RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
jayaprada songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
jayaprada songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఆగస్టు 2026, బుధవారం

ఏలెలో ఏలెలో ఏలేలో హైలెస్సా | Elelo Elelo Elelo | Song Lyrics | Chandipriya (1980)

ఏలెలో  ఏలెలో  ఏలేలో హైలెస్సా 


చిత్రం: చండీప్రియ (1980)

సంగీతం: పి.ఆదినారాయణరావు

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం: పి.సుశీల 


పల్లవి : 


ఏలెలో  ఏలెలో  ఏలేలో హైలెస్సా

ఏలెలో  ఏలెలో  ఏలేలో హైలెస్సా


ఆ మల్లెలో మారాజా - 

ఎన్నెల్లో రేరాజా

రార మా రాజా మా మోజు 

తీరగ రారా


ఏలెలో ఏలో ఏలో వలపులు

ఏవేవో నీలో నాలో పిలుపులు

నవ్వే నా అందం 

నువ్వే నా బంధం

కరిగిపోరా కౌగిలిలో


చరణం 1 :


మనసే రేగి వయసే ఊగి 

పిలిచే పాటలో

శృతినే మించి లయనే పెంచి 

అడే ఆటలో

అందమే నాది, అనుభవం నీది

రసజగం, చెరిసగం 

ఏలుకుందాము ఎన్నెల్లో


చరణం 2 :


ఈ మోహలు రసదాహాలు 

కలిసే వేళలో

మన దేహాలు సందేహాలు 

పలికే వేళలో

పెదవులే నావి మధువులేనీవి

ఇద్దరం ఒక్కరై కలిసి 

సోదాముకాలంలో


- పాటల ధనుస్సు


మసక పడితే నిదరపట్టదు | Masakapadithe Nidura pattadu | Song Lyrics | Chandipriya (1980)

మసక పడితే నిదరపట్టదు 


చిత్రం: చండీప్రియ (1980)

సంగీతం: పి.ఆదినారాయణరావు

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం:  యస్.పి.బాలు, పి.సుశీల,


పల్లవి :


మసక పడితే నిదరపట్టదు

నిదర పడితే పక్క కుదరదు

పక్క కుదిరితే కాకతగ్గదు

ఎన్నెట్లో ఎండేసిపో - లేదంటే

నట్టింట్లో నువ్వుండిపో


మసక పడితే నిదరపట్టదు

నిదర పడితే పక్క కదరదు

పక్క కుదిరితే కాకతగ్గదు

కౌగిట్లో నన్నుంచుకో కాదంటే

నట్టేట్లో నను ముంచిపో


చరణం 1 :


ఏరల్లే వచ్ఛింది ఈడు

అది ఎల్లువైతే ఎవరు తోడు

మనసులోతు తెలుసుకోరా

వడ్డునీవై వరుసుకోరా

నింగి వొంగి నేల పొంగి

ముద్దులాడే పొద్ధుకాడ

జాబిల్లితో వచ్ఛిపో

తొలిరేయి జామల్లే గుర్తుండిపో


చరణం 2 :


తెలిమంచు వానల్లే నువ్వూ

చలిమంట లవ్వల్లే నవ్వూ

పురులువిప్పి పులకరించి

మరులు నాలో చిలకరించు

కడలివంక వాగువంక 

పరుగు తీసే పదునుమీద

సూరీడుతో వచ్ఛిపో 

మరుపొద్ధు రావద్దని చెప్పిపో


- పాటల ధనుస్సు


ఏ వేళనైన ఒకే కోరికా | Evelanaina Oke Korika | Song Lyrics | Chandipriya (1980)

ఏ వేళనైన ఒకే కోరికా 


చిత్రం : చండీప్రియ (1980)

సంగీతం : ఆదినారాయణరావు

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : ఎస్ పి బాలు, పి.సుశీల


పల్లవి :


ఏ వేళనైన ఒకే కోరికా... 

ఏ పూవులైనా ఒకే మాలిక

ఇలాగే పాడాలి... కలకాలం

ఇలాగే పాడాలి... కలకాలం


ఏ వేళనైన ఒకే కోరికా... 

ఏ పూవులైనా ఒకే మాలిక

యూ హీ హమ్ గాయేంగే 

జనమ్ జనమ్

యూ హీ హమ్ గాయేంగే 

జనమ్ జనమ్


చరణం 1 :


అరవిరిసే కనులే...  కమలాలు

ముసురుకునే కురులే... 

భ్రమరాలు



మిల్ కర్ సనమ్ హర్ కదమ్ 

హమ్ చలేంగే

మిల్ కర్ సనమ్ హర్ కదమ్ 

హమ్ చలేంగే

దిగిరావా నీలాల గగనాలు...


ఏ వేళనైన ఒకే కోరికా... 

ఏ పూవులైన ఒకే మాలిక

యూ హీ హమ్ గాయేంగే 

జనమ్ జనమ్

యూ హీ హమ్ గాయేంగే 

జనమ్ జనమ్


చరణం 2 :


కెహెతా హై ప్యాసా మన్ 

మేరే సాజన్

ఖిల్తా రహే అబ్ మై 

ఆజ్ సావన్


మెరిసే నీ నవ్వులే జల్లులైతే

మెరిసే నీ నవ్వులే జల్లులైతే

పరువాలే శ్రావణ మేఘాలు


ఏ వేళనైన... ఒకే కోరికా...

ఏ పూవులైన...  ఒకే మాలిక


యూ హీ హమ్ గాయేంగే 

జనమ్ జనమ్

యూ హీ హమ్ గాయేంగే 

జనమ్ జనమ్


- పాటల ధనుస్సు


18, ఆగస్టు 2026, మంగళవారం

జననీ జననీ జననీ | Janani Janani Janani | Song Lyrics | Chandipriya (1980)

జననీ జననీ జననీ 


చిత్రం: చండీప్రియ (1980)

సంగీతం: పి.ఆదినారాయణరావు

సాహిత్యం: దేవులల్లి కృష్ణశాస్త్రి 

గానం: పి.సుశీల 


సాకి :


శ్రీ బాగ్యరేఖామ్ - ఉపపాదయన్తి

శివంకరీమ్ - సింధుర మందయానామ్

శీతాంశుబింబ ప్రతిమాన వక్రామ్

శీతాద్రి పుత్రీమ్ శిరసా నమామి


పల్లవి : 


జననీ జననీ జననీ 

నవ లావణ్య వాహిని మోహిని


శరణం నీ శరణం

శ్రీకరి భవహరి గౌరీ శంకరి 


చరణముకడవాలని 

శిరమిడి పూజించని


జననీ జననీ జననీ

నవ లావణ్య వాహిని మోహిని


చరణం 1 :


నటియించే నీ కాలి యందియల

గంటల గలగలలేవి దేవి

చెలియించే నీకేలి కంకణపు

మువ్వల సవ్వడలేవీ దేవి

ఊగి తూగు సిగ పాయలలో

తురిమిన తారకలేవి దేవి

ఆ సుందర సుందర రూపం

ఈ చండీప్రియ హృదయ దీపం

సుమమృదు హాసిని 

సుమధుర భాషిణి

సువర్ణ పీఠా ధ్యాసిని 


చరణం 2 :


మెడలో కదిలే సర్పహారములు

పొగడ సరాలుగ మార్చిన దేవి

జ్వలియించే నీ పాల నేత్రమును

అరుణ తిలకముగా మార్చిన దేవి

ఎంత చల్లని తల్లివో గాని

వింతలు వింతలు నీ చేతలు

ఆ మధుర మధుర దరహాసం

ఆ మంజుల నాట్య విలాసం

సుమమృదు హాసిని 

సుమధుర భాషిణి

సువర్ణ పీఠా ధ్యాసిని


- పాటల ధనుస్సు


ఓ ప్రియా చండీప్రియా | O Priya Chandipriya | Song Lyrics | Chandipriya (1980)

ఓ ప్రియా... చండీప్రియా 


చిత్రం: చండీప్రియ (1980)

సంగీతం: ఆదినారాయణరావు

గీతరచయిత: సి.నారాయణరెడ్డి

నేపధ్య గానం: ఎస్ పి బాలు, పి.సుశీల


పల్లవి :


ఓ ప్రియా... ప్రియా

చండీప్రియా... ప్రియా

తొలి గిలిగింతలు కలిగించిందా

నా ప్రేమలేఖా.. 

నడిచే చంద్రరేఖ


ఓ ప్రియా... ప్రియా

చండీప్రియా... ప్రియా

తొలి గిలిగింతలు కలిగించింది 

నీ ప్రేమలేఖా.. 

నీదే ఈ చంద్రలేఖ


చరణం 1 :


మనసులో... ప్రతి మలుపులో.. 

నిను మలుచుకున్నానులే

కలలో... మధువనులలో.. 

నీ పిలుపు విన్నానులే

మనసులో... ప్రతి మలుపులో.. 

నిను మలుచుకున్నానులే

కలలో... మధువనులలో.. 

నీ పిలుపు విన్నానులే


ఆ.. చెలియ రూపాల 

చేరుకున్నావా... 

పలికే రాగలేఖ..

కలా?.... నిజం..

నిజం?... మ్మ్..


ఓ ప్రియా... ప్రియా

చండీప్రియా... ప్రియా

తొలి గిలిగింతలు కలిగించింది 

నీ ప్రేమలేఖా.. 

నీదే ఈ చంద్రలేఖ


చరణం 2 :


ఎవ్వతే నీ ఎవ్వాతే 

కలిగించుతావు వగలు

ఏమీటే కథ ఏమిటే .. 

కుర్పించుతావు సెగలు


ఆశను ..జీవితాశను.. 

నే చెదిరితే విషాదం

చండిని .. అపర చండిని 

నను కదిపితే ప్రమాదం


నీవు నా కైపు.. తాను నా వైపు...  

అయ్యో ఏమి రాత..

అటా?... ఇటూ...

ఏటు?... ఇటూ ..


ఓ ప్రియా... ప్రియా

చండీప్రియా... ప్రియా

తొలి గిలిగింతలు కలిగించిందా

నా ప్రేమలేఖా.. 

నడిచే చంద్రరేఖ


తొలి గిలిగింతలు కలిగించింది 

నీ ప్రేమలేఖా.. 

నీదే ఈ చంద్రలేఖ


- పాటల ధనుస్సు


24, ఏప్రిల్ 2026, శుక్రవారం

అనురాగమే ఒక ఆలయం | Anuragame Oka Alayam | Song Lyrics | Devadasu Malli Puttadu (1978)

అనురాగమే ఒక ఆలయం 


చిత్రం : దేవదాసు మళ్ళీ పుట్టాడు  (1978)

సంగీతం : ఎస్ రాజేశ్వరరావు 

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : రామకృష్ణ, పి సుశీల 


పల్లవి : 


అనురాగమే ఒక ఆలయం.. 

అనురాగమే ఒక ఆలయం

ఆ భావనకే మన జీవనమే 

అంకితం..

అనురాగమే ఒక ఆలయం.. 

అనురాగమే ఒక ఆలయం

ఆ భావనకే మన జీవనమే 

అంకితం..

అనురాగమే ఒక ఆలయం.. 

అనురాగమే ఒక ఆలయం


చరణం 1:


ఓహోహో హోహోహో 

ఒఓఓ ఓఓఓ..ఓ..ఓఓఓ 

ఓహోహో హో

ఆహహా అఆఆ అఆఆ అఆఆ 

అఆఆ ఆ అఆఆ అఆఆ


వన్నెవన్నెల హరివిల్లైన

మరునిమిషంలో కరిగిపోవును

వన్నెవన్నెల..

హరివిల్లైనా

మరునిమిషంలో..

కరిగిపోవును


వేయి వెలుగుల సూర్యుడయినా..

వేయి వెలుగుల సూర్యుడయినా

రేయిమాటున మాసిపోవును

కరిగిపోనిది

చెరిగిపోనిది

అనురాగమే

అనురాగమే


అనురాగమే ఒక ఆలయం.. 

అనురాగమే ఒక ఆలయం


చరణం 2:


ఆహహా అఆఆ అఆ ఆ ఆహహా

ఓహోహో ఓహోహో 

ఒహోహోహో

అఅఆఆ హహహాహహాహా..

ఆఆఆ..ఆఆఆ..ఆఆఆ.. 


పరుగులు తీసే నీలీ మేఘం

కురిసేవరకే సాగిపోవును

పరుగులు తీసే..

నీలీ మేఘం

కురిసేవరకే..

సాగిపోవును

మిన్నులుతాకే కడలి కెరటం..

మిన్నులుతాకే కడలి కెరటం 

తీరంవరకే ఆగిపోను

ఆగిపోనిది

అవధి లేనిది


అనురాగమే

అనురాగమే


అనురాగమే ఒక ఆలయం.. 

అనురాగమే ఒక ఆలయం

ఆ భావనకే మన జీవనమే 

అంకితం

అనురాగమే ఒక ఆలయం.. 

అనురాగమే ఒక ఆలయం

ఆహహా అఆఆ అఆఆ అఆఆ 

అఆఆ ఆ అఆఆ అఆఆ

ఓహోహో హోహోహో 

ఒఓఓ ఓఓఓ..ఓ..ఓఓఓ 

ఓహోహో హో


- పాటల ధనుస్సు 



12, ఏప్రిల్ 2026, ఆదివారం

దాచుకోకు వలపు వాలు కన్నులా | Dachukoku Valapu | Song Lyrics | Tallikodukula Anubandham (1982)

దాచుకోకు వలపు వాలు కన్నులా


చిత్రం : తల్లీ కొడుకుల అనుబంధం (1982)

సంగీతం : సత్యం

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : ఎస్ పి బాలు, పి.సుశీల 


పల్లవి :


దాచుకోకు వలపు వాలు కన్నులా

దరహసించు దశమినాటి వెన్నెలా

మాపటింటి జాడలో... 

మల్లెపూల నీడలో

కరగాలి వన్నెలన్ని వెన్నలా


దోచుకోకు చిలిపి వాడి కన్నులా

పరిమళించు నవమి లేత వన్నెలా

నీలిమబ్బునీడలో వానవిల్లు మేడలో

అడగాలి ముద్దులన్ని నన్నిలా...


దాచుకోకు వలపు వాలు కన్నులా

పరిమళించు నవమి లేత వన్నెలా


చరణం 1 :


పున్నమంటి చిన్నదాని కౌగిట..

పూటకొక్క పులకరింత పుట్టదా


సన్నజాజి వన్నెకాడి సందిట

సందెగాలి సలపరింత పెట్టదా


పొంగుతున్న వయసులు... 

బెంగపడ్డ మనసులు

పెరగాలి పెళ్ళి ముందు ప్రేమలా


దోచుకోకు చిలిపి వాడి కన్నులా

దరహసించు దశమినాటి వెన్నెలా


చరణం 2 :


చినుకులాంటి చిన్నవాడి చూపులే...

వలపు తెలుపు మాట లేని పిలుపులు


మేని వంటి కన్నెపిల్ల మేనిలో...

తొంగి చూసే నింగిలోని మెరుపులు


పడుచు పడ్డ విరుపులు 

వయసు ఆట విడుపులు

కలవాలి ప్రేమ ఇంక పెళ్ళిగా... 

ఆ.. ఆ


దాచుకోకు వలపు వాలు కన్నులా

దరహసించు దశమినాటి వెన్నెలా


నీలిమబ్బునీడలో వానవిల్లు మేడలో

అడగాలి ముద్దులన్ని నన్నిలా...


- పాటల ధనుస్సు 


28, ఫిబ్రవరి 2026, శనివారం

ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది | Evariki Cheppedi | Song Lyrics | Eenati Bandham Enatido (1977)

ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది


చిత్రం: ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: ఎం. బాలయ్య

నేపధ్య గానం: సుశీల


పల్లవి:


ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?

నేనెవరికి చెప్పేది 

మనసిప్పేమని చెప్పేది

హోరున వీచే గాలికా.. 

చిరుగాలికా..

ఉరకలు వేసే నీటికా.. 

సెలయేటికా..

ఎవరికి చెప్పేది? 

ఏమని చెప్పేది?


చరణం 1:


నీటిలోని కలువను నేను.. 

నింగినేలే జాబిలి తాను

నీటిలోని కలువను నేను.. 

నింగినేలే జాబిలి తాను

నన్నే తలచి మదిలో వలచి

నన్నే తలచి మదిలో వలచి

దివి నుండి తానె దిగి రాగా 

ఆ ఆ ఆ...

కలవరపరచే కమ్మని తలపులు.. 

ఇవి.. ఇవి..

అని ఎవరికి చెప్పేది? 

ఏమని చెప్పేది?


చరణం 2:


మల్లె తీగలు పందిరి కోసం 

ఎదిగెదిగి ఎగబాకిన చందం

మల్లె తీగలు పందిరి కోసం 

ఎదిగెదిగి ఎగబాకిన చందం

పొందు కోరి పొంచిన పరువం

పొందు కోరి పొంచిన పరువం

నచ్చిన వానిని పెనేసుకోదా.. 

ఆ ఆ ఆ..

ఉప్పెనలా వచ్చే ఊహలు 

ఇవి.. ఇవి..


అని ఎవరికి చెప్పేది? 

ఏమని చెప్పేది?

నేనెవరికి చెప్పేది 

మనసిప్పేమని చెప్పేది

హోరున వీచే గాలికా 

చిరుగాలికా

ఉరకలు వేసే నీటికా 

సెలయేటికా..

లాల లలల లలాలల

లాల లలల లలాలల


- పాటల ధనుస్సు 


ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు | Evaru Nerperamma Eekommaku | Song Lyrics | Eenati Bandham Enatido (1977)

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు


చిత్రం: ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దేవులపల్లి

నేపథ్య గానం: సుశీల


పల్లవి:


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు ..

పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు .....

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు.. 

పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు...

ఎంత తొందరలే హరి పూజకు ...

ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ .....

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... 

పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు..


చరణం 1:


కొలువైతివా దేవి నాకోసము...

కొలువైతివా దేవి నాకోసము..

తులసీ ..... 

తులసీ దయాపూర్ణకలశీ...

కొలువైతివా దేవి నాకోసము..

తులసీ....తులసీ దయాపూర్ణకలశీ...

మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ..... 

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి .....

మొల్లలివి ...నన్నేలు నా స్వామికి...


ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... 

పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు

ఎంత తొందరలే హరి పూజకు... 

ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ ...


చరణం 2:


ఏ లీల సేవింతు.. 

ఏమనుచు కీర్తింతు...

ఏ లీల సేవింతు.. 

ఏమనుచు కీర్తింతు

సీత మనసే నీకు సింహాసనం...

ఒక పువ్వు పాదాల....

ఒక దివ్వె నీ మ్రోల....

ఒక పువ్వు పాదాల...

ఒక దివ్వె నీ మ్రోల

ఒదిగి నీ ఎదుట ఇదే వందనం .....

ఇదే వందనం .....


- పాటల ధనుస్సు 


27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

నేననుకున్నది కాదూ | Nenanukunnadi Kadu | Song Lyrics | Eenati Bandham Enatido (1977)

నేననుకున్నది కాదూ


చిత్రం: ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977) 

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 

గీతరచయిత: ఎం. బాలయ్య 

నేపధ్య గానం: బాలు, సుశీల 


సాకి : 


శిలనొక్క ప్రతిమగా...

మలచింది నీవే... 

ఆ ప్రతిమనీ.. దైవముగా...

కొలిచింది నీవే... 


పల్లవి: 


నేననుకున్నది కాదూ...

ఇది నేననుకున్నది కాదూ... 

కలనైనా తలచింది కానే కాదు...

ఏనాటిదో ఈ బంధం... 

ఈ వెన్నెల్లా.. జాబిల్లి అనుబంధం.... 


మదినొక్క గుడివోలే...

మలచింది నీవే... 

ఆ గుడిలోనే కరుణతో...

వెలసింది నీవే.... 


నేననుకున్నది కాదూ...

ఇది నేననుకున్నది కాదూ... 

కలనైనా తలచింది కానే కాదు...

ఏనాటిదో ఈ బంధం... 

ఈ వెన్నెల్లా... 

జాబిల్లి అనుబంధం.... 

నేననుకున్నది కాదూ...

ఇది నేననుకున్నది కాదూ... 


చరణం 1: 


నీ చెంతగ ఎన్నాళ్ళున్నా...

నిన్ను చేరుకోలేదు... 

ఎదుట ఉన్న పారిజాతం ..

ఎదను చేర్చుకోలేదు... 


అపరంజి కోవెల ఉన్నా..

అలరారు దైవం ఉన్నా... 

ఆ గుడితలుపులు 

ఈనాడే తెరచుకున్నాయి...

లోనికి పిలుచుకున్నాయి.... 


నేననుకున్నది కాదూ...

ఇది నేననుకున్నది కాదూ... 


చరణం 2: 


కడలి నిండ నీరున్నా..

కదలలేని నావను నేను.. 

అడగాలని మదిలో ఉన్నా.. 

పెదవి కదపలేకున్నాను.. 

నావకు తెరచాపనై...

నడిపే చిరుగాలినై... 

కలలో.. ఇలలో ..

నీ కోసం పలవరించేనూ...

నీలో కలిసిపోయేనూ... 


నేననుకున్నది కాదూ...

ఇది నేననుకున్నది కాదూ... 

కలనైనా తలచింది కానే కాదు...

ఏనాటిదో ఈ బంధం... 

ఈ వెన్నెల్లా జాబిల్లి 

అనుబంధం....ఉమ్మ్...ఉమ్మ్.. 

నేననుకున్నది కాదూ...

ఇది నేననుకున్నది కాదూ...


- పాటల ధనుస్సు 


23, ఫిబ్రవరి 2026, సోమవారం

ఒకటే కోరిక నిన్ను చేరాలనీ | Okate Korika Ninnu | Song Lyrics | Dongalaku Donga 91977)

ఒకటే కోరిక నిన్ను చేరాలనీ


చిత్రం: దొంగలకు దొంగ (1977) 

సంగీతం: సత్యం 

గీతరచయిత: మైలవరపు గోపి 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


ఒకటే కోరిక హా..నిన్ను చేరాలనీ 

హహా.. 

ఒడిలో కమ్మగా కరిగిపోవాలనీ 

హహా..కరిగిపోవాలనీ 


ఒకటే కోరిక హా..నిన్ను చేరాలనీ 

హాహా.. 

ఒడిలో కమ్మగా కరిగిపోవాలనీ 

హాహా..కరిగిపోవాలనీ హా..హా.. 


చరణం 1: 


నడకతో లేత నడుముతో 

చెలి మంత్రమే వేసెనూ 

కురులలో నీలి కనులలో 

నా హృదయమే చిక్కెనూ 

నీ చూపులే నను నిలువునా 

కౌగిలిస్తున్నవీ 

నా పెదవులే నీ నామము 

పలవరిస్తున్నవీ 

హే...కలలోను కనులందూ 

కదలక నిలిచెను నీ సొగసూ 


చరణం 2: 


చేతికి చేయి తగిలితే 

గుబులు పుడుతున్నదీ 

కొత్తగా నా వయసుకు 

దిగులు వేస్తున్నదీ 

చెక్కిట ఆ నొక్కులు 

ఆశ పడుతున్నవీ 

ఆ ఒంపులు మేని బరువులు 

నను నిలువనీకున్నవి 

హా..హహహా... 

అణువణువు ప్రతి నిమిషం 

తొందర చేసెను నీకోసం 


ఒకటే కోరిక హా..నిన్ను చేరాలనీ


- పాటల ధనుస్సు 

29, డిసెంబర్ 2025, సోమవారం

కోకంతా గొడవాయే రైకంతా బిగువాయే | Kokantha Godavaye | Song Lyrics | Prajarajyam (1983)

కోకంతా గొడవాయే రైకంతా బిగువాయే 


చిత్రం : ప్రజారాజ్యం (1983)

సంగీతం :  జె.వి. రాఘవులు

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి : 


అమ్మాయీ... అమ్మాయీ

అమ్మాయీ... అమ్మాయీ


కోకంతా గొడవాయే.. 

రైకంతా బిగువాయే.. 

ఏమొచ్చెనే అమ్మడూ

ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొల్లంతా...  

ఈడొచ్చెరో పిల్లడూ 


కోకంతా గొడవాయే.. 

రైకంతా బిగువాయే.. 

ఏమొచ్చెనే అమ్మడూ

ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొల్లంతా...  

ఈడొచ్చెరో పిల్లడూ


హహా... హహా... హహా...


చరణం 1 : 


కులుకమ్మా నడుమంతా 

గుపెట్లోనే దాచా

గుపెట్లో గిలిగింతా కౌగిట్లోనే చూశా


కులుకమ్మా నడుమంతా 

గుపెట్లోనే దాచా

గుపెట్లో గిలిగింతా కౌగిట్లోనే చూశా


అందంలో సంగీతం... 

సందిట్లో సావాసం

అహా.. అహా... అహా.. 


కోకంతా గొడవాయే.. 

రైకంతా బిగువాయే.. 

ఏమొచ్చెనే అమ్మడూ..హహా..

ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొల్లంతా...  

ఈడొచ్చెరో పిల్లడూ

హహా... హహా... హహా...


చరణం 2 :


కవ్వించే అందాలే కళ్ళల్లో ఆరేశా

కౌగిళ్ళా హద్దుల్లో ఇల్లేన్నో కట్టేశా


కవ్వించే అందాలే కళ్ళల్లో ఆరేశా

కౌగిళ్ళా హద్దుల్లో ఇల్లేన్నో కట్టేశా


ఒళ్ళంతా వయ్యారం... 

వందిళ్ళా సంసారం

అహా.. ఒహో.. అహా


కోకంతా గొడవాయే.. 

రైకంతా బిగువాయే.. 

ఏమొచ్చెనే అమ్మడూ..

ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొల్లంతా... 

ఈడొచ్చెరో పిల్లడూ


హహా... హహా... హహా...


చరణం 3 :


చేపంటి ఆ కళ్ళు... 

చెప్పేవే ఆకళ్ళు

ఎదురైతే ఉవ్విళ్ళు... 

ఎదకొచ్చే ఎక్కిళ్ళు  


చేపంటి ఆ కళ్ళు... 

చెప్పేవే ఆకళ్ళు

ఎదురైతే ఉవ్విళ్ళు... 

ఎదకొచ్చే ఎక్కిళ్ళు


నీ ముద్దే మందారం... 

ముదిరిందీ యవ్వారం

అహా..ఒహో.. అహా...


కోకంతా గొడవాయే.. 

రైకంతా బిగువాయే.. 

ఏమొచ్చెనే అమ్మడూ..హహా..

ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొల్లంతా...  

ఈడొచ్చెరో పిల్లడూ


హహా... హహా... హహా...


- పాటల ధనుస్సు 


14, జూన్ 2025, శనివారం

గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే | Godariki Ye oddaina | Song Lyrics | Mana Oori Katha (1976)

గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే



చిత్రం :  మన ఊరి కథ (1976)

సంగీతం :  జె.వి. రాఘవులు

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే

గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే

కుర్రదానికి ఏ వైఫైనా...  అందమొక్కటే

గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే


కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే

కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే

ఈ కుర్రడికి ఏ పొద్ధూ కోరికోక్కటే

గోదారికి ఏ ఒడ్డైనా....  నీరు ఒక్కటే  


చరణం 1 :


పడవెంత చిన్నదైనా గెడవేసి నడపాలి.. 

పడుచెంత సొ౦తమైనా ముడివేసి అడగాలి

పడవెంత చిన్నదైనా గెడవేసి నడపాలి.. 

పడుచెంత సొ౦తమైనా ముడివేసి అడగాలి


గాలి చూసి వాలు చూసి తెరచాప ఎత్తాలి

గాలి చూసి వాలు చూసి తెరచాప ఎత్తాలి

ఎంత వీలైన వేళైనా తెరచాటు ఉండాలీ


గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే


చరణం 2 :


పోటోచ్చిన ఏటికి ఎత్తుపల్ల మొక్కటే

పొంగోచ్చిన వయసుకు పగలు రేయి ఒక్కటే


పగలు రేయి కలుసుకునే హద్దు ఒక్కటే

పలుకరాని పెదవులకి ముద్దు ఒక్కటే 


గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే

కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే

కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే

ఈ కుర్రడికి ఏ పొద్ధూ...  కోరికోక్కటే


గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు