ఒకటైపోదామా ఊహల వాహినిలో
చిత్రం : ఆస్తులు-అంతస్తులు (1969 )
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఒకటైపోదామా ఊహల వాహినిలో
మమతల తరగలపై... మధువుల నురగలపై
పరవశమొందగా... ఏకమౌదమా
పరవశమొందగా... ఏకమౌదమా
చరణం 1 :
ఓ....ఓ...ఓ...అనురాగ సీమలో...
అందాలకోనలో.... అల్లారుముద్దుగా ఉందామా
సొంపైన పొదరింట... ఇంపైన గిలిగింత...
సొంపైన పొదరింట... ఇంపైన గిలిగింత...
దోబూచులాడుతూ నవ్వుకుందామా
ఒకటైపోదామా ఊహల వాహినిలో ..
మమతల తరగలపై... మధువుల నురగలపై
పరవశమొందగా... ఏకమౌదమా
పరవశమొందగా... ఏకమౌదమా
చరణం 2 :
చిగురాకు జంపాల చెలరేగు చెలువాల...
ఉయ్యాలలూగుతూ ఉందామా
చిగురాకు జంపాల చెలరేగు చెలువాల...
ఉయ్యాలలూగుతూ ఉందామా
నింగిలో విహరించి.... నేలపై పులకించీ
నింగిలో విహరించి.... నేలపై పులకించీ...
శృంగార జలధిలో తేలుదామా....
ఒకటైపోదామా ఊహల వాహినిలో ..
మమతల తరగలపై... మధువుల నురగలపై
పరవశమొందగా... ఏకమౌదమా
పరవశమొందగా... ఏకమౌదమా
చరణం 3 :
ఓ....ఓ...ఓ....వలపుల జంటగా...
సరదాల పంటగా... సయ్యాట పాటలై... సాగుదామా
తారాచంద్రులమై....రాధాకృష్ణులమై
తారాచంద్రులమై....రాధాకృష్ణులమై
తన్మయమొందుతూ... కరగిపోదామా....
ఒకటైపోదామా ఊహల వాహినిలో ..
మమతల తరగలపై... మధువుల నురగలపై
పరవశమొందగా... ఏకమౌదమా
పరవశమొందగా... ఏకమౌదమా...
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి