RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

21, సెప్టెంబర్ 2026, సోమవారం

చేయీ చేయీ కలుపు | Cheyi Cheyi Kalupu | Song Lyrics | Lakshmi Nivasam (1968)

చేయీ చేయీ కలుపు 


చిత్రం: లక్ష్మీ నివాసం (1968)

సంగీతం: కె.వి.మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్


పల్లవి:


చేయీ చేయీ కలుపు..

చెంపా చెక్కిలి కలుపు

కేరింతలతో వూరింపులతో..

కిలకిల కలకల నవ్వు


చేయీ చేయీ కలుపు..

చెంపా చెక్కిలి కలుపు

కేరింతలతో వూరింపులతో..

కిలకిల కలకల నవ్వు


చరణం: 1


నా కోర్కెలు గుర్రాలైతే..

ఎగరేసుకుపోతా నిన్నే

నా కోర్కెలు గుర్రాలైతే..

ఎగరేసుకుపోతా నిన్నే

నీవంతటి మగసిరివైతే..

నా అందాలిచ్చెద నీకే

నీ కన్నుల కాపురముంటా..

కనురెప్పల తలుపులు తియ్యి

నీ కన్నుల కాపురముంటా..

కనురెప్పల తలుపులు తియ్యి

నీ నీడకు తోడుగ వుంటా..

నీ బాసలు బాసట చెయ్యి


చేయీ చేయీ కలుపు..

చెంపా చెక్కిలి కలుపు

కేరింతలతో వూరింపులతో..

కిలకిల కలకల నవ్వు


చరణం: 2


నీ వలపులు ఎంతో యింపు..

నా దోసిలి నిండా నింపు

నీ వలపులు ఎంతో యింపు..

నా దోసిలి నిండా నింపు

నిను వీడని మైకమునవుతా..

నా మమతల మధువులచేత

నిను వీడని మైకమునవుతా..

నా మమతల మధువులచేత

పది చేతులు నాకే వుంటే..

బంధించెద బిగువుగ నిన్నే

పది చేతులు నాకే వుంటే..

బంధించెద బిగువుగ నిన్నే

జవరాలిని పిడికిట నిలిపే..

మొనగాడివి నువ్వే నువ్వే


చేయీ చేయీ కలుపు..

చెంపా చెక్కిలి కలుపు

కేరింతలతో వూరింపులతో..

కిలకిల కలకల నవ్వు


చేయీ చేయీ కలుపు..

చెంపా చెక్కిలి కలుపు

కేరింతలతో వూరింపులతో..

కిలకిల కలకల నవ్వు

హా హా హా హా హా హా


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

సోడా సోడా ఆంధ్రసోడా | Soda Soda Andhra Soda | Song Lyrics | Lakshmi Nivasam (1968)

సోడా సోడా ఆంధ్రసోడా  చిత్రం: లక్ష్మీ నివాసం   (1968) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: పిఠాపురం నాగేశ్వరరావు పల్లవి: సోడా సోడా ఆం...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు