RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, సెప్టెంబర్ 2026, శనివారం

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్ 

చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి


పల్లవి:


ఏమండోయ్.. నిదుర లేవండోయ్

ఏమండోయ్.. నిదుర లేవండోయ్

ఎందుకు కలలో కలవరింత

ఎవరిని తలచి పలవరింత

ఎదుటకురాగా ఏల ఈ మగత

ఏమండోయ్.. నిదుర లేవండోయ్


చరణం 1:


ప్రేయసి నిద్దుర లేపుట..

మోము చూపుట

పెళ్ళికి తదుపరి ముచ్చట..

ముందు జరుగుట.. 

చాలా అరుదట

కమ్మని యోగం కలిసిరాగా 

కన్నులు మూసి కపటమేల

బిగువు బింకం ఇంక చాలండోయ్


ఏమండోయ్..నిదుర లేవండోయ్


చరణం 2:


యువతులు దగ్గర చేరినచో 

యువకులు ఉరకలు వేసెదరే

కోరిన కోమలి చేరగనే 

కులుకులు అలుసైపోయినవా

కోరిన కోమలి చేరగనే 

కులుకులు అలుసైపోయినవా

గురకలు తీసే కుంభకర్ణ 

నటన మానండోయ్


ఏమండోయ్..నిదుర లేవండోయ్


చరణం 3:


నేనే వలచి రానిచో చెంత లేనిచో

నిదురే రాదని అంటిరి 

బ్రతుకనంటిరి మోసగించిరి

నిద్రాదేవిని వీడకుంటే 

ఉద్యోగాలు ఊడునండోయ్

నిద్రాదేవిని వీడకుంటే 

ఉద్యోగాలు ఊడునండోయ్

ఇద్దరి ఆశలు ఇంక క్లోజండోయ్


ఏమండోయ్..నిదుర లేవండోయ్

ఏమండోయ్..నిదుర లేవండోయ్


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు