RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

29, సెప్టెంబర్ 2026, మంగళవారం

చేయి వేస్తే చాలు | Cheyi Veste Chalu | Song Lyrics | Srivaru Mavaru (1973)

చేయి వేస్తే చాలు 


చిత్రం :  శ్రీవారు మావారు (1973)

సంగీతం :  జి.కె. వెంకటేశ్

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  పి.సుశీల


పల్లవి :


చేయి వేస్తే చాలు 

చిర్రుమంటాడప్పా..

చూపుతోనే నన్నూ 

జుర్రు కుంటా డప్పా

ఏం ముంచు కొచ్చిందని 

యింతటి రుసరుసలు..

బావా .. దారికి రావా


చేయి వేస్తే చాలు 

చిర్రుమంటాడప్పా..

చూపుతోనే నన్నూ 

జుర్రుకుంటా డప్పా

ఏం ముంచు కొచ్చిందని 

యింతటి రుసరుసలు..

బావా.. దారికి రావా..


చరణం 1 :


రామ చిలక జామ పండు 

కొరికినప్పుడు.. 

ఏమి రుచులు నాలోన 

కలిగెనప్పుడు

రామ చిలక జామ పండు 

కొరికినప్పుడు.. 

ఏమి రుచులు నాలోన 

కలిగెనప్పుడు

చందమామ మొగలు మీద 

పొడిచినప్పుడు.. 

వయసు ఎన్నిరేకులో 

విప్పెనప్పుడు

ఏమని చెప్పను...  

ఎలా మనసు విప్పను?..

నీకు బదులుగా నేనే 

చెప్పవలసి వచ్చెను.. 

బావా.. దారికిరావా


చేయి వేస్తే చాలు

చిర్రుమంటాడప్పా.. 

చూపుతోనే నన్నూ 

జుర్రుకుంటా డప్పా

ఏం ముంచు కొచ్చిందని 

యింతటి రుసరుసలు.. 

బావా...  దారికిరావా


చరణం 2 :


గువ్వలాగ కన్నెమనసు 

ఎగురుతున్నది..

నీ గుండెలోని గూటి కొరకు 

తిరుగుతున్నది

గువ్వలాగ కన్నెమనసు 

ఎగురుతున్నది..

నీ గుండెలోని గూటి కొరకు 

తిరుగుతున్నది


లేతవలపు జింక లాగ 

దుముకు తున్నది..

నీ కౌగిలిలో నిలుపుకుంటె 

వొదిగి వుంటది

మేనత్త కూతురిని..  

నీ ముద్దు మరదల్ని..

మేనత్త కూతురిని.. 

నీ ముద్దు మరదల్ని

జతగా నువు లేకుంటే 

బ్రతుకంతా ఒంటరిని...

బావా..  దారికిరావా


చేయి వేస్తే చాలు 

చిర్రుమంటాడప్పా..

చూపుతోనే నన్నూ 

జుర్రుకుంటా డప్పా

ఏం ముంచు కొచ్చిందని 

యింతటి రుసరుసలు..

బావా.. దారికిరావా


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

పువ్వూ నవ్వే గువ్వానవ్వే | Puvvu Navve Guvva Navve | Song Lyrics | Apadbhandavudu (1992)

పువ్వూ నవ్వే గువ్వానవ్వే  చిత్రం : ఆపద్భాంధవుడు (1992) సంగీతం : ఎం.ఎం. కీరవాణి గీతరచయిత : సి.నారాయణరెడ్డి నేపధ్య గానం : ఎస్ పి బాలు, చిత్ర ప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు