RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, జూన్ 2025, మంగళవారం

తొలి వలపే తియ్యనిదీ | Tolivalape Tiyyanidi | Song Lyrics | Needaleni Adadi (1974)

తొలి వలపే తియ్యనిదీ



చిత్రం: నీడలేని ఆడది (1974)

సంగీతం: సత్యం

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


తొలి వలపే..తొలి వలపే

తియ్యనిదీ ...తియ్యనిదీ


మదిలో ఎన్నడు మాయనిది

తొలి వలపే... తియ్యనిదీ...

మదిలో... ఎన్నడు మాయనిది

నీ కొరకే దాచినదీ...

వేరెవరూ దోచనిదీ

తొలి వలపే... తియ్యనిదీ

మదిలో... ఎన్నడు మాయనిది


చరణం 1:


పొగరు సొగసు గల చిన్నది...

బిగి కౌగిలిలో ఒదిగున్నది...

పొగరు...సొగసు గల చిన్నది...

బిగి కౌగిలిలో ఒదిగున్నది..

ఈ విసురూ ఎక్కడిది...

నీ జతలోనే నేర్చినది


తొలివలపే తియ్యనిదీ...

మదిలో ఎన్నడు మాయనిది


చరణం 2:


కనులూ కలలూ కలబోయని...

నీలో సగమై పెనవేయనీ

కనులూ కలలూ కలబోయనీ...

నీలో సగమై పెనవేయనీ

కలకాలం ఈ ప్రణయం...

నిలవాలి మనకోసం


తొలి వలపే తియ్యనిదీ...

మదిలో ఎన్నడు మాయనిది..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు