RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

21, సెప్టెంబర్ 2026, సోమవారం

ఓహో ఊరించే అమ్మాయీ | Oho Oorinche Ammayi | Song Lyrics | Lakshmi Nivasam (1968)

ఓహో ఊరించే అమ్మాయీ 


చిత్రం: లక్ష్మీ నివాసం (1968)

సంగీతం: కె.వి.మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్


పల్లవి:


ఓహో..ఊరించే అమ్మాయీ..

నేనేమి చేసేది

అందాల కన్నులు నన్ను..

తొందర చేశాయి

నీ అందాల కన్నులు నన్ను..

తొందర చేశాయి


ఓహో..వేధించే అబ్బాయి..

నేనేమి చేసేది

చూపుల్లో కైపులు..నన్ను 

బిత్తర చేశాయి

నీ చూపుల్లో కైపులు..నన్ను 

బిత్తర చేశాయి

ఓహో..ఓఓఓఓఓఓఓఓ


చరణం: 1


నీ పైట చెంగు కొస ఎగిరింది

నా పడుచుగుండె ఉసి కొలిపింది

నీ పైట చెంగు కొస ఎగిరింది

నా పడుచుగుండె ఉసి కొలిపింది


నీ చిలిపి పెదవి నను పిలిచింది

నా చెక్కిలి ఓయని పలికింది

నీ చిలిపి పెదవి నను పిలిచింది

నా చెక్కిలి ఓయని పలికింది


ఓహో..ఊరించే అమ్మాయీ..

నేనేమి చేసేది

అందాల కన్నులు నన్ను..

తొందర చేశాయి

నీ చూపుల్లో కైపులు..నన్ను 

బిత్తర చేశాయి

ఓహో..ఓఓఓఓఓఓఓఓ


చరణం: 2


నీ ఓర చూపులో ఒగరుంది

నా దోర మనసులో పొగరుంది

నీ ఓర చూపులో ఒగరుంది

నా దోర మనసులో పొగరుంది


నీ కోడె వయసులో వేడుంది

నా కొంటె తలపుతో రగిలింది

నీ కోడె వయసులో వేడుంది

నా కొంటె తలపుతో రగిలింది


ఓహో..వేధించే అబ్బాయి..

నేనేమి చేసేది

చూపుల్లో కైపులు..నన్ను 

బిత్తర చేశాయి

నీ అందాల కన్నులు నన్ను..

తొందర చేశాయి

ఓహో..ఓఓఓఓఓఓఓఓ


చరణం: 3


నీ లేత వలపు చిగురేసింది

విరజాజిలాగ పెనవేసింది

నీ లేత వలపు చిగురేసింది

విరజాజిలాగ పెనవేసింది


నా మేని సొగసు విరబూచింది

నీ కంటికి కానుక చేసింది

నా మేని సొగసు విరబూచింది

నీ కంటికి కానుక చేసింది


ఓహో..ఊరించే అమ్మాయీ..

నేనేమి చేసేది

అందాల కన్నులు నన్ను..

తొందర చేశాయి

నీ అందాల కన్నులు నన్ను..

తొందర చేశాయి


ఓహో..వేధించే అబ్బాయి..

నేనేమి చేసేది

చూపుల్లో కైపులు..నన్ను 

బిత్తర చేశాయి

నీ చూపుల్లో కైపులు..నన్ను 

బిత్తర చేశాయి

ఓహో..ఓఓఓఓఓఓఓఓ ఓహో..

ఓఓఓఓఓఓఓఓ

ఓహో..ఓఓఓఓఓఓఓఓ....


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓహో ఊరించే అమ్మాయీ | Oho Oorinche Ammayi | Song Lyrics | Lakshmi Nivasam (1968)

ఓహో ఊరించే అమ్మాయీ  చిత్రం: లక్ష్మీ నివాసం (1968) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ పల్లవి: ఓహో..ఊరించ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు