RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

15, అక్టోబర్ 2023, ఆదివారం

మహాకనకదుర్గా విజయకనకదుర్గా | Maha Kanaka Durga | Song Lyrics | Devullu (2000)

మహాకనకదుర్గా విజయకనకదుర్గా



చిత్రం: దేవుళ్ళు (2000)

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

గీతరచయిత: జొన్నవిత్తుల

నేపధ్య గానం: జానకి


పల్లవి:


మహాకనకదుర్గా విజయకనకదుర్గా

పరాశక్తి లలితా శివానంద చరిత

మహాకనకదుర్గా విజయకనకదుర్గా

పరాశక్తి లలితా శివానంద చరిత


శివంకరి శుభంకరి 

పూర్ణచంద్ర కళాధరి

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల 

సృష్టించిన మూలశక్తి

అష్టాదశ పీఠాలను 

అధిష్టించు ఆదిశక్తి


మహాకనకదుర్గా విజయకనకదుర్గా

పరాశక్తి లలితా శివానంద చరిత


చరణం 1:


ఓంకార రావాల 

అలల కృష్ణాతీరంలో

ఇంద్రకీల గిరిపైన 

వెలసెను కృతయుగములోన

ఈ కొండపైన అర్జునుడు 

తపమును కావించెను

పరమశివుని మెప్పించి 

పాశుపతము పొందెను


విజయుడైన అర్జునుని పేరిట.. 

విజయవాడ అయినది ఈ నగరము

జగములన్నియు జేజేలు పలుకగ.. 

కనకదుర్గకైనది స్ధిరనివాసము

మేలిమి బంగరు ముద్దపసుపు.. 

కలగలిపిన వెన్నెలమోము


కోటి కోటి ప్రభాతాల 

అరుణిమయే కుంకుమ

అమ్మ మనసుపడి అడిగి ధరించిన 

కృష్ణవేణి ముక్కుపుడక

ప్రేమ కరుణ వాత్సల్యం.. 

కురిపించే దుర్గరూపం

ముక్కోటి దేవతలందరికి.. 

ఇదియే పుట్టిదీపం


మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా

పరాశక్తి లలితా.. శివానంద చరిత


చరణం 2:


దేవీ నవరాత్రులలో 

వేదమంత్ర పూజలలో

స్వర్ణ కవచములు 

దాల్చిన కనకదుర్గాదేవి


భవబందాలను బాపే.. 

బాలా త్రిపురసుందరి

నిత్యానందము కూర్చే.. 

అన్నపూర్ణాదేవి

లోకశాంతినే సంరక్షించే 

సుమంత్రమూర్తి.. గాయత్రీ

అక్షయ సంపదలెన్నో 

అవని జనుల కందించే 

దివ్య రూపిణీ.. మహాలక్ష్మి

విద్యా కవన గాన మొసగు 

వేదమయి.. సరస్వతి

ఆయురారోగ్యాలు భోగభాగ్యములు 

ప్రసాదించే.. మహాదుర్గ


శత్రు వినాసిని సత్యస్వరూపిని.. 

మహిషాసురమర్ధిని

విజయకారిణి అభయ రూపిణి.. 

శ్రీరాజరాజేశ్వరి


భక్తులందరికి కన్నుల పండుగ 

అమ్మా.. నీ దర్శనం

దుర్గమ్మా.. నీ దర్శనం


మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా

పరాశక్తి లలితా.. శివానంద చరిత

మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా

పరాశక్తి లలితా.. శివానంద చరిత


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నె పిల్లవని కన్నులున్నవని | Kannepillavani Kannulunnavani | Song Lyrics | Akali Rajyam (1980)

కన్నె పిల్లవని కన్నులున్నవని చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు, జానకి  పల్ల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు