ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలందెలు మ్రోయ
చిత్రం : జనని జన్మభూమి (1984)
సంగీతం : కె వి మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, ఎస్ జానకి
పల్లవి:
ఘల్లు ఘల్లున కాళ్ళ
గజ్జెలందెలు మ్రోయ
కలహంసల నడకల కలికీ..ఈ..ఈ
ఎక్కడికే..ఏ..ఏ
జటలోన గంగను ధరియించి ఉన్నట్టి
జగమూ..లేలే సాంబ శివునీ..ఈ..ఈ..
సన్నిధికే..ఏ..ఏ..ఏ
కలికీ ఎక్కడికే..
శివునీ..ఈ..ఈ సన్నిధికే..ఏ..ఏ..ఏ..
చరణం 1:
కంటి చూపు చెలుములంట..
కాలు పెడితే కలుములంట..
చీరపెడితేనేమో..సిగ్గులంట..హ..హ
చీర కడితే చాలునంట..
సిరులంటా మా యింట
చిగురాకు పాదాల కలికీ..ఈ..ఈ..
ఎక్కడికే..
ఆ..యింట..నూరేళ్ళ పేరంట మాడంగా..
శ్రీశైలవాస
నీ చరణా..ఆ..ఆ సన్నిధికే....ఏ..ఏ
కలికీ..ఈ..ఎక్కడికే..
సాంబ శివునీ సన్నిధికే..ఏ..ఏ..ఏ..
చరణం 2:
వీనుల నీ పదములంట..
నేను నీ శ్రీపదములంట..
బ్రతుకు నిండా నీ పసుపు
కుంకుమేనంట..మూ..ఊ..ఊ
నీవి కాటుక కన్నులంట..
తేలిపొయే కలల వెంట..
శ్రీశైలావాసా నీ శరణా ఆ ఆ
సన్నిధికే..ఏ..ఏ..
శృంగారా మంధార మకరంద
మానంద భ్రమరాంభిక దేవి
పాదా..ఆ..ఆ..ఆ.. సన్నిధికే..ఏ..ఏ..ఏ
ఘల్లు ఘల్లున కాళ్ళ
గజ్జెలందెలు మ్రోయ
కలహంసల నడకల కలకీ..
మూ..హు..హూ..హు..హూ
నీ చరణా...ఆ..ఆ..ఆ సన్నిధికే..ఏ..ఏ..ఏ
కలికీ..ఈ..ఈ..ఈ..ఈ ఎక్కడికే..
నీ చరణ సన్నిధికే..ఏ..ఏ..ఏ
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి