RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
superstar krishna songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
superstar krishna songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, ఆగస్టు 2026, ఆదివారం

అరె చిక్కిందమ్మ చిక్కింది కన్నె చుక్క | Are Chikkindamma Chikkindi | Song Lyrics | Shakti (1983)

అరె చిక్కిందమ్మ చిక్కింది కన్నె చుక్క 


చిత్రం: శక్తి (1983)

సంగీతం: కె.చక్రవర్తి

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల


పల్లవి:


అరె చిక్కిందమ్మ చిక్కింది 

కన్నె చుక్క

దక్కిందమ్మ దక్కింది 

జున్ను ముక్క

అరె చిక్కిందమ్మ చిక్కింది 

కన్నె చుక్క

అరె దక్కిందమ్మ దక్కింది 

జున్ను ముక్క

హొయ్ ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

తీరేనమ్మా నేడో రేపో 

తీపి తిక్క


చిక్కాడమ్మ చిక్కాడు 

చిచ్చు ముక్క

దక్కాడమ్మ దక్కాడు 

తస్స చెక్క

చిక్కాడమ్మ చిక్కాడు 

చిచ్చు ముక్క

దక్కాడమ్మ దక్కాడు 

తస్స చెక్క

ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

తీరేనమ్మా నేడో రేపో  

తీపి తిక్క


చరణం: 1


అందాలన్ని చూస్తూ చూస్తూ 

ఆగలేక

ఆగలేనే వయసుతోని 

వేగలేక

మల్లెపూలు చల్లగాలి 

ఓపలేక

మంచం మీద దొర్లి దొర్లి 

నిద్రరాక

హేయ్ వచ్చేశాను వేళాపాళ 

చూసుకోక

వచ్చేశాను వేళాపాళ 

చూసుకోక

చెప్పేశాను తప్పోవప్పో 

దాచుకోక

చెప్పేశాను తప్పోవప్పో 

దాచుకోక


అరె చిక్కిందమ్మ చిక్కింది 

కన్నె చుక్క

దక్కిందమ్మ దక్కింది 

జున్ను ముక్క

చిక్కాడమ్మ చిక్కాడు 

చిచ్చు ముక్క

దక్కాడమ్మ దక్కాడు 

తస్స చెక్క

హొయ్ ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

తీరేనమ్మా రేపో నేడో 

తీపి తిక్క


చరణం: 2


కాగే కాగే వచ్చావింక 

కాచుకోక

కళ్ళల్లోకి చూసుకొంటు 

ఉండిపోక

ఉయ్యాలల్లే ఊగుతున్న 

నడుముదాక

ఉత్సహంగా చెయ్యివేస్తే  

వదిగిపోక

కొంగు గాలి తగలంగానే 

పొంగిపోక

కొంగు గాలి తగలంగానే 

పొంగిపోక

పొంగుతున్న పాలమీద 

నీళ్లు చల్లక

అరె పొంగుతున్న పాలమీద 

నీళ్లు చల్లక


హెయ్ చిక్కాడమ్మ చిక్కాడు 

చిచ్చు ముక్క

దక్కాడమ్మ దక్కాడు 

తస్స చెక్క

చిక్కిందమ్మ చిక్కింది 

కన్నె చుక్క

దక్కిందమ్మ దక్కింది 

జున్ను ముక్క

ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

హోయ్ ఆడేనమ్మ ఈడు జోడు 

చెమ్మచెక్క

తీరేనమ్మా నేడో రేపో  

తీపి తిక్క


- పాటల ధనుస్సు


కొండదేవత నిన్ను కొలిచేనమ్మా | Kondadevatha Ninnu | Song Lyrics | Alluri Seetharamaraju (1974)

కొండదేవత నిన్ను కొలిచేనమ్మా


చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)

సంగీతం: పి.ఆదినారాయణ రావు

సాహిత్యం: కొసరాజు

గానం: ఎస్ పి బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి


పల్లవి : 


కొండదేవత నిన్ను కొలిచేనమ్మా

కోటికోటి దండాలు ఓలమ్మా

వేయి కళ్ళతో మమ్ము సూడాలమ్మా

యెన్ను కాచి వుండాలి ఓలమ్మా

కొండదేవత నిన్ను కొలిచేనమ్మా


చరణం 1 :


పోతుగడ్జపై పుట్టామమ్మా 

విల్లంబులు చేపట్టామమ్మా

వీర కంకణం కట్టామమ్మా 

జాతి పౌరుషం నిలబెడతాం

ఏటుకొక్క తల ఎగరేస్తాం

తుపాకి గుళ్ళకు ఎదురు నిలుస్తాం

మర ఫింగులను మసి మసి చేస్తాం

మాపై దయవుంటే తల్లీ 

నింగిని నేలకు దించేస్తాం

పరాయితొత్తుల పాతేస్తాం


చరణం 2 :


భద్రాచల శ్రీ రామచంద్రుడే 

మా సీతారామరాజు

అలనాటి ఆ బాలచంద్రుడే 

మా సీతారామరాజు

మా కోయగూడెముల కొచ్చాడే, 

కొండంతబలం మా కిచ్చాడే

మా రాజుకు ఆండగ కలవాలమ్మా

పిలిచిన ఓయని పలకాలమ్మా


- పాటల ధనుస్సు


విప్లవం మరణించదు వీరుడు మరణించడు | Viplavam Maraninchadu | Song Lyrics | Alluri Seetharamaraju (1974)

విప్లవం మరణించదు వీరుడు మరణించడు  


చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)

సంగీతం: పి.ఆదినారాయణరావు

సాహిత్యం: ఆరుద్ర

గానం: ఎస్ పి బాలు,


పల్లవి:


విప్లవం మరణించదు 

వీరుడు మరణించడు

వేయి వేలరూపాల 

వెలుగుతుంది విప్లవాత్మ


ఓ విప్లవజ్యోతి జోహారు 

ఓ పరిప్లవశక్తి జోహార్లు

నీ పేరే ప్రజాశక్తి సంకేతం 

నీ బ్రతుకే దేశానికి సందేశం


చరణం 1:


నీ వెగరేసిన సమర పతాకం 

నేతాజీ దరియించాడు

సాయుధ శక్తులు జై హిందంటూ 

సంగ్రామమ్మను సలిపారు


చరణం 2:


మధుర స్వప్నం మహిత స్వరాజ్యం

గాంధీ నెహ్రూ తెచ్చారు

జననికి విడుదల జాతికి పండగ

జెండా ఉంచా రహే హమారా


- పాటల ధనుస్సు


29, ఆగస్టు 2026, శనివారం

ఈ పొద్దులు ఎరగని ముద్దుల ముచ్చట | Eepoddulu Yerugani | Song Lyrics | Kirayi Alludu (1984)

ఈ పొద్దులు ఎరగని ముద్దుల ముచ్చట


చిత్రం: కిరాయి అల్లుడు (1984)

సంగీతం: కె. చక్రవర్తి

సాహిత్యం: వేటూరి 

గానం: ఎస్ పి బాలు, ఎస్.పి.శైలజ 


పల్లవి:


ఈ పొద్దులు ఎరగని 

ముద్దుల ముచ్చట నీకోసమే

ఏ ఇద్దరు ఎరుగని 

గుండెల గుస గుస నీకోసమే

జతచేరి ఏలుకుంటే 

లత లాగ అల్లుకుంటా

జతచేరి అల్లుకొంటే 

లత లాగ అల్లుకుంటా

నూరేళ్ళ ఈ జీవితాన 


ఏ హద్దులు ఎరగని 

వెచ్చని ముచ్చట నీకోసమే

ఏ కంటికి తెలియని 

కౌగిలి కానుక నీకోసమే

వడిలోకి చేరుకుంటే 

గుడిలాగ దాచుకుంటా

వడిలోకి చేరుకుంటే 

గుడిలాగ దాచుకుంటా

వెయ్యేళ్ళు నా గుండెలోన 


చరణం: 1


మధుమాసమే మనకోసము

మధుమాసమే మనకోసము

పూ పొదరింటికి పేరంటానికి 

రమ్మని పిలిచింది 

చలిగాలితో సాయంత్రమే 

వెచ్చని ఎడదల వెన్నెల విడిదికి 

రమ్మని పిలిచింది

అందాక దేవుణ్ణి పూజించనా

గోరంత ముద్దిచ్చి పులకించనా

అరుదైన అందాల వరమివ్వనా


ఈ పొద్దులు ఎరగని 

ముద్దుల ముచ్చట నీకోసమే

ఏ కంటికి తెలియని 

కౌగిలి కానుక నీకోసమే


చరణం: 2


ఎదలోయిల ఎల కోయిల 

ఎదలోయిల ఎల కోయిల

వలపుల వాకిట మంగళ గీతిక 

కమ్మగ పాడింది

సిగపాయల సిరిమల్లిక 

తుమ్మెద వంటలు తేనెలు 

రుచులను పెదవికి ఇచ్చింది

పరువాల తొలి విందు అందించనా 

హృదయాలకే అంతు చూపించినా

కౌగిళ్లు మన ఇల్లు చేసెయ్యనా


ఈ పొద్దులు ఎరగని 

ముద్దుల ముచ్చట నీకోసమే

ఏ ఇద్దరు ఎరుగని 

గుండెల గుస గుస నీకోసమే

జతచేరి ఏలుకుంటే 

లత లాగ అల్లుకుంటా

నూరేళ్ళ ఈ జీవితాన


ఏ హద్దులు ఎరగని 

వెచ్చని ముచ్చట నీకోసమే

ఏ కంటికి తెలియని 

కౌగిలి కానుక నీకోసమే

వడిలోకి చేరుకుంటే 

గుడిలాగ దాచుకుంటా

వెయ్యేళ్ళు నా గుండెలోన 


- పాటల ధనుస్సు



రగిలింది విప్లవాగ్ని ఈరోజు | Ragilindi Viplavagni | Song Lyrics | Alluri Seetharamaraju (1974)

రగిలింది విప్లవాగ్ని ఈరోజు 


చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)

సంగీతం: పి.ఆదినారాయణ రావు

సాహిత్యం: ఆరుద్ర

గానం: ఎస్ పి బాలు,


రగిలింది విప్లవాగ్ని ఈరోజు

అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు


తనువులోన అణువణువూ 

తరతరాల పోరాటం

తన రూపే దాల్చింది 

ఝాన్నీరాణి కరవాలం

జలియన్ వాలాబాగున 

జరిగిన మారణ కాండ

తలచి ఎగురవేశాడు 

తిరుగుబాటు జెండా

తిరుగుబాటు జెండా


కన్నెగంటి హనుమంతు 

వెన్నలోని బాకు

కత్తిగట్టి సాగమంది 

కడవిజయం వరకు

ఎలుగెత్తెను ఆ కంఠం 

మనదేరాజ్యం

జపియించెను ఆ వదనం 

"వందేమాతరం”


వందేమాతరం మంటూ 

నినదించిన బంగారం

స్వరాజ్యమ్మ జన్మహక్కని 

చాటిన మహరాష్ట్ర,

హించకు ప్రతి హింస అన్న 

వీరభూమి పాంచాలం

అన్నిటికి నెలవాయను 

ఆంధ్ర వీర హృదయం


- పాటల ధనుస్సు


వస్తాడు నా రాజు ఈ రోజు | Vastadu Naa Raju | Song Lyrics | Alluri Seetharamaraju (1974)

వస్తాడు నా రాజు ఈ రోజు 


చిత్రం :  అల్లూరి సీతారామరాజు (1974)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి

నేపథ్య గానం :  పి. సుశీల 


పల్లవి :


వస్తాడు నా రాజు ఈ రోజు.. 

రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

కార్తీకపున్నమి వేళలోన.. 

కలికి వెన్నెల కెరటాలపైన

కార్తీకపున్నమి వేళలోన.. 

కలికి వెన్నెల కెరటాలపైన

తేలివస్తాడు నా రాజు ఈ రోజు


చరణం 1 :


వేలతారకల నయనాలతో.. 

నీలాకాశం తిలకించేను

వేలతారకల నయనాలతో.. 

నీలాకాశం తిలకించేను

అతని చల్లని అడుగుల సవ్వడి 

వీచే గాలి వినిపించేను


ఆతని పావన పాదధూళికై.. 

అవని అణువణువు కలవరించేను

అతని రాకకై అంతరంగమే.. 

పాలసంద్రమై పరవశించేను...  

పాలసంద్రమై పరవశించేను

వస్తాడు నా రాజు ఈ రోజు.. 

రానే వస్తాడు నెలరాజు ఈ రోజు


చరణం 2 :


వెన్నెలలెంతగా విరిసినగానీ 

చంద్రుణ్ణీ విడిపోలేవు

కెరటాలెంతగా పొంగినగానీ 

కడలిని విడిపోలేవు

కలసిన ఆత్మల అనుబంధాలు.. 

ఏ జన్మకు విడిపోలేవులే


తనువులు వేరైనా.. 

దారులు వేరైనా

తనువులు వేరైనా.. 

దారులు వేరైనా

ఆ బంధాలే నిలిచేనులే.. 

ఆ బంధాలే నిలిచేనులే

వస్తాడు నా రాజు ఈ రోజు.. 

రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

కార్తీకపున్నమి వేళలోన.. 

కలికి వెన్నెల కెరటాలపైన

వస్తాడు నా రాజు ఈ రోజు


- పాటల ధనుస్సు


19, జూన్ 2026, శుక్రవారం

మాట చాలదా మనసు చాలదా | Maata Chalada Manasu Chalada | Song Lyrics | Antha Manamanchike (1972)

మాట చాలదా మనసు చాలదా


చిత్రం: అంతా మన మంచికే (1972)

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి 

సంగీతం: సత్యం, భానుమతి

నేపధ్య గానం: ఎస్ పి బాలు, పి.సుశీల 


పల్లవి :


మాట చాలదా..

ఉహుఁ..

మనసు చాలదా..

ఉహుఁ..

మాటలోని మనసులోని 

మమత తిలియదా..


మాట చాలదా..

ఉహుఁ..

మనసు చాలదా..

ఉహుఁ..

మాటలోని మనసులోని 

మమత తిలియదా..ఆ..

మాటలోని మనసులోని 

మమత తిలియదా..


దిక్కులు వినగా.. చుక్కలు కనగా

ఆ.. దిక్కులు వినగా.. చుక్కలు కనగా

పక్కన పలికే.. మక్కువ ఒలికే...


మాట చాలదా...

ఉహుఁ..

మనసు చాలదా..

ఉహుఁ..

మాటలోని మనసులోని 

మమత తిలియదా..ఆ..

మాటలోని మనసులోని 

మమత తిలియదా..


చరణం 1:


తోటలో పువుచెవిలో తుమ్మెద ఊదేదీ

గూటిలో ప్రియునితో గోరింక అనేదీ

తోటలో పువుచెవిలో తుమ్మెద ఊదేదీ

గూటిలో ప్రియునితో గోరింక అనేదీ...

కన్నులలోనా..

ఊఁఊఁఊఁ..

నవ్వులలోనా..

ఉహూఁ..

కన్నులలోనా నవ్వులలోనా.. 

ఒదిగీ దాగే మధుర రహస్యం

ఊఁహుహూఁహుహూఁ..


మాట చాలదా..

ఉహుఁ..

మనసు చాలదా..

ఉహుఁ..

మాటలోని మనసులోని 

మమత తిలియదా..ఆ..

మాటలోని మనసులోని 

మమత తిలియదా..


చరణం 2 :


ఒకరికి నా గుండెలో ఎప్పుడూ వసతీ

ఒక్కరే నా ప్రేమకు ఏనాటికి అతిథీ

ఒకరికే నా గుండెలో ఎప్పుడూ వసతీ

ఒక్కరే నా ప్రేమకు ఏ నాటికి అతిథీ

పదిలముగా నా..

ఊఁఊఁఊఁ..

హృదయములోనా..

ఉహూఁ..

పదిలముగా నా హృదయములోనా.. 

ఒదిగీ దాగే మధుర రహస్యం

ఊఁహుహూఁహుహూఁ..


మాట చాలదా..

ఉహుఁ..

మనసు చాలదా..

ఉహుఁ..

మాటలోని మనసులోని 

మమత తిలియదా..ఆ..

మాటలోని మనసులోని 

మమత తిలియదా..


ఊఁహుహూఁహుహూఁ.. 

ఊఁహుహూఁహుహూఁ..

ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. 

ఊఁహుహూఁహుహూఁ..

ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. 

ఊఁహుహూఁహుహూఁ..


- పాటల ధనుస్సు 



14, ఏప్రిల్ 2026, మంగళవారం

ఇది నిశీధ సమయం | Idi Nisheeda Samayam | Song Lyrics | Devadasu (1974)

ఇది నిశీధ సమయం 


చిత్రం :  దేవదాసు (1974)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : ఎస్ పి బాలు,

 

పల్లవి :


ఇది నిశీధ సమయం 

అది తిరుగులేని పయనం ఊ..

తిరిగి రాని పయనం 

తిరిగి రాని పయనం

ఇది నిశీధ సమయం.. 

అది తిరుగులేని పయనం

తిరిగి రాని పయనం.. 

ఇది నిశీధ సమయం


ఈ సమయం భ్రాంతి సుమా..  

ఆ పయనం మాయ సుమా..

అంటున్న నేను.. 

వింటున్న నీవు

అంతా మాయసుమా..  

అంతా భ్రాంతి సుమా


చరణం 1 :


అయిదు సరుకుల మేళవింపుతో.. 

తొమ్మిది తలుపుల భవనం

అందులోన నివాసం మాని 

హంస చేరురా గగనం

తానే లేని సదనంలో 

తలుపులు ఎందుకురా..

తిరిగి రానే రాని పయనంలో 

పిలుపులు ఎందుకురా


ఇది నిశీధ సమయం.. 

అది తిరుగులేని పయనం

తిరిగి రాని పయనం.. 

ఇది నిశీధ సమయం... 


చరణం 2 :


మరలా పుట్టుక.. 

మరలా చచ్చుట 

ఇరుసే లేని చక్రం

వచ్చేవారూ పొయేవారూ 

జగతి పురాతన సత్రం

రాకడకైనా పోకడకైనా 

కర్తవు కావుర నీవు

అన్ని అంచెలు దాటిన పిదప 

ఉన్నది కడపటి రేవు 


ఇది నిశీధ సమయం.. 

అది తిరుగులేని పయనం

తిరిగి రాని పయనం..  

ఇది నిశీధ సమయం


- పాటల ధనుస్సు 



జీవితం ఏమిటి వెలుతురూ చీకటి | Jeevitham Emiti | Song Lyrics | Devadas (1974)

జీవితం ఏమిటి వెలుతురూ చీకటి


చిత్రం :  దేవదాసు (1974)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : ఎస్ పి బాలు,


పల్లవి : 


జీవితం... ఏమిటి?

వెలుతురూ... చీకటి..  అంతే

జీవితం ఏమిటి...  

వెలుతురూ చీకటి అంతే

వెలుతురంతా చీకటైతే...  

అందులోనే సుఖము ఉన్నది

అవును.. జీవితం ఏమిటి...  

వెలుతురూ చీకటి 


చరణం 1 :


మనసు విరిగి తునకలైతే.. ఏ.... ఏ

తునక తునకలో... నరకమున్నది

మనసు విరిగి తునకలైతే.. ఏ.... ఏ

తునక తునకలో... నరకమున్నది 


లేదు లేదనుకున్న శాంతి 

చేదులోనే ఉన్నది

ఈ చేదులోనే ఉన్నది... 

హా... హా... హా... 


జీవితం ఏమిటి...  

వెలుతురూ చీకటి


చరణం 2 :


రామచిలక ఎగిరిపోతే... 

రాగబంధం సడలిపోతే

రామచిలక ఎగిరిపోతే... 

రాగబంధం సడలిపోతే 


మూగ హృదయం... 

గాయమైనది

ఆ గాయమే ఒక గేయమైనది...

ఆ గాయమే ఒక గేయమైనది...  


జీవితం ఏమిటి...  

వెలుతురూ చీకటి అంతే

వెలుతురంతా చీకటైతే... 

అందులోనే సుఖము ఉన్నది

 జీవితం ఏమిటి...  

వెలుతురూ చీకటి

వెలుతురూ....  చీకటి

వెలుతురూ....  చీకటి


- పాటల ధనుస్సు 


1, ఏప్రిల్ 2026, బుధవారం

చేనుకు గట్టుంది చెరువుకు గట్టుంది | Chenuku Gattundi | Song Lyrics | Meena (1974)

చేనుకు గట్టుంది చెరువుకు గట్టుంది 


చిత్రం: మీన (1974)

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

సంగీతం: రమేష్ నాయుడు

గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల


సాకి :


చేనుకు గట్టుంది 

ఇంటికి గడపుంది 

కంటికి రెప్పుండి 

కన్నెకు హద్దుంది 

హద్దు మీరిన కాలు జారినా 

అంతా గల్లంతవుతుంది 

గల్లంతవుతుంది 


పల్లవి :


అమ్మమ్మమ్మమ్మో 

అమ్మాయిగారండి 

ఆగండి చూడండి 

ఆపైన వెళ్ళండి 

ఆగండి చూడండి 

ఆపైన వెళ్ళండి వెళ్ళండి 


చరణం 1 :


పల్లే టూరి లో బస్తి నడకలు 

మార్చుకోవాలి 

కళ్ళు కాళ్ళు నేలమీదనే 

ఉంచుకోవాలి 


ముల్లుంటాయి రాళ్లుంటాయి

ముల్లుంటాయి రాళ్లుంటాయి

ఎత్తుపల్లాలుంటాయి 

మొండితనంతో పరుగులు తీస్తే 

ముందరి పళ్లే రాల్తాయి 


అమ్మమ్మమ్మమ్మో 

అమ్మాయిగారండి 

ఆగండి చూడండి 

ఆపైన వెళ్ళండి 

ఆగండి చూడండి 

ఆపైన వెళ్ళండి వెళ్ళండి 


చరణం 2 :


పంజరంలో చిలకకు మల్లే 

పెరిగావిన్నాళ్ళు 

రెక్కలు వచ్చాయనుకుని 

ఎగిరే వచ్చావీనాడు 


పంజరంలో చిలకకు మల్లే 

పెరిగావిన్నాళ్ళు 

రెక్కలు వచ్చాయనుకుని 

ఎగిరే వచ్చావీనాడు 


నువ్వనుకున్నట్టే  

అన్ని జరగవు 

నీకిష్టం లేదని ఏవి ఆగవు 


అమ్మమ్మమ్మమ్మో 

అమ్మాయిగారండి 

ఆగండి చూడండి 

ఆపైన వెళ్ళండి 

ఆగండి చూడండి 

ఆపైన వెళ్ళండి వెళ్ళండి 


- పాటల ధనుస్సు 


26, మార్చి 2026, గురువారం

పెళ్ళంటే నూరేళ్ల పంట | Pellante Noorella Panta | Song Lyrics | Meena (1973)

పెళ్ళంటే నూరేళ్ల పంట


చిత్రం : మీనా (1973)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : ఎస్ పి బాలు,


పల్లవి:


పెళ్ళంటే... నూరేళ్ల పంట

అది పండాలి.. 

కోరుకున్న వారి ఇంట పండాలి

బంధాలను తెంచుకొని.. 

బాధ్యతలను పెంచుకొని..

అడుగు ముందుకేశావమ్మా.. 

గడప దాటి కదిలావమ్మా

పెళ్ళంటే... నూరేళ్ల పంటా...


చరణం 1:


మనిషి విలువ పెరిగేది.. 

ధనం వల్ల కాదు

ప్రేమించే హృదయానికి.. 

పేదతనం లేదు

మనిషి విలువ పెరిగేది.. 

ధనం వల్ల కాదు

ప్రేమించే హృదయానికి.. 

పేదతనం లేదు


మనసులోని మమతలను.. 

తెలుసుకోరు పెద్దలు

మనసులోని మమతలను.. 

తెలుసుకోరు పెద్దలు

అందుకే.. తిరుగుబాటు 

చేసేరు పిల్లలు


పెళ్ళంటే... నూరేళ్ల పంట

అది పండాలి.. 

కోరుకున్న వారి ఇంట పండాలి

పెళ్ళంటే... నూరేళ్ల పంటా...


చరణం 2:


మంచి.. చెడు.. తెలిసి కూడా 

చెప్పలేని వారు

ఎవ్వరికీ.. పనికిరారు ...

ఏమి చేయలేరూ

మంచి.. చెడు.. తెలిసి కూడా 

చెప్పలేని వారు

ఎవ్వరికీ.. పనికిరారు... 

ఏమి చేయలేరూ


అన్నెం పున్నెం ఎరుగని 

అమాయకపు జీవులు

అపనిందలపాలవుతూ.. 

అలమటించుతారు

అన్నెం పున్నెం ఎరుగని 

అమాయకపు జీవులు

అపనిందలపాలవుతూ.. 

అలమటించుతారు


పెళ్ళంటే... నూరేళ్ల పంట ...

అది పండాలి.. 

కోరుకున్న వారి ఇంట పండాలి

పెళ్ళంటే... నూరేళ్ల పంటా...


చరణం 3:


మనసు ఒకరిపైనా.. 

మనువు ఒకరితోనా...

మనసు ఒకరిపైనా.. 

మనువు ఒకరితోనా

ఎలా కుదురుతుంది.. 

ఇది ఎలా జరుగుతుందీ..


కలిమి కాదు మగువకు 

కావలసింది...

కలిమి కాదు మగువకు 

కావలసింది...

మనసిచ్చిన వానితో.. 

మనువు కోరుకుందీ

మనసిచ్చిన వానితో.. 

మనువు కోరుకుందీ.. 

మనువు కోరుకుంది..


పెళ్ళంటే... నూరేళ్ల పంట

అది పండాలి.. 

కోరుకున్న వారి ఇంట పండాలి

బంధాలని తెంచుకొని.. 

బాధ్యతలను పెంచుకొని..

అడుగు ముందుకేశావమ్మా.. 

అడుగు ముందుకేశావమ్మా

పెళ్ళంటే... నూరేళ్ల పంటా...


- పాటల ధనుస్సు 


మల్లెతీగ వంటిది మగువ జీవితం | Malle Teega Vantidi | Song Lyrics | Meena (1973)

మల్లెతీగ వంటిది మగువ జీవితం


చిత్రం :  మీనా (1973)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  ఆరుద్ర

నేపథ్య గానం :  పి.సుశీల 


పల్లవి:


మల్లెతీగ వంటిది మగువ జీవితం

మల్లెతీగ వంటిది మగువ జీవితం

చల్లని పందిరి వుంటే... ఏ ఏ...

అల్లుకుపోయేనూ.. 

అల్లుకుపోయేనూ

మల్లెతీగ వంటిది మగువ జీవితం


చరణం 1:


తల్లితండ్రుల ముద్దూమురిపెం 

చిన్నతనంలో కావాలి

తల్లితండ్రుల ముద్దూమురిపెం 

చిన్నతనంలో కావాలి

ఇల్లాలికి పతి అనురాగం 

ఎల్లకాలమూ నిలవాలి

ఇల్లాలికి పతి అనురాగం 

ఎల్లకాలమూ నిలవాలి

తల్లికి పిల్లల ఆదరణ ఆ ఆ 

పండువయసులో కావాలి

ఆడవారికి అన్నివేళలా 

తోడూ నీడా ఉండాలి 

తోడూ నీడా ఉండాలి


మల్లెతీగ వంటిది మగువ జీవితం

చల్లని పందిరి వుంటే ..ఏ ఏ..

అల్లుకుపోయేనూ.. 

అల్లుకుపోయేనూ

మల్లెతీగ వంటిది మగువ జీవితం


చరణం 2:


నుదుట కుంకుమ కళకళలాడే 

సుదతే ఇంటికి శోభ

నుదుట కుంకుమ కళకళలాడే 

సుదతే ఇంటికి శోభ

పిల్లలపాపల ప్రేమతో పెంచే 

తల్లే ఆరని జ్యోతి

పిల్లలపాపల ప్రేమతో పెంచే 

తల్లే ఆరని జ్యోతి

అనురాగంతో మనసును దోచే 

వనితే మమతల పంట

జన్మను ఇచ్చి జాతిని నిలిపే 

జననియే జగతికి ఆధారం... 

జననియే జగతికి ఆధారం...


మల్లెతీగ వంటిది మగువ జీవితం

చల్లని పందిరి వుంటే ..ఏ ఏ..

అల్లుకుపోయేనూ.. 

అల్లుకుపోయేనూ

మల్లెతీగ వంటిది మగువ జీవితం...


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు