RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ilayaraja songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ilayaraja songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, ఏప్రిల్ 2026, శనివారం

ఎర్రగులాబీ విరిసినది | Erra Gulabi Virisinadi | Song Lyrics | Erra Gulabi (1979)

ఎర్రగులాబీ విరిసినది


చిత్రం :  ఎర్ర గులాబీలు (1979)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, జానకి  


పల్లవి :


రురూరురూ.. రురురురూ..

రురురురురురు..

ఎర్రగులాబి విరిసినది 

తొలిసారి నను కోరి

ఆశే రేపింది నాలో..

అందం తొణికింది నీలో..

స్వర్గం వెలిసింది భువిలో..


ఈ ఎర్రగులాబీ విరిసినది 

తొలిసారి నిను కోరి

ఆశే రేపింది నీలో..

అందం తొణికింది నాలో..

స్వర్గం వెలిసింది భువిలో..


ఈ ఎర్రగులాబీ విరిసినది.. 


చరణం 1 :


లతనై నీ జతనై 

నిన్నే పెనవేయనా

కతనై నీ కలనై 

నిన్నే మురిపించనా


నేనిక నీకే సొంతము

న న న న న నీకెందుకు 

ఈ అనుబంధము

న న న న న న న న న న న న న నా


ఈ ఎర్రగులాబీ విరిసినది 

తొలిసారి నను కోరి

ఆశే రేపింది నీలో..

అందం తొణికింది నాలో..

స్వర్గం వెలిసింది భువిలో..

ఈ ఎర్రగులాబీ విరిసినది ..


చరణం 2 :


పెదవిని... ఈ మధువునూ 

నేడే చవిచూడనీ

నాదని ఇక లేదనీ 

నీకే అందివ్వనా


వయసుని వయసే దోచేది

న న న న న న 

అది మనసుంటేనే జరిగేది

న న న న న న న న న న న న న నా


ఈ ఎర్రగులాబీ విరిసినది 

తొలిసారి నిను కోరి

ఆశే రేపింది నాలో..

అందం తొణికింది నీలో..

స్వర్గం వెలిసింది భువిలో..

ఈ ఎర్రగులాబీ విరిసినది..

నననన.. నననన..అహహా...  


- పాటల ధనుస్సు 


28, మార్చి 2026, శనివారం

బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే | Banthi Chamanthi | Song Lyrics | Abhilasha (1983)

బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే


చిత్రం: అభిలాష (1983) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: ఎస్ పి బాలు,ఎస్ జానకి 


పల్లవి: 


బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే 

బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే 

మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే 

నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని 

నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని 


చరణం 1: 


తేనె వాగుల్లో మల్లెపూలల్లే 

తేలిపోదాములే 

గాలి వానల్లో మబ్బు జంటల్లే 

రేగిపోదాములే 

విసిరే కొస చూపే  

ముసురైపోతుంటే 

ముసిరే వయసుల్లో మతి 

అసలే పోతుంటే 

వేడెక్కి గుండెల్లో తల దాచుకో 

తాపాలలో ఉన్న తడి ఆర్చుకో 

ఆకాశమంటే ఎదలో జాబిల్లి 

నీవే వెన్నెల్లు తేవే 


బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే 

మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే 


తారత్తా... తరరా తరరా

తారత్తా... తరరా తరరా


చరణం 2: 


పూత పెదవుల్లో పుట్టు గోరింట 

బొట్టు పెట్టిందిలే 

ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో 

సిగ్గు తీరిందిలే 

ఒదిగే మనకేదో 

ఒకటై పొమ్మంటే 

ఎదిగే వలపంతా 

ఎదలొకటై రమ్మంటే 


కాలాలు కరిగించు కౌగిళ్ళలో 

దీపాలు వెలిగించు నీ కళ్ళతో 

ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా...  

నీ సొంతమేలే 


బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే 

మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే 

నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని 

నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని 

బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే


- పాటల ధనుస్సు 


వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకు | Velapala ledu Kurralataku | Song Lyrics | Abhilasha (1983)

వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకు


చిత్రం: అభిలాష (1983)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: ఎస్ పి బాలు, ఎస్ జానకి


పల్లవి :


వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకు

ఓడే మాట లేదు ఆడే వాళ్ళకు

ఏది గెలుపో..హోయ్ హోయ్ 

ఏది మలుపో..హోయ్ హోయ్

తెలియు వరకు ఇదే ఇదే ఆట మనకు


వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకు

ఓడే మాట లేదు ఆడే వాళ్ళకు


తకధిమి తదోంత తకధిమి తదోంత

తకధిమి తదోంత తరగిడ తరగిడతా


చరణం 1 :


మన్మథుడు నీకు మంత్రి అనుకోకు

నీ వయసు కాచేందుకు...

వయసు ఒక చాకు అది వాడుకోకు

నా మనసు కోసేందుకు...

మనసే లేదు నీకు ఇచ్చేశావు నాకు

లేదనీ నీదనీ కలగని 

నిజమని అనుకొని ఆడకు


లాలా లాల లా.. లాలా లాల లా..

తకధిమి తదోంత తకధిమి తదోంత

తకధిమి తదోంత తరగిడ తరగిడతా


చరణం 2:


కలలకొక రూపు కనులకొక కైపు

తొలిమాపు విరి పానుపు...

కవితలిక ఆపు కలుసుకో రేపు

చెబుతాను తుది తీరుపు...

అహ ఏ తీర్పు వద్దు 

ఇదిగో తీపి ముద్దు

వద్దనీ ముద్దనీ చిదుమని 

పెదవుని చిటికెలు వేయకు


వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకు

ఓడే మాట లేదు ఆడే వాళ్ళకు

ఏది గెలుపో.. హోయ్ హోయ్ 

ఏది మలుపో.. హోయ్ హోయ్

తెలియు వరకు ఇదే ఇదే ఆట మనకు


లాలా లాల లా.. లాలా లాల లా..

తకధిమి తదోంత తకధిమి తదోంత

తకధిమి తదోంత తరగిడ తరగిడతా


- పాటల ధనుస్సు 



సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది | Sandepoddulakada | Song Lyrics | Abhilasha (1983)

సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది


చిత్రం: అభిలాష (1983)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: ఎస్ పి బాలు, ఎస్ జానకి


పల్లవి:


సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది

అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది

మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు

ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో...  

ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో


సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది

అందగాడికి తోడు చలి గాలి రమ్మంది

ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు

ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో...  

ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో


చరణం 1:


కొండ కోనా జలకాలాడే వేళ 

కొమ్మరెమ్మ చీరకట్టే వేళ

పిందె పండై చిలక కొట్టే వేళ...  

పిల్ల పాప నిదరే పోయే వేళ  

కలలో కౌగిలే కన్నులు దాటాలా 

ఎదలే పొదరిళ్ళై వాకిలి తియ్యాల

ఎదటే తుమ్మెద పాట 

పూవుల బాట వెయ్యాల


సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది

అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది


ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు

ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో...  

ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో


చరణం 2:


మల్లె జాజి మత్తుజల్లే వేళ 

పిల్ల గాలి జోలపాడే వేళ

వానే వాగై వరదై పొంగే వేళ 

నేనే నీవై వలపై సాగే వేళ


కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల

పుట్టిన ఎన్నెల్లో పుట్ట కల్లు తాగాలా 

పగలే ఎన్నలగువ్వ 

చీకటి గువ్వలాడాలా...


సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది

అందగాడికి తోడు చలి గాలి రమ్మంది


మబ్బు పట్టే కళ్ళు 

తబ్బిబ్బులయ్యే ఒళ్ళు

ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో...  

ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో


సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది

అందగాడికి తోడు చలి గాలి రమ్మంది


- పాటల ధనుస్సు 



8, జనవరి 2026, గురువారం

స్వాతి చినుకు సందెవేళలో | Swathi Chinuku Sandevelalo | Song Lyrics | Akhari Poratam (1988)

స్వాతి చినుకు సందెవేళలో


చిత్రం : ఆఖరి పోరాటం (1988)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, జానకి


పల్లవి :


స్వాతి చినుకు సందెవేళలో... 

హొయ్

లేలేత వణుకు అందగత్తెలో... 

హొయ్

మబ్బే కన్ను గీటే అరె 

మతే పైట దాటే

చలే కొరుకుతుంటే హొయ్ 

చెలే వణుకుతుంటే

భలేగుంది పడుచు ముచ్చటా హా

భలే కదా గాలి ఇచ్చటా

భలేగుంది పడుచు ముచ్చటా... హా

భలే కదా గాలి ఇచ్చటా...


స్వాతి చినుకు సందెవేళలో... 

హొయ్

లేలేత వలపు అందగాడిలో... 

హొయ్

ఈడే ఉరుముతుంటే... 

నేడే తరుముతుంటే

సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే

పదా అంది పడుచు పూపొదా.. 

హొయ్

ఇదే కదా చిలిపి ఆపదా

పదా అంది పడుచు పూపొదా..

హోయ్..

ఇదే కదా చిలిపి ఆపదా 


చరణం 1 :


ఈ గాలిలో ఒకే చలీ 

ఈ దెబ్బతో అదే బలి

ఈ తేమలో ఒకే గిలీ 

ఈ పట్టుతో సరే సరి


నీ తీగకే గాలాడక.. 

నా వీణలే అల్లాడగా

నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా

వరాలిచ్చి పోరా వరించాను లేరా

చల్లని జల్లుల సన్నని గిల్లుడు 

సాగిన వేళా.. కురిసిన


స్వాతి చినుకు సందెవేళలో.. 

హొయ్

లేలేత వణుకు అందగత్తెలో.. 

హొయ్


మబ్బే కన్ను గీటే మతే పైట దాటే

సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే

పదా అంది పడుచు పూపొదా... 

హొయ్


ఇదే కదా చిలిపి ఆపదా

భలేగుంది పడుచు ముచ్చటా ...హా

భలే కదా గాలి ఇచ్చటా 


చరణం 2 :


యా యా యా యా యా యా....

ఈ వానలా కథేమిటో 

నా ఒంటిలో సొదెందుకో

నీకంటిలో కసేమిటో 

నాకంటినీ తడెందుకో

తొలివానలా గిలిగింతలో 

పెనవేసినా కవ్వింతలో

ఎదే మాట రాకా పెదాలందు ఆడా

శృతే మించిపోయి లయే రేగిపోగా

మబ్బుల చాటున ఎండలు 

సోకిన అల్లరి వేళా మెరిసిన


స్వాతి చినుకు సందెవేళలో 

హొయ్

లేలేత వలపు అందగాడిలో 

హొయ్


ఈడే ఉరుముతుంటే 

నేడే తరుముతుంటే

చలే కొరుకుతుంటే హొయ్ 

చెలే వణుకుతుంటే


భలేగుంది పడుచు ముచ్చటా హా

భలే కదా గాలి ఇచ్చటా

పదా అంది పడుచు పూపొదా 

హొయ్

ఇదే కదా చిలిపి ఆపదా


- పాటల ధనుస్సు 


ఎప్పుడు ఎప్పుడు | Eppudu Eppudu | Song Lyrics | Akhari Poratam (1988)

ఎప్పుడు ఎప్పుడు



చిత్రం : ఆఖరి పోరాటం (1988)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : ఎస్ పి బాలు, చిత్ర 


పల్లవి :


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు 

ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో 

మెత్తని వత్తిడిలో

ఇప్పటికిప్పుడు చిచ్చుల 

కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో 

దక్కిన చెక్కిలిలో 


నీ వంపుల సొంపే 

నా వంటికి పంపే

అల్లికలో అందికలో 

మల్లిక పూసిన మాపటిలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు 

ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో 

మెత్తని వత్తిడిలో....

ఇప్పటికిప్పుడు చిచ్చుల 

కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో 

దక్కిన చెక్కిలిలో 


చరణం 1 :


ఒక మాటు ఒడిని మీటి...  

ఒక మాటు ఒడిని మీటి... 

వలపు రాగాలు లాగేసుకుంటాలే 


పొద చాటు కథలు దాటి...  

పొద చాటు కథలు దాటి... 

చిలిపి తాళాలు మోగించుకుంటాలే  


ఎప్పటికప్పుడు దప్పిక 

తీరని చెప్పని దాహాలే

ఏమని చెప్పను నీకు 

జవాబులు పైటల పాప


అచ్చట ముచ్చట ఇచ్చట 

గిచ్చుడు పెంచిన మొహాలే

ఎంతని ఆపను నిన్ను 

మరీ మది బిత్తరపోక


చక్కని చుక్క తన సొంతం 

అనుకోమాక బలవంతం 

కోరికలే ఓపికలై మోజులు 

తెచ్చిన అల్లరిలో 


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు 

ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో 

మెత్తని వత్తిడిలో....


ఇప్పటికిప్పుడు చిచ్చుల 

కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో 

దక్కిన చెక్కిలిలో 


నీ వంపుల సొంపే 

నా వంటికి పంపే

అల్లికలో అందికలో 

మల్లిక పూసిన మాపటిలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు 

ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో 

మెత్తని వత్తిడిలో....

ఇప్పటికిప్పుడు చిచ్చుల 

కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో 

దక్కిన చెక్కిలిలో 


చరణం 2 :


పొరపాటో తెరకు చాటో...  

పొరపాటో తెరకు చాటో... 

వయసులాటాడుకోవాలి ఈనాడే 

అది ఆటో పెదవి గాటో...  

అది ఆటో పెదవి గాటో ... 

మధుర గాయాలు తాకాలి లోలోనే


చప్పున ఆరని నిప్పుల 

కుంపటి రేపిన తాపాలే

చల్లని వెన్నెల చిచ్చుల 

ఉచ్చులు వేసెను నాకే


అచ్చిక బుచ్చిక పిచ్చిగ 

మచ్చిక చేసిన అందాలే

జంటగ తుంటరి రెప్పల 

గంటలు కొట్టెను నేడే


చమ్మని చక్కే మన ఆట...  

మల్లెల పక్కే మన తోట

నవ్వులతో పువ్వులతో 

రివ్వులు పెట్టిన ప్రేమలలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు 

ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో 

మెత్తని వత్తిడిలో....


ఇప్పటికిప్పుడు చిచ్చుల 

కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో 

దక్కిన చెక్కిలిలో 


నీ వంపుల సొంపే 

నా వంటికి పంపే

అల్లికలో అందికలో 

మల్లిక పూసిన మాపటిలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు 

ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో 

మెత్తని వత్తిడిలో....


ఇప్పటికిప్పుడు చిచ్చుల 

కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో 

దక్కిన చెక్కిలిలో 


- పాటల ధనుస్సు 


9, డిసెంబర్ 2025, మంగళవారం

యమహో నీ యమ యమ అందం | Yamaho Yamayama Andam | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

యమహో నీ యమ యమ అందం


చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, జానకి 


పల్లవి : 


యమహో నీ యమ యమ అందం 

చెలరేగింది ఎగా దిగా తాపం 

నమహో నీ ఝమ ఝమ వాటం 

సుడి రేగింది ఎడా పెడా తాళం 

పోజుల్లో నేను యముడంత వాడ్ని 

మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని 

అల్లారు ముద్దుల్లో గాయం 

విరబూసింది పువ్వంటి ప్రాయం 


యమహో నీ యమ యమ అందం 

చెలరేగింది ఎగా దిగా తాపం 

నమహో నీ ఝమ ఝమ వాటం 

సుడి రేగింది ఎడా పెడా తాళం 


చరణం 1 : 


నల్లని కాటుక పెట్టి 

గాజులు పెట్టి గజ్జా కట్టి 

గుట్టుగా సెంటే కొట్టి 

వడ్డాణాలే ఒంటికి పెట్టి 

తెల్లని చీర కట్టి 

మల్లెలు చుట్టి కొప్పున పెట్టీ 

పచ్చని పాదాలకి 

ఎర్రని బొట్టు పారాణెట్టి 

చీకటింతా దీపమెట్టి 

చీకుచింత పక్కానెట్టి 

నిన్ను నాలో దాచిపెట్టి 

నన్ను నీకు దోచిపెట్టి 


పెట్టూపోతా వద్దే చిట్టెంకి 

చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి 

పెట్టేది మూడే ముళ్ళమ్మి 

నువ్వు పుట్టింది నాకోసమమ్మి 

ఇక నీ సొగసు నా వయసు 

పేనుకొనే ప్రేమలలో 


యమహో నీ యమ యమ అందం 

చెలరేగింది ఎగా దిగా తాపం 


చరణం 2 : 


పట్టె మంచమేసిపెట్టి 

పాలు పెట్టి పండు పెట్టి 

పక్క మీద పూలు కొట్టి 

పక్కా పక్కాలొళ్ళో పెట్టి 

ఆకులో వక్క పెట్టి 

సున్నాలెట్టి చిలకా చుట్టి 

ముద్దుగా నోట్లో పెట్టి 

పరువాలన్ని పండాపెట్టి 

చీర గుట్టు సారే పెట్టి 

సిగ్గులన్ని ఆరాబెట్టి 

కళ్ళలోన వత్తులెట్టి 

కౌగిలింత మాటు పెట్టి 


ఒట్టే పెట్టి వచ్చేసాక మామా 

నిను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమా 

చుట్టెయ్యి సందె సీకట్లోనా 

నను కట్టెయ్యి కౌగిలింతల్లోనా 

ఇక ఆ గొడవ ఈ చొరవ 

ఆగవులే అలజడిలో 


యమహో నీ యమ యమ అందం 

చెలరేగింది ఎగా దిగా తాపం 

నమహో నీ ఝమ ఝమ వాటం 

సుడి రేగింది ఎడా పెడా తాళం


- పాటల ధనుస్సు 


10, జులై 2025, గురువారం

దేవి శాంభవి దీన బాంధవి | Devi Shambhavi | Prardhana Song Lyrics | Kondaveeti Donga (1990)

దేవి శాంభవి దీన బాంధవి



చిత్రం: కొండవీటి దొంగ (1990) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: జానకి 


ప్రార్ధన గీతం:


దేవి శాంభవి దీన బాంధవి 

పాహి పార్వతి కృపా సరస్వతి 

దేవి శాంభవి దీన బాంధవి 

పాహి పార్వతి కృపా సరస్వతి 

లోక బాంధవి ప్రాణ దాతవి 

శోక గాధవి కాపాడు శాంభవి 

అశ్రుధారతో నీ కాళ్ళు కడగామా 

రక్త గంగతో పారాణి దిద్దమా 

దేవుడంటి మా ప్రభువు కోసము 

నీవు కోరితే మా ప్రాణమివ్వమా 

శ్రీ దుర్గ కనక దుర్గ కొండ దేవతా 

కొంగుపట్టి అడిగినాము నీ సాహతా...


- పాటల ధనుస్సు 


4, జులై 2025, శుక్రవారం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం | Sri Anjaneyam Prasannanjaneyam | Song Lyrics | Kondaveeti Donga (1990)

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం



చిత్రం: కొండవీటి దొంగ (1990) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, జానకి 


పల్లవి: 


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 

బ్రహ్మచారి భరించ లేడు గాయం 

ప్రేమ గుళ్ళో ఇవ్వాళా పెళ్లి ఖాయం 

స్వామి నిన్నే స్మరించి వరిస్తే అదే 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 


చరణం 1: 


సామ అంటే నీకు ప్రేమ 

భామ అంటే నాకు ప్రేమ 

ప్రేమ భిక్ష నాకు పెట్టారా 

ఆకు పూజ నీకు నోము 

సోకు పూజ నాకు నోము 

జంటకింత గంట కొట్టగా 

ముద్దు లేక ముచ్చటాడు 

పొద్దు లేక పొందు లేక 


ముక్కు మూసుకున్న నాకు దిక్కు చూపారా 

మోహనాలు మోయలేక సోయగాలు దాయలేక 

మోజుపడ్డ నన్ను బ్రోచి మొక్కు తీర్చరా 

జింక లాంటి కంట్లో జిగేలు మంది ప్రాయం 

జివ్వుమన్న ఒంట్లో చివుక్కుమంది ప్రాణం 

ప్రేమ పుష్పం సుమించి ఫలించు వేళలోన 


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 

బ్రహ్మచారి భరించ లేడు గాయం 

ప్రేమ గుళ్ళో ఇవ్వాళా పెళ్లి ఖాయం 

స్వామి నిన్నే స్మరించి వరిస్తే అదే 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 


చరణం 2: 


కోడెగాలి కొట్టగానే కొంగు జారి కొంప దీసి 

ఒంపు సొపు గంపకెత్తరా 

ఆడాగాలి సోకగానే కక్ష పుట్టి రెచ్చగొట్టి 

కన్నె ఈల కౌగలించిరా 


పూటకకొక్క పువ్వు పెట్టి పూలాబాణం వేసి కొట్టు 

మన్మధుణ్ణి ఆపలేని మత్తు పుట్టేరా 

మాపటేళ మల్లెలెట్టి చీకటేళ చిచ్చు పెట్టు 

పిల్లదాని చూడగానే పిచ్చి పట్టేరా 

పెట్టలేను కామా ఇదేమి ప్రేమ గీతం 

చెప్పలేను రామా మధీయ మౌన భావం 

మంత్ర పుష్పం మనస్సే పఠించు వేళలోన 


శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 

బ్రహ్మచారి భరించ లేడు గాయం 

ప్రేమ గుళ్ళో ఇవ్వాళా పెళ్లి ఖాయం 

స్వామి నిన్నే స్మరించి వరిస్తే అదే 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం


- పాటల ధనుస్సు 


2, జూన్ 2025, సోమవారం

ఏమని నే చెలి పాడుదునో | Emani Ne Cheli paduduno | Song Lyrics | Mantrigari Viyyankudu (1983)

ఏమని నే చెలి పాడుదునో



చిత్రం :  మంత్రిగారి వియ్యంకుడు ( 1983)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపథ్య  గానం :  బాలు, జానకి


పల్లవి:


ఏమని నే..  చెలి పాడుదునో

తికమకలో ఈ మకతికలో

తోటలలో .. పొదమాటులలో .. 

తెరచాటులలో...


ఏమని నే మరి పాడుదునో

తికమకలో ఈ మకతికలో


చరణం 1:


నవ్వు .. చిరునవ్వు .. 

విరబూసే పొన్నలా

ఆడు .. నడయాడు .. 

పొన్నల్లో నెమలిలా


పరువాలే పార్కుల్లో .. 

ప్రణయాలే పాటల్లో

నీ చూపులే నిట్టూర్పులై .. 

నా చూపులే ఓదార్పులై

నా ప్రాణమే నీ వేణువై .. 

నీ ఊపిరే నా ఆయువై ..

సాగే తీగ సాగే రేగిపోయే 

లేత ఆశల కౌగిట.. 


ఏమని నే.. మరి పాడుదునో.. 

తికమకలో ఈ మకతికలో


చరణం 2:


చిలక .. గోరింక .. 

కలబోసే కోరిక

పలికే .. వలపంతా .. 

మనదేలే ప్రేమికా


దడ పుట్టే పాటల్లో .. 

ఈ దాగుడుమూతల్లో

ఏ గోపికో దొరికిందని .. 

ఈ రాజుకే మరుపాయెనా

నవ్విందిలే బృందావని.. 

నా తోడుగా ఉన్నావని..

ఊగే తనువులూగే.. 

వణకసాగె రాసలీలలు ఆడగ 


ఏమని నే..  మరి పాడుదునో ..

తొలకరిలో తొలి అల్లరిలో 

మన అల్లికలో..


ఏమని నే..  చెలి పాడుదునో

తికమకలో ఈ మకతికలో


- పాటల ధనుస్సు 


13, డిసెంబర్ 2024, శుక్రవారం

నీ గూడు చెదిరింది | Nee Gudu Chedirindi | Song Lyrics | Nayakudu (1987)

నీ గూడు చెదిరింది



చిత్రం: నాయకుడు (1987) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత : రాజశ్రీ  

నేపధ్య గానం: బాలు 



నీ గూడు చెదిరింది 

నీ గుండె పగిలింది 

ఓ చిట్టి పావురమా 

ఎవరు కొట్టారూ... 


ఎవరు కొట్టారూ...

ఎవరు కొట్టారూ... 

నిన్నెవరు కొట్టారూ...

ఎవరు కొట్టారూ... 


కనులా నీరూ రానీకూ...

కానీ పయనం కడవరకూ... 

కదిలే కాలం ఆగేను...

కథగా నీతో సాగేనూ... 


నీ గూడు చెదిరింది 

నీ గుండె పగిలింది 

ఓ చిట్టి పావురమా 

ఎవరు కొట్టారూ... 


ఎవరు కొట్టారూ...

ఎవరు కొట్టారూ... 

నిన్నెవరు కొట్టారూ...

ఎవరు కొట్టారూ...


- పాటల ధనుస్సు 


నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు | Neelala Kannullo | Song Lyrics | Nayakudu (1987)

నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు



చిత్రం: నాయకుడు (1987) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత : రాజశ్రీ  

నేపధ్య గానం: బాలు 



నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు 

నా చిట్టి తల్లీ నిన్నెవరు కొట్టారు 

ఎవరు కొట్టారు...ఎవరు కొట్టారు... 

ఎవరు కొట్టారు...ఎవరు కొట్టారు... 

కనులా నీరు రానీకు...

కానీ పయనం కడవరకు... 

కదిలే కాలం ఆగేను...

కథగా నీతో సాగేను... 


నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు 

నా చిట్టి తల్లీ నిన్నెవరు కొట్టారు 

ఎవరు కొట్టారు...ఎవరు కొట్టారు... 

ఎవరు కొట్టారు...ఎవరు కొట్టారు...


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు