RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
srivaru mavaru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
srivaru mavaru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, సెప్టెంబర్ 2026, మంగళవారం

పూలు గుసగుసలాడేనని | Poolu Gusagusaladenani | Song Lyrics | Srivaru Mavaru (1973)

పూలు గుసగుసలాడేనని 


చిత్రం :  శ్రీవారు మావారు (1973)

సంగీతం :  జి.కె. వెంకటేశ్

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి

నేపధ్య గానం :  ఎస్ పి బాలు,


పల్లవి :


పూలు గుసగుసలాడేనని.. 

జతగూడేననీ..

గాలి ఈలలు వేసేనని.. 

సైగ చేసేననీ..

అది ఈరోజే తెలిసిందీ.. హా....


పూలు గుసగుసలాడేనని.. 

జతగూడేననీ..

గాలి ఈలలు వేసేనని.. 

సైగ చేసేననీ..

అది ఈరోజే తెలిసిందీ.. అ.... హా....

లాలలలల లాలల... 

లలలాలలల..

లాలలలల లాలల... 

లలలాలలల..


చరణం 1 :


మబ్బుకన్నెలు పిలిచేనని..

మనసు రివ్వున ఎగిసేనని..

వయసు సవ్వడి చేసేనని.. 

ఇపుడే తెలిసిందీ....

రు రు రు రు..ఆ..ఓ


పూలు గుసగుసలాడేనని.. 

జతగూడేననీ..

గాలి ఈలలు వేసేనని.. 

సైగ చేసేననీ..

అది ఈరోజే తెలిసిందీ.. అ....


చరణం 2 :


అలలు చేతులు సాచేనని..

నురుగు నవ్వులు పూచేనని..

నింగి నేలను తాకేనని..

నేడే తెలిసిందీ..!!

రు రు రు రు..ఆ.. ఓ..


పూలు గుసగుసలాడేనని.. 

జతగూడననీ..

గాలి ఈలలు వేసేనని.. 

సైగ చేసేననీ..

అది ఈరోజే తెలిసిందీ....

టుర్..ఆ ఆ హు...ఆ హు..


చరణం 3 :


టుర్..ఆ ఆ హు...ఆ హు..

పైరు పచ్చగ ఎదిగున్నది...

పల్లెపడుచుల విసురున్నది...

కొత్త సొగసే రమ్మన్నది...

గుండె ఝుమ్మన్నది...

రు..రు..రు..రు... హో..హొ..


పూలు గుసగుసలాడేనని.. 

జతగూడననీ..

గాలి ఈలలు వేసేనని.. 

సైగ చేసేననీ..

అది ఈరోజే తెలిసిందీ....


- పాటల ధనుస్సు



చేయి వేస్తే చాలు | Cheyi Veste Chalu | Song Lyrics | Srivaru Mavaru (1973)

చేయి వేస్తే చాలు 


చిత్రం :  శ్రీవారు మావారు (1973)

సంగీతం :  జి.కె. వెంకటేశ్

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  పి.సుశీల


పల్లవి :


చేయి వేస్తే చాలు 

చిర్రుమంటాడప్పా..

చూపుతోనే నన్నూ 

జుర్రు కుంటా డప్పా

ఏం ముంచు కొచ్చిందని 

యింతటి రుసరుసలు..

బావా .. దారికి రావా


చేయి వేస్తే చాలు 

చిర్రుమంటాడప్పా..

చూపుతోనే నన్నూ 

జుర్రుకుంటా డప్పా

ఏం ముంచు కొచ్చిందని 

యింతటి రుసరుసలు..

బావా.. దారికి రావా..


చరణం 1 :


రామ చిలక జామ పండు 

కొరికినప్పుడు.. 

ఏమి రుచులు నాలోన 

కలిగెనప్పుడు

రామ చిలక జామ పండు 

కొరికినప్పుడు.. 

ఏమి రుచులు నాలోన 

కలిగెనప్పుడు

చందమామ మొగలు మీద 

పొడిచినప్పుడు.. 

వయసు ఎన్నిరేకులో 

విప్పెనప్పుడు

ఏమని చెప్పను...  

ఎలా మనసు విప్పను?..

నీకు బదులుగా నేనే 

చెప్పవలసి వచ్చెను.. 

బావా.. దారికిరావా


చేయి వేస్తే చాలు

చిర్రుమంటాడప్పా.. 

చూపుతోనే నన్నూ 

జుర్రుకుంటా డప్పా

ఏం ముంచు కొచ్చిందని 

యింతటి రుసరుసలు.. 

బావా...  దారికిరావా


చరణం 2 :


గువ్వలాగ కన్నెమనసు 

ఎగురుతున్నది..

నీ గుండెలోని గూటి కొరకు 

తిరుగుతున్నది

గువ్వలాగ కన్నెమనసు 

ఎగురుతున్నది..

నీ గుండెలోని గూటి కొరకు 

తిరుగుతున్నది


లేతవలపు జింక లాగ 

దుముకు తున్నది..

నీ కౌగిలిలో నిలుపుకుంటె 

వొదిగి వుంటది

మేనత్త కూతురిని..  

నీ ముద్దు మరదల్ని..

మేనత్త కూతురిని.. 

నీ ముద్దు మరదల్ని

జతగా నువు లేకుంటే 

బ్రతుకంతా ఒంటరిని...

బావా..  దారికిరావా


చేయి వేస్తే చాలు 

చిర్రుమంటాడప్పా..

చూపుతోనే నన్నూ 

జుర్రుకుంటా డప్పా

ఏం ముంచు కొచ్చిందని 

యింతటి రుసరుసలు..

బావా.. దారికిరావా


- పాటల ధనుస్సు


ఈ వేళలో నా మనసు నీదే | Eevelalo Na Manasu Neede | Song Lyrics | Srivaru Mavaru (1973)

ఈ వేళలో నా మనసు నీదే 


చిత్రం :  శ్రీవారు మావారు (1973)

సంగీతం :  జి.కె. వెంకటేశ్

గీతరచయిత :  శ్రీశ్రీ

నేపధ్య గానం :  ఎల్. ఆర్. ఈశ్వరి, రామకృష్ణ


పల్లవి :


ఈ వేళలో...  నా మనసు నీదే.. 

వయసు నీదే

ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే


ఈ వేళలో...  నా మనసు నీదే.. 

వయసు నీదే

ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే


చరణం 1 :


నేనుంటినీ నీ వెంటనే.. హైహై..

నీవుంటివీ నా కంటనే..మ్మ్ హు

నా జీవితం నీ కోసమే.. ఓహో..

నీ యవ్వనం...  నా కోసమే

నీ యవ్వనం.. నా కోసమే... హాయ్..


ఈ వేళలో...  నా మనసు నీదే.. 

వయసు నీదే

ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే


చరణం 2 :


ఆగేది కాదోయి కాలం.. 

లాగాలి లోలోని సారం

ఆగేది కాదోయి కాలం.. 

లాగాలి లోలోని సారం

నేడుంది నీ కేల రేపు.. 

జీవించు ఈ కోంత సేపు

అహా..అహా..అహా..హా..హా..హా..ఆ


ఈ వేళలో...  నా మనసు నీదే.. 

వయసు నీదే

ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే


చరణం 3 :


చేరాలి కారామసాలా.. 

ఊగాలి వేగాల ఝాలా

చేరాలి కారామసాలా.. 

ఊగాలి వేగాల ఝాలా

సాగాలి గానాబజానా.. 

తానాన తందాన తానా

లలాల..లలాల.. లలలలాలలా


ఈ వేళలో...  నా మనసు నీదే.. 

వయసు నీదే

ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే


- పాటల ధనుస్సు


24, సెప్టెంబర్ 2026, గురువారం

అల్లరి చూపులవాడే | Allari Chupulavade | Song Lyrics | Srivaru Mavaru (1973)

అల్లరి చూపులవాడే 


చిత్రం :  శ్రీవారు మావారు (1973)

సంగీతం :  జి.కె. వెంకటేశ్

గీతరచయిత : సి.నారాయణరెడ్డి

నేపధ్య గానం :  ఎస్ జానకి


పల్లవి :


హొయ్.. అల్లరి చూపులవాడే.. 

అందాల నా చందూరూడే

హూయ్..హూయ్..   

అల్లరి చూపులవాడే.. 

అందాల నా చందూరూడే

ఏడున్నడో కాని వాడు.. 

రామ చక్కనోడే

చెంతకు చేరీ వింతగ 

చక్కలి గింతలు చేశాడే

చెక్కిలినీ నొక్కగనే.. 

చిక్కుల్లో పడ్డానే


అల్లరి చూపులవాడే.. 

అందాల నా చందూరూడే

ఏడున్నడో కాని.. 

వాడు రామ చక్కనోడే

చెంతకు చేరీ వింతగ 

చక్కలి గింతలు చేశాడే

చెక్కిలినీ నొక్కగనే.. 

చిక్కుల్లో పడ్డానే


అల్లరి చూపులవాడే.. 

వాడే వాడే

అందాల నా చందూరూడే..

ఏడే ఏడే


చరణం 1 :


అందాలన్నీ దోసిట 

దూసేనన్నాడే

ఎందుకే అమ్మీ యింతటి 

సిగ్గని అన్నాడే

అందాలన్నీ దోసిట 

దూసేనన్నాడే

ఎందుకే అమ్మీ యింతటి 

సిగ్గని అన్నాడే

కలగా నన్నే కవ్వించాడే.. 

అలలా నాలో పులకించాడే

అమ్మో..ఏ మందునే.. 

సందిటనే చేరగనే సగమైనానే


ఓ..అల్లరి చూపులవాడే...  

అందాల నా చందూరూడే

ఏడున్నడో కాని వాడు.. 

రామ చక్కనోడే

చెంతకు చేరీ వింతగ 

చక్కలి గింతలు చేశాడే

చెక్కిలినీ నొక్కగనే 

చిక్కుల్లో పడ్డానే

అల్లరి చూపులవాడే.. 

వాడే వాడే

అందాల నా చందూరూడే.. 

ఏడే ఏడే


చరణం 2 :


మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

మ్మ్ మ్మ్ లలలలలా

మ్మ్ మ్మ్ మ్మ్ హా..మ్మ్ మ్మ్ మ్మ్ హా..

లలలలలాలలా..హోయ్


చెయీ చెయీ కలపాలని.. 

అన్నాడే

రేయీ రేయీ కలవాలని.. 

అన్నాడే

చెయీ చెయీ కలపాలని.. 

అన్నాడే

రేయీ రేయీ కలవాలని.. 

అన్నాడే


ఎదలో వాడే.. ఎదుగుతున్నాడే

నిదురే కరువై.. వేగుతున్నానే

అమ్మో.. ఏ మందునే...  

ఓ యమ్మో యీ తాపం ఓపగలేనే

 

అల్లరి చూపులవాడే.. 

అందాల నా చందూరూడే

ఏడున్నడో కాని వాడు.. 

రామ చక్కనోడే

చెంతకు చేరీ వింతగ 

చక్కలి గింతలు చేశాడే

చెక్కిలినీ నొక్కగనే.. 

చిక్కుల్లో పడ్డానే


అల్లరి చూపులవాడే.. 

వాడే వాడే

అందాల నా చందూరూడే.. 

ఏడే ఏడే

ఏడున్నడో కాని వాడు.. 

రామ చక్కనోడే

చెంతకు చేరీ వింతగ 

చక్కలి గింతలు చేశాడే

చెక్కిలినీ నొక్కగనే.. 

చిక్కుల్లో పడ్డానే


- పాటల ధనుస్సు


4, మార్చి 2024, సోమవారం

పోలేవులే.. నీవు పోలేవులే | Polevule neevu polevule | Song Lyrics | Srivaru Mavaru (1973)

పోలేవులే.. నీవు పోలేవులే



చిత్రం :  శ్రీవారు మావారు (1973)

సంగీతం :  జి.కె. వెంకటేశ్

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  బాలు, సుశీల   


పల్లవి :


పోలేవులే.. నీవు పోలేవులే

పోలేవులే.. నీవు పోలేవులే

నీ మదిలో ఉన్నాను.. 

నా మనసే ఇచ్చాను

రావేలా.. కోపమా... 

తాపమా..నా ప్రియా 


పోలేవులే.. నీవు పోలేవులే

పోలేవులే.. నీవు పోలేవులే

నీ మదిలో ఉన్నాను.. 

నా మనసే ఇచ్చాను

రావేలా.. కోపమా... 

తాపమా..నా ప్రియా 



చరణం 1 :


మొదటి చూపులోనే మైమరిచాను.. 

కనులు కలవగానే కలగన్నాను

మొదటి చూపులోనే మైమరిచాను...

కనులు కలవగానే కలగన్నాను

ఎన్ని జన్మల ఈ ప్రేమబంధమో... 

నే నిన్ను వీడి ఉండలేనులే

రా ప్రియా...  నా ప్రియా 


పోలేవులే.. నీవు పోలేవులే


చరణం 2 :


మొదటి చూపులోనే మురిసిన నీవు... 

చెంత చేరగానే పొమ్మన్నావు

అమ్మగారి మాట నమ్మేదెట్లా... 

రా రమ్మని పిలువగనే వచ్చెదెట్లా

ముందు ఎన్నడు నీ పొందు కోరను...

నా దారి నేను పోతానులే...

రానులే... చాలులే

పోలేవులే.. నీవు పోలేవులే


చరణం 3 :


అందమైనా ఇలాటి వేళా... 

అందుకోవే గులాబి మాల

కోరికలే మాలికలై నీ మెడలో... 

వాలెను నేడు

ఎన్ని జన్మల ఈ స్నేహబంధమో.. 

నే నిన్ను వీడి పోలేనులే

ఓ ప్రియా.....  నా ప్రియా


పోలేవులే.. నీవు పోలేవులే

పోలేవులే.. నీవు పోలేవులే

నీ మదిలో ఉన్నాను... 

నా మనసే ఇచ్చాను

రావేలా..ఓ ప్రియా...  

నా ప్రియా...  నా ప్రియా


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు