మాబాబు చిరునవ్వు నవ్వాలి
చిత్రం: పెద్దలు మారాలి (1974)
సంగీతం: బి. గోపాలం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల
పల్లవి:
మాబాబు చిరునవ్వు నవ్వాలి
మాఇంట చిరుజల్లు
కురవాలి
ఆడాలి హాయినిండాలి
పెరగాలి పేరు నిలపాలి
చరణం: 1
చిట్టిపాస ఆడిన ఆటలూ
తొలివూనులూ
మణిపూసలు
చిన్నారి వేసిన చిరు చిందులూ
కనువిందులు
తనుపలికితే గిలిగింతలు
అందాలు కోటి మురిపాలు
చరణం: 2
మా మదిని జూబిలి
ఉదయించెనే... మురిపించెనే
మా కంటికలవలు
వికసించెనే ఉదయించెనే
కలకాలమూ నగుమోముతో
మా కులదీపకాంతి వెలగాలి
చరణం: 3
నీ తల్లి ఆశలు కొనసాగును
నెర వేరునూ
నీ తండ్రి కోరిక చిగురించును
ఫలియించునూ
పలుచదువులు పైపదవులు
పొందాలి కలలు పండాలి
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి