చాలదా ఈ పూజ దేవి
చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
చాలదా ఈ పూజ దేవి...
చాలదా ఈ కొలువు దేవి...
నీ భక్తునింత నిరాదరణ చేయనేలా...ఆ..
చాలదా ఈ పూజ దేవీ ....
చరణం 1 :
నీ వాలు చూపులే... నా ప్రాణము...
నీ మందహాసమే... నా జీవము...
తపము జపము చేసి అలసి సొలసి పోతినే...
ఇక కనికరించి ఈ బాధను బాపవేలా.....ఆ...
చాలదా ఈ పూజ దేవి...
చాలదా ఈ కొలువు దేవి...
చరణం 2 :
నీ అందెల గలగలలే... ప్రణవ నాదము
నీ కంకణ రవళియే... ప్రణయ గీతము
నీ కటాక్ష వీక్షణమే నాకు మోక్షము...
కరుణజూపి ఈ దీనుని కావవేలా.. ఆ..
చాలదా ఈ పూజ దేవీ...
చాలదా ఈ కొలువు దేవీ
చరణం 3 :
నీవులేని నిముషాలే యుగములాయెనే
చెంతనుండి మాటలేని యోగమాయెనే
వరము కోరి ఈ చెరలో చిక్కుబడితినే...
జాలి దలిచి ముక్తి నొసగ జాలమేలా...ఆ..ఆ..
చాలదా ఈ పూజ దేవీ...
చాలదా ఈ కొలువు దేవీ
నీ భక్తునింత నిరాదరణ చేయనేలా.. ఆ...
చాలదా ఈ పూజ దేవీ...
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి