RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, జూన్ 2025, శనివారం

గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే | Godariki Ye oddaina | Song Lyrics | Mana Oori Katha (1976)

గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే



చిత్రం :  మన ఊరి కథ (1976)

సంగీతం :  జె.వి. రాఘవులు

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే

గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే

కుర్రదానికి ఏ వైఫైనా...  అందమొక్కటే

గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే


కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే

కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే

ఈ కుర్రడికి ఏ పొద్ధూ కోరికోక్కటే

గోదారికి ఏ ఒడ్డైనా....  నీరు ఒక్కటే  


చరణం 1 :


పడవెంత చిన్నదైనా గెడవేసి నడపాలి.. 

పడుచెంత సొ౦తమైనా ముడివేసి అడగాలి

పడవెంత చిన్నదైనా గెడవేసి నడపాలి.. 

పడుచెంత సొ౦తమైనా ముడివేసి అడగాలి


గాలి చూసి వాలు చూసి తెరచాప ఎత్తాలి

గాలి చూసి వాలు చూసి తెరచాప ఎత్తాలి

ఎంత వీలైన వేళైనా తెరచాటు ఉండాలీ


గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే


చరణం 2 :


పోటోచ్చిన ఏటికి ఎత్తుపల్ల మొక్కటే

పొంగోచ్చిన వయసుకు పగలు రేయి ఒక్కటే


పగలు రేయి కలుసుకునే హద్దు ఒక్కటే

పలుకరాని పెదవులకి ముద్దు ఒక్కటే 


గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే

కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే

కొంగులు రెండూ వేరైనా...  కోక ఒక్కటే

ఈ కుర్రడికి ఏ పొద్ధూ...  కోరికోక్కటే


గోదారికి ఏ ఒడ్డైనా...  నీరు ఒక్కటే


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు