే.. 

అదే నిజమైతే 


చరణం 1 :


నింగిలోని చంద్రుడికి.. 

నీటిలోని కలువకి

దూరభారమెంతైనా 

రాయబారి నేనున్నా

ఆ..ఆ.... ఆ..ఆ


నింగిలోని చంద్రుడికి..

నీటిలోని కలువకి

దూరభారమెంతైనా 

రాయబారి నేనున్నా


చందమామ అవునంటే 

వెన్నెలగా

కలువ భామ అది వింతే 

పున్నమిగా

ఆ..... ఆ....ఉ.. ఉ....

చందమామ అవునంటే 

వెన్నెలగా

కలువ భామ అది వింటే 

పున్నమిగా


నా ఆశలు ఎగసి ఎగసి 

తారలతో కలిసి

తలంబ్రాలుగా కురిసే వేళా.. 

చేరువైతే


ఐతే..అది నిజమైతే.. 

అదే నిజమైతే

ల ల ల ల ల..

ఐతే.. అది నిజమైతే.. 

అదే నిజమైతే 


చరణం 2 :


ల ల ల ల ల..

రెమ్మ చాటు రాచిలక.. 

కొమ్మ దాటి గోరింక

చూపులతోనే రాయని 

శుభలేఖలు రాస్తుంటే

రెమ్మ చాటు రాచిలక.. 

కొమ్మ దాటి గోరింక

చూపులతోనే రాయని 

శుభలేఖలు రాస్తుంటే...


ఆకసాన అరుధంతీ నక్షత్రం

తెలిపిందీ ఇదేననీ 

సుముహూర్తం

ఆ...... ఆ.....ఉ.. ఉ.... 

ఆకసాన అరుధంతీ నక్షత్రం

తెలిపిందీ ఇదేననీ 

సుముహూర్తం 


మనసిచ్చిన మలిసంధ్యలు 

కుంకుమలై కురిసీ

నుదుట తిలకమై మెరిసే వేళా.. 

చేరువైతే


ఐతే.. అది నిజమైతే.. 

అదే నిజమైతే

ల ల ల ల ల

ఐతే... అది నిజమైతే.. 

అదే నిజమైతే

ల ల ల ల ల


- పాటల ధనుస్సు 


19, జూన్ 2026, శుక్రవారం

చెంపకు చారెడు కళ్ళమ్మా | Chempaku Charadu Kallamma | Song Lyrics | Agni Gundam (1984)

చెంపకు చారెడు కళ్ళమ్మా 


చిత్రం: అగ్నిగుండం (1984)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: ఎస్ పి బాలు, పి.సుశీల  


పల్లవి : 


చెంపకు చారెడు కళ్ళమ్మా..

ఓ..ఓ..ఓ..హోయ్..హోయ్

చెంగుకు చాలని ఒళ్లమ్మా..

ఓ..ఓ..ఓ..హోయ్..హోయ్


ఒంపులసొంపుల వయ్యారమ్మా... 

చంపుకు తినకే బుల్లమ్మ

నిను చూడగనే మతిపోయిందే... 

కనుగీటగనే కసి పెరిగిందే పొల్లోయ్..


చెంతకు చేరకు బావయ్యో...

ఓ..ఓ..ఓ.. హోయ్..హోయ్..

చెంగులు చాలవు లేవయ్యో..

ఓ..ఓ..ఓ.. హోయ్..హోయ్..


చీకటి చాటున సింగారయ్యో.. 

సిగ్గులు దోచుకుపోకయ్యో...

తడిపొద్దులలో ఒడి చేరగనే 

పొడి కోరికలే సుడి రేగెనులేవయ్యో... 


చరణం 1 :


కన్నూ సోకిన్నాడే కట్టూ తప్పింది...

చెయ్యి తాకిన్నాడే చెంగూ జారింది...

ముట్టుకుంటే కట్టుబొట్టూ ఏమౌతాదో?


పక్కకొచ్చిన్నాడే పట్టూ తప్పింది...

గూడు దాచిన్నాడే గుట్టూ చెదిరింది...

ఒళ్లో కొస్తే ఒళ్లు కాస్తా ఏమౌతాదో?


జత కూడగనే జతులాడుకునే...

చలి వేడుకలో తొలి కోరికలే చాలే


చెంపకు చారెడు కళ్ళమ్మా..

ఓ..ఓ..ఓ.. హోయ్..హోయ్..

చెంతకు చేరకు బావయ్యో...

ఓ..ఓ..ఓ.. హోయ్..హోయ్..


చరణం 2 :


ఈడూ వచ్చిన్నాడే ముద్దూ కోరింది...

ఇద్దరయ్యిన్నాడే పొద్దూ జారింది...

మూడూ ముళ్ళూ వేసే లోగా ఏమౌతాదో?


మీసమొచ్చిన్నాడే ఆశ పుట్టింది...

నిన్ను చూసిన్నాడే అగ్గి పుట్టింది...

కల్లోకొచ్చి కౌగిళ్లిస్తే ఎట్టుంటాదో?


పొగమంచులలో పొగరందకురో..

సొగసంచులలో వగలందుకు పోరాదా...


చెంపకు చారెడు కళ్ళమ్మా..

చెంగుకు చాలని ఒళ్లమ్మా..

ఓ..ఓ..ఓ..హోయ్..హోయ్


ఒంపులసొంపుల వయ్యారమ్మా... 

చంపుకు తినకే బుల్లమ్మ

నిను చూడగనే మతిపోయిందే... 

కనుగీటగనే కసి పెరిగిందే పొల్లోయ్..


చెంతకు చేరకు బావయ్యో...

ఓ..ఓ..ఓ.. హోయ్..హోయ్..

చెంగులు చాలవు లేవయ్యో..


చీకటి చాటున సింగారయ్యో.. 

సిగ్గులు దోచుకుపోకయ్యో...

తడిపొద్దులలో ఒడి చేరగనే 

పొడి కోరికలే సుడి రేగెనులేవయ్యో...


- పాటల ధనుస్సు 


6, జూన్ 2026, శనివారం

కలలో పెట్టని ముద్దులు | Kalalo Pettani Muddulu | Song Lyrics | Attaku Yamudu Ammayiki Mogudu (1989)

కలలో పెట్టని ముద్దులు 


చిత్రం : అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : ఎస్ పి బాలు,  ఎస్ జానకి 


సాకీ :


పైట జారే పడుచు రాగాలలోనా

పాటలొచ్చే చిలిపి భావాలలో...


పల్లవి :


కలలో పెట్టని ముద్దులు పెట్టు

కరిచే గాలికి కౌగిలి పట్టు


కసిగా కలవకపోతే ఒట్టు

కంచెలు దాటిన ప్రేమను తిట్టు


నీలో ఎదిగే అందం ఎదలో 

బంధం ఎలా వర్ణించను


కలలో పెట్టని ముద్దులు పెట్టు

కరిచే గాలికి కౌగిలి పట్టు


కసిగా కలవకపోతే ఒట్టు

కంచెలు దాటిన ప్రేమను తిట్టు


నీలో ఎదిగే అందం ఎదలో 

బంధం ఎలా వర్ణించను


చరణం 1 :


సందిట్లో పడి కాగే 

కాముడు గోల పెట్టగా

పూలే ఈల కొట్టగా 

కన్నెపిట్టకే కన్ను కొట్టుకోనా


ఓ..ఓ.. అందిట్లో పడి వెన్నెట్లో 

పడుచందమిచ్చుకోనా

ముచ్చట్లో ముడి ముద్దుల్లో 

తడి మేను దాచుకోనా


మంచుల్లో ఊరేసాను మల్లెపూలు

మంచంలో ఆరేస్తాను కన్నె పూలు

కొంగుల్లో దాచుంచాను కొత్త పూలు

కొత్తల్లో మొగ్గేసేవే సిగ్గు పూలు


కలలో పెట్టని ముద్దులు పెట్టు

కరిచే గాలికి కౌగిలి పట్టు


కసిగా కలవకపోతే ఒట్టు

కంచెలు దాటిన ప్రేమను తిట్టు

నీలో ఎదిగే అందం ఎదలో 

బంధం ఎలా వర్ణించను


చరణం 2 :


ఊపుల్లో పడి రేగే 

సొంపులు ఊగుతున్నవి

నాలో ఆగకున్నవి 

జాజి తీగెలా నిన్ను అల్లుకోనా


ఓ..ఓ..ఓ.. చూపుల్లో సడి చేతల్లో 

పడి తప్పు చేసుకోనా

రాజీలే పడి సాగే దోపిడి 

నేను ఒప్పుకోనా


తాళాలే దాటించాలి తందనాలు

ఓ.. తాపాలే తగ్గించాలి చందనాలు

ఇంతట్లో రగిలాయంటే ఇంధనాలు

వాటేసి చేసేస్తాలే వందనాలు 


కలలో పెట్టని ముద్దులు పెట్టు

కరిచే గాలికి కౌగిలి పట్టు


కసిగా కలవకపోతే ఒట్టు

కంచెలు దాటిన ప్రేమను తిట్టు

నీలో ఎదిగే అందం ఎదలో 

బంధం ఎలా వర్ణించను


కలలో పెట్టని ముద్దులు పెట్టు

కరిచే గాలికి కౌగిలి పట్టు


కసిగా కలవకపోతే ఒట్టు

కంచెలు దాటిన ప్రేమను తిట్టు

నీలో ఎదిగే అందం ఎదలో 

బంధం ఎలా వర్ణించను


- పాటల ధనుస్సు 


5, జూన్ 2026, శుక్రవారం

మెరుపులా ఆడతా | Merupula Adatha | Song Lyrics | Attaku Yamudu Ammayiki Mogudu (1989)

మెరుపులా ఆడతా 


చిత్రం : అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : భువనచంద్ర

నేపధ్య గానం : ఎస్ పి బాలు,


పల్లవి :


మెరుపులా.. లా.. లా...  

ఆడతా.. తా.. తా

పిడుగులా .. లా.. లా... 

రేగుతా.. తా.. తా


దమ్ముంటే కాస్కో..

చాలెంజి చేస్కో

డిస్కో డాన్సు ఫైటు 

మిక్స్ చేసి చూపిస్తా రా


చరణం 1 :


డబ్బుకి లేదే సిగ్గు 

ఎగ్గు న్యాయం

అదుంటే నీ కళ్ళే 

నీ నెత్తికెక్కడం ఖాయం


ఒప్పు చేసినా 

తప్పులెన్నితే లోకం

ఫటా ఫట్ నట్టు బిగించి 

చెప్పేస్తా గుణపాఠం


ప్యారే తెలుసుకో 

దారి మలుచుకో

హద్దు మీరకు 

ఆటలాడకు జా జా


మెరుపులా.. లా.. లా...  

ఆడతా.. తా.. తా

పిడుగులా .. లా.. లా... 

రేగుతా.. తా.. తా


దమ్ముంటే కాస్కో..

చాలెంజి చేస్కో

డిస్కో డాన్సు ఫైటు 

మిక్స్ చేసి చూపిస్తా రా


చరణం 2 :


సలాము చేస్తే 

గులాము నేనై ఉంటా

ఖలేజా ఖరీదు కట్టే 

షరాబు నేనేనంట


రెచ్చగొట్టితే 

రచ్చకీడ్చి కవ్విస్తా

ఓరబ్బా హోలు సేలుగా 

గోలుమాలు చేయిస్తా


దేఖో మెహబూబా...  

పోటీ తగదిక

కాలు కదిపితే కాటు 

తప్పదిక సోజా


మెరుపులా.. లా.. లా...  

ఆడతా.. తా.. తా

పిడుగులా .. లా.. లా... 

రేగుతా.. తా.. తా


దమ్ముంటే కాస్కో..

చాలెంజి చేస్కో

డిస్కో డాన్సు ఫైటు 

మిక్స్ చేసి చూపిస్తా రా


- పాటల ధనుస్సు 



పాటల ధనుస్సు పాపులర్ పాట

కళ్ళతో కాటేసి | Kallatho Katesi | Song Lyrics | Kanna Koduku (1973)

కళ్ళతో కాటేసి  చిత్రం : కన్నకొడుకు (1973) సంగీతం : టి. చలపతిరావు గీతరచయిత : దాశరథి నేపథ్య గానం : ఘంటసాల, పి. సుశీల పల్లవి : కళ్ళతో కాటేసి......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు