RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

6, అక్టోబర్ 2023, శుక్రవారం

కిల కిలమని కళావరు రాణి | Kilakila mani kalavaru Rani | Song Lyrics | Coolie No 1 (1991)

కిల కిలమని కళావరు రాణి



చిత్రం: కూలీ No.1(1991)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, చిత్ర


పల్లవి:


కిల కిల మని కళావరు రాణి

ఘల్లు ఘల్లు మని కథాకళి కాని

కళ్ళెం లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని


ఛల్ మోహనాంగా సుఖాలకు బోణి

చలి గిలి అన్ని పొలోమని పోని

సిగ్గేలేని సింగారాని చిందించని చలో హని


మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్ని

మగ జత పాడే బాణి మగువకు రేవై రాణి


కిల కిల మని కళావరు రాణి

ఘల్లు ఘల్లు మని కథాకళి కాని

కళ్ళెం లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని


చరణం 1:


బరువుగా.. విరివిగా.. 

ఆపె చూపు కథ ఏపుగా.. గోపిక

చొరవగా.. కరువుగా.. 

కాపు వేసె కథ కైపుగా.. కోరిక

వాలే పరువాలే తగువేలే గనుకా

కాలే తమకాలే గమకాలే పలుకా


కాంక్షలో శ్రుతీ గతి పెంచీ

కాల్చదా చుట్టు కట్టే కంచే.. ఈ మైకం

ఈడులో అతి గతి లేని

వేడికో దిక్కు మొక్కు పంచి.. ఈ రాగం

ఆదమరిచిన ఈడులో ఈతలాడని


ఛల్ మొహనాంగా సుఖాలకు బోణి

చలి గిలి అన్ని పొలోమని పోని

సిగ్గేలేని సింగారాని చిందించని చలో హని


చరణం 2:


ఒడుపుగా.. ఒలుచుకో.. 

ఓపలేను కదా ఒంటిలో.. అవసరం

చిలిపిగా.. దులుపుకో.. 

మోయలేవు కదా నడుములో.. కలవరం


తాపం తెరతీసి తరిమేసే తరుణం

తాళం తలుపేసి విరబూసే సమయం

వీలుగా గుట్టు మట్టు మీటి విలుగా 

ఇట్టె పుట్టే వేడి ఏడెడో

ఒంటిగ ఉంటే ఒట్టే అంటు వెంటనే 

జట్టే కట్టెయాలి ఏనీడో

జోడు బిగిసిన వేడిలో వేగిపోని


కిల కిల మని కళావరు రాణి

ఘల్లు ఘల్లు మని కథాకళి కాని

కళ్ళెం లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని


ఛల్ మొహనాంగా సుఖాలకు బోణి

చలి గిలి అన్ని పొలోమని పోని

సిగ్గేలేని సింగారాని చిందించని చలో హని


మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్ని

మగ జత పాడే బాణి మగువకు రేవై రాణి


కిల కిల మని కళావరు రాణి

ఛల్ మొహనాంగా సుఖాలకు బోణి

కళ్ళెం లేని కళ్ళల్లోని కవ్వింతల్ని హలో అని


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు