చుక్కలారా చూపుల్లారా
చిత్రం : ఆపద్భాంధవుడు (1992)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : చిత్ర
పల్లవి :
చుక్కలారా చూపుల్లారా
ఎక్కడమ్మా జాబిలీ
మబ్బుల్లారా మంచుల్లారా
తప్పుకోండీ దారికీ
వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ?
విన్నవించరా వెండి మింటికీ?
జో జో.. లాలీ... జో జో... లాలీ
చరణం 1 :
మలి సంధ్య వేళాయే..
చలి గాలి వేణువాయే
నిదురమ్మా ఎటు పోతివే
మునిమాపు వేళాయే..
కనుపాప నిన్ను కోరె
కునుకమ్మా ఇటు చేరవే
చరణం 2 :
నిదురమ్మా ఎటు పోతివే?
కునుకమ్మా ఇటు చేరవే..
నిదురమ్మా ఎటు పోతివే?
కునుకమ్మా ఇటు చేరవే..
గోధూళి వేళాయే..
గూళ్ళని కనులాయే
గోధూళి వేళాయే..
గూళ్ళని కనులాయే
గువ్వల రెక్కల పైనా
రివ్వు రివ్వున రావే
జోల పాడవా బేల కళ్ళకి..
వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
జో జో లాలీ.. జో జో లాలీ...
జో జో లాలీ.. జో జో లాలీ
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి